AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

హైదరాబాద్‌ వెళ్లే వారికి బిగ్‌ షాక్‌..! చౌటుప్పల వద్ద ట్రాఫిక్‌ కష్టాలు! 5 కిలోమీటర్ల మేర వాహనాల జామ్‌!

దసరా పండుగ ముగియడంతో సొంతూళ్ల నుంచి హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణమైన ప్రజలతో విజయవాడ–హైదరాబాద్‌ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ భారీగా పెరిగింది. యాదాద్రి జిల్లా చౌటుప్పల పరిధిలో వాహనాలు కిలోమీటర్ల మేర బారులు తీరాయి. చౌటుప్పల మున్సిపాలిటీ పరిధిలోని లింగోజిగూడెం నుంచి ధర్మోజిగూడ వరకు సుమారు ఐదు కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌ నెమ్మదిగా కదులుతోంది.

హైదరాబాద్‌ వెళ్లే వారికి బిగ్‌ షాక్‌..! చౌటుప్పల వద్ద ట్రాఫిక్‌ కష్టాలు! 5 కిలోమీటర్ల మేర వాహనాల జామ్‌!
Traffic AlertImage Credit source: AI IMAGE
Balaraju Goud
|

Updated on: Oct 25, 2026 | 7:18 PM

Share

యాదాద్రి భువనగిరి జిల్లా: దసరా పండుగ ముగియడంతో సొంతూళ్ల నుంచి హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణమైన ప్రజలతో విజయవాడ–హైదరాబాద్‌ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ భారీగా పెరిగింది. యాదాద్రి జిల్లా చౌటుప్పల పరిధిలో వాహనాలు కిలోమీటర్ల మేర బారులు తీరాయి. చౌటుప్పల మున్సిపాలిటీ పరిధిలోని లింగోజిగూడెం నుంచి ధర్మోజిగూడ వరకు సుమారు ఐదు కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌ నెమ్మదిగా కదులుతోంది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

పండుగ ముగియడంతో ఒక్కసారిగా పెరిగిన రద్దీ!

దసరా పండుగ సందర్భంగా చాలామంది హైదరాబాద్‌ నుంచి తమ సొంత గ్రామాలకు వెళ్లారు. సెలవులు ముగియడంతో ఉద్యోగులు, వ్యాపారులు, విద్యార్థులు తిరిగి నగరానికి చేరుకునేందుకు బయలుదేరారు. దీంతో హైదరాబాద్‌–విజయవాడ జాతీయ రహదారిపై ఒక్కసారిగా వాహనాల సంఖ్య పెరిగింది. కార్లు, బస్సులు, ఇతర వాహనాలు పెద్ద సంఖ్యలో రోడ్డుపైకి రావడంతో చౌటుప్పల వద్ద ట్రాఫిక్‌ ఒత్తిడి పెరిగింది.

ఫ్లైఓవర్‌ నిర్మాణ పనులతో ఇబ్బందులు

చౌటుప్పలలో కొనసాగుతున్న ఫ్లైఓవర్‌ నిర్మాణ పనులు ట్రాఫిక్‌ సమస్యను మరింత తీవ్రం చేస్తున్నాయి. నిర్మాణ పనుల కారణంగా వాహనాలను సర్వీస్‌ రోడ్ల మీదుగా మళ్లించాల్సి వస్తోంది. ఇరుకైన రహదారిపై భారీగా వాహనాలు చేరడంతో వాహనాల వేగం తగ్గిపోతోంది. కొన్ని ప్రాంతాల్లో వాహనాలు ముందుకు కదిలేందుకు కూడా ఎక్కువ సమయం పడుతోంది.

దసరా రద్దీకి తోడు నిర్మాణ పనులు కొనసాగుతుండటంతో హైదరాబాద్‌ వైపు ప్రయాణించే వారితో పాటు విజయవాడ వైపు వెళ్లేవారికీ ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితి ఏర్పడింది. వాహనదారులు గమ్యస్థానాలకు చేరుకోవడానికి అదనపు సమయం కేటాయించుకోవాల్సి వస్తోంది. అందుచేత ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా హైదరాబాద్ చేరుకునేలా ఫ్లాన్ చేసుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు.

ఫ్లైఓవర్‌ పనులు త్వరగా పూర్తి చేయాలని డిమాండ్‌!

చౌటుప్పలలో తరచూ ట్రాఫిక్‌ సమస్యలు తలెత్తుతుండటంపై స్థానికులు, ప్రయాణికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఫ్లైఓవర్‌ నిర్మాణ పనులను వేగవంతం చేసి వీలైనంత త్వరగా పూర్తి చేయాలని కోరుతున్నారు. రద్దీ సమయాల్లో ట్రాఫిక్‌ నియంత్రణను మరింత పటిష్ఠం చేయడంతో పాటు, వాహనాల మళ్లింపునకు స్పష్టమైన ఏర్పాట్లు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

వాహనదారులు అప్రమత్తంగా ఉండాలి

చౌటుప్పల మీదుగా హైదరాబాద్‌–విజయవాడ మార్గంలో ప్రయాణించేవారు ట్రాఫిక్‌ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ముందుగానే బయలుదేరడం మంచిది. సర్వీస్‌ రోడ్లపై వేగం తగ్గించి, ట్రాఫిక్‌ నిబంధనలు పాటించాలి. పోలీసుల సూచనలను అనుసరిస్తూ సురక్షితంగా ప్రయాణించాలని సూచిస్తున్నారు. దసరా రద్దీ తగ్గినా.. ఫ్లైఓవర్‌ నిర్మాణ పనులు పూర్తయ్యే వరకు చౌటుప్పల వద్ద ట్రాఫిక్‌ కష్టాలు కొనసాగే అవకాశం ఉంది.

వీడియో ఇక్కడ చూడండి..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us