AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మహిళ ప్రాణాలు కాపాడిన ఏఐ.. మరణం అంచుల నుంచి వెనక్కి!

AI in medicine: ప్రాణాపాయ స్థితిలో ఉన్న తన తల్లికి ఏఐ సాయంతో చికిత్స అందేలా చేశాడు బ్రిటన్‌కు చెందిన వైద్యుడు. పార్కిన్సన్స్ తో బాధపడుతున్న ఆమెకు వరుసగా ఫిట్స్ రావడంతో ఆమె పరిస్థితి విషమించింది. వైద్యులు కారణాన్ని గుర్తించలేకపోయారు. ఆమె బతికే అవకాశాలు కొన్ని గంటలు మాత్రమే అన్నారు. కుమారుడు ఏఐ సాయంతో తల్లి అనారోగ్యానికి కారణం గుర్తించాడు. విటమిన్ బి6 లోపం కారణం కావచ్చని ఏఐ సూచించింది. వైద్యులు విటమిన్ బి6 అందించడంతో ఆమెకు ఫిట్స్ ఆగాయి.

మహిళ ప్రాణాలు కాపాడిన ఏఐ.. మరణం అంచుల నుంచి వెనక్కి!
Doctors Said Woman Has Hours To Live, Son Used Ai To Stop Her Seizures
Sharada V
|

Updated on: Oct 25, 2026 | 10:41 PM

Share

AI in medicine: ప్రాణాపాయ స్థితిలో ఉన్న తన తల్లికి ఏఐ సాయంతో చికిత్స అందేలా చేశాడు బ్రిటన్‌కు చెందిన వైద్యుడు. పార్కిన్సన్స్ తో బాధపడుతున్న ఆమెకు వరుసగా ఫిట్స్ రావడంతో ఆమె పరిస్థితి విషమించింది. వైద్యులు కారణాన్ని గుర్తించలేకపోయారు. ఆమె బతికే అవకాశాలు కొన్ని గంటలు మాత్రమే అన్నారు. కుమారుడు ఏఐ సాయంతో తల్లి అనారోగ్యానికి కారణం గుర్తించాడు. విటమిన్ బి6 లోపం కారణం కావచ్చని ఏఐ సూచించింది. వైద్యులు విటమిన్ బి6 అందించడంతో ఆమెకు ఫిట్స్ ఆగాయి.

తల్లి పరిస్థితి విషమం.. ఆసుపత్రికి రావాలని ఫోన్

బ్రిటన్‌లోని ఆక్స్‌ఫర్డ్‌షైర్‌కు చెందిన ఎడ్వర్డ్ పాట్రిక్ ఎన్‌హెచ్‌ఎస్‌లో అనస్థీషియా వైద్యుడిగా పనిచేస్తున్నాడు. అతని తల్లి 70 ఏళ్ల ఆన్ పాట్రిక్ కు పార్కిన్సన్స్ వ్యాధి ఉంది. ఈ ఏడాది మే నెలలో ఆన్‌కు వరుసగా ఫిట్స్ వచ్చాయి. ఆమెను క్వీన్స్ ఆసుపత్రిలో చేర్చగా ఫిట్స్ ఎందుకు వస్తున్నాయో వైద్యులు గుర్తించలేకపోయారు. పరిస్థితి క్రమంగా విషమించింది. తెల్లవారుజామున 4 గంటలకు ఎడ్వర్డ్‌కు ఆసుపత్రి నుంచి ఫోన్ వచ్చింది. తల్లి పరిస్థితి ప్రమాదకరంగా ఉందని, ఆమె ప్రాణాలతో ఉండేది మరికొన్ని గంటలేనని చెప్పడంతో ఎడ్వర్డ్ వెంటనే ఆసుపత్రికి బయలుదేరాడు.

ఏఐ సాయంతో అసలు సమస్యను గుర్తించే ప్రయత్నం

ఆక్స్‌ఫర్డ్‌షైర్ నుంచి నాటింగ్‌హామ్‌కు కారులో బయలుదేరిన ఎడ్వర్డ్‌కు తన సోదరుడి నుంచి ఓ మెసేజ్‌ వచ్చింది. తల్లికి ఏదైనా విటమిన్ లోపం ఉండొచ్చని అతడు అనుమానం వ్యక్తం చేశాడు. దాంతో తల్లి లక్షణాలు, వైద్య పరీక్షల ఫలితాలు, స్కాన్ల వివరాలను ఏఐ టూల్‌లో నమోదు చేసి విశ్లేషించాడు. పార్కిన్సన్స్ వ్యాధికి ఆమె తీసుకుంటున్న మందులకు, విటమిన్ బి6 స్థాయులకు మధ్య సంబంధం ఉండవచ్చని, విటమిన్ బి6 లోపం ఆమెకు ఫిట్స్ రావడానికి కారణం కావచ్చని ఏఐ సూచించింది. దీంతో ఎడ్వర్డ్ ఆ వివరాలను తల్లికి చికిత్స అందిస్తున్న వైద్య బృందానికి తెలిపాడు.

విటమిన్ బి6 ఇవ్వగానే ఆగిన ఫిట్స్!

ఎడ్వర్డ్ అందించిన సమాచారాన్ని పరిశీలించిన వైద్యులు ఆన్‌కు విటమిన్ బి6ను నేరుగా రక్తనాళాల ద్వారా అందించారు. అనంతరం ఆమెకు ఫిట్స్ దాదాపు వెంటనే ఆగిపోయాయి. దీంతో ఆమె పరిస్థితిలో కీలకమైన మార్పు కనిపించింది. తన తల్లి మరణానికి చేరువైన పరిస్థితి నుంచి కోలుకోవడం ఎడ్వర్డ్‌కు నమ్మలేని అనుభవంగా మారింది. తాను చెబుతున్న ఈ సంఘటన నిజంగా జరిగిందా అని ప్రతిసారీ ఆశ్చర్యపోతుంటానని ఎడ్వర్డ్ సండే టైమ్స్’తో తన అనుభవాన్ని పంచుకున్నాడు.  మరణం అంచుల నుంచి తన తల్లి తిరిగి రావడం తనకు ఎంతో భావోద్వేగానికి గురిచేసిందని అన్నాడు.

మరో ప్రమాదకర సమస్యతోనూ ఇబ్బంది

ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో ఆన్‌కు రాబ్డోమయోలిసిస్ అనే మరో తీవ్ర సమస్య కూడా ఎదురైంది. ఈ పరిస్థితిలో దెబ్బతిన్న కండర కణజాలం విచ్ఛిన్నమై, అందులోని కొన్ని పదార్థాలు రక్తంలోకి విడుదలవుతాయి. అవి మూత్రపిండాలకు హాని చేస్తాయి. ఫిట్స్‌ కోసం వాడుతున్న మందులు, శారీరక శ్రమ రాబ్డోమయోలిసిస్‌కు కారణమైనట్లు గుర్తించారు.

ప్రస్తుతం ఆన్ పాట్రిక్ ఆరోగ్యం మెరుగుపడింది. ఆమె కుమారుడు తెలిపిన వివరాల ప్రకారం, చికిత్స పొందిన తర్వాత ఆమె మళ్లీ ఆసుపత్రిలో చేరాల్సిన పరిస్థితి రాలేదు. చిన్నదిగా కనిపించే విటమిన్ లోపం ఎంతటి తీవ్రమైన ఆరోగ్య సమస్యకు ఎలా దారితీస్తుందో ఈ ఘటన తెలియచేస్తోంది. సరైన సమయంలో ఏఐ అందిన సమాచారం వైద్య చికిత్సలో ఎంత ముఖ్య పాత్ర పోషించిందో స్పష్టం చేసింది.

Follow Us