AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పచ్చటి కొబ్బరిబోండం చూసి మోసపోకండి.. ఎక్కువ నీళ్లున్న కాయను ఇలా గుర్తించండి..

కొబ్బరినీళ్లు శరీరానికి అమృతంలాంటివి. రోడ్డు పక్కన కనిపించే పచ్చటి కొబ్బరి బొండాన్ని చూసి ఫ్రెష్ అనుకుని కొంటున్నారా? అయితే మీరు మోసపోయినట్లే.. పాతబడిన, కుళ్లిపోయిన కొబ్బరికాయలను కూడా కెమికల్ రంగులు వేసి పచ్చిగా మార్చేస్తున్న చీకటి దందా మార్కెట్లో జోరుగా సాగుతోంది. అసలైన తాజా, నీళ్లు ఎక్కువ కొబ్బరి బొండాన్ని, రంగు పూసిన నకిలీ బొండాన్ని ఎలా గుర్తించాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం..

Krishna S
|

Updated on: Oct 25, 2026 | 5:48 PM

Share
కొబ్బరిబోండం కొనేటప్పుడు మొదటగా దాని రంగును గమనించాలి. సహజమైన తాజా కొబ్బరిబోండాలు సహజ సిద్ధమైన ఆకుపచ్చ రంగులో ఉంటాయి. అలా కాకుండా బొండం మరీ అసాధారణమైన మెరుపుతో లేదా ముదురు పచ్చగా కనిపిస్తే, అది తాజాదిగా కనిపించేందుకు రంగు వేసి ఉండవచ్చని అనుమానించాలి. సహజమైన కాయలపై లేత పసుపు, గోధుమ లేదా తెల్లటి మచ్చలు కనిపించడం సర్వసాధారణం.

1 / 5
బొండం సైజు మాత్రమే కాకుండా దాని బరువును పరిశీలించడం తాజాదనాన్ని గుర్తించే సులువైన మార్గం. పరిమాణం చిన్నదైనా లేదా మధ్యస్థంగా ఉన్నా, చేతిలోకి తీసుకోగానే బరువుగా అనిపిస్తే అందులో నీరు సమృద్ధిగా, తాజాగా ఉందని అర్థం చేసుకోవచ్చు. దీనికి విరుద్ధంగా కాయ పెద్దగా కనిపించినా చేతికి తేలికగా తగిలితే, లోపల నీరు ఎండిపోయిందని లేదా ముదిరిపోయిని గ్రహించాలి. బొండాన్ని చెవి దగ్గర పెట్టి ఊపినప్పుడు నీటి శబ్దం ఎక్కువగా వస్తే లోపల ఖాళీ స్థలం ఎక్కువై నీరు తగ్గిందని అర్థం. అదే నీరు నిండుగా ఉండే తాజా లేత బొండాల్లో శబ్దం చాలా తక్కువగా లేదా ఒక లయబద్ధంగా వినిపిస్తుంది.

2 / 5
కొబ్బరికాయ తొడిమ భాగంలో ఉండే మూడు కళ్ల భాగాన్ని నిశితంగా గమనించాలి. ఈ ప్రదేశం ఎల్లప్పుడూ పొడిగా, దృఢంగా, శుభ్రంగా ఉండాలి. అక్కడ తేమ చేరినా, బూజు పట్టినా, లేదా నొక్కినప్పుడు మెత్తగా అనిపించినా ఆ కాయ లోపల కుళ్లిపోవడం ప్రారంభమైందని అర్థం. ముదిరిన కాయల్లో నీటి శాతం తగ్గి కొబ్బరి గట్టిపడటమే కాకుండా అందులోని ఎలక్ట్రోలైట్ల సమతుల్యత మారుతుంది. లేత కొబ్బరి నీళ్లలో గ్లూకోజ్, అవసరమైన ఖనిజాలు సహజ రూపంలో ఉండి శరీరానికి అమితమైన మేలు చేస్తాయి కాబట్టి తొడిమ భాగం తాజాదనానికి బలమైన నిదర్శనంగా పనిచేస్తుంది.

3 / 5
కొబ్బరికాయ ఉపరితలాన్ని క్షుణ్ణంగా పరిశీలించడం మరో ముఖ్యమైన అంశం. బొండంపై పగుళ్లు, లోతైన కోతలు లేదా ఏదైనా భాగం నుంచి నీరు కారుతున్న గుర్తులు ఉంటే వాటిని ఎట్టిపరిస్థితుల్లోనూ కొనకూడదు. పగుళ్ల ద్వారా బయటి క్రిములు, బ్యాక్టీరియా లోపలి నీటిలోకి చేరి నీరు విషపూరితంగా మారే అవకాశం ఉంటుంది. అలాగే కాయపై నల్లటి మచ్చలు, బూజు లేదా జిగురు లాంటి పదార్థం కనిపిస్తే అది రోజుల తరబడి నిల్వ ఉన్నట్లు సంకేతం. రవాణా సమయంలో దెబ్బతిన్న కాయల లోపలి నీరు త్వరగా పులిసిపోయి దుర్వాసన వస్తాయి కాబట్టి మృదువైన, దృఢమైన ఉపరితలం ఉన్నవాటినే ఎంచుకోవాలి.

4 / 5
కొబ్బరి బొండాలు కొనుగోలు చేసే వ్యాపారి విశ్వసనీయత కూడా అత్యంత కీలక పాత్ర పోషిస్తుంది. రోడ్ల పక్కన నేరుగా తీవ్రమైన ఎండలో, దుమ్ముధూళిలో వారాల తరబడి కుప్పలుగా పోసి ఉంచే వ్యాపారుల వద్ద కొనుగోలు చేయడం మంచిది కాదు. ఎండ వేడికి లోపలి నీరు సహజ గుణాలను కోల్పోతుంది. ఎప్పటికప్పుడు తాజా స్టాక్ తెప్పిస్తూ, నీడలో నిల్వ చేసే నమ్మకమైన వారి వద్ద కొనుగోలు చేయడమే బెస్ట్.

5 / 5
Follow Us