AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పేదరికం ముందు ఆగిన కల.. బ్లింకిట్‌ డెలివరీ బాయ్‌ను కన్నీళ్లు పెట్టించిన సర్‌ప్రైజ్‌..!

పెరుగుతున్న ఖర్చులు, తక్కువ ఆదాయం.. రోజంతా కష్టపడినా సొంతంగా బైక్ కొనలేని పరిస్థితి. సైకిల్‌పై తిరుగుతూ ఆర్డర్లు డెలివరీ చేస్తున్న ఓ బ్లింకిట్‌ ఏజెంట్‌ జీవితంలో అనూహ్యమైన సంఘటన చోటుచేసుకుంది. అతడి కష్టాలను తెలుసుకున్న ముంబైకి చెందిన పరోపకారి, సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌ హుస్సేన్‌ మన్సూరి సరికొత్త స్కూటర్‌ను బహుమతిగా ఇచ్చారు.

పేదరికం ముందు ఆగిన కల.. బ్లింకిట్‌ డెలివరీ బాయ్‌ను కన్నీళ్లు పెట్టించిన సర్‌ప్రైజ్‌..!
Emotional Moment
Balaraju Goud
|

Updated on: Oct 25, 2026 | 6:03 PM

Share

ముంబై: పెరుగుతున్న ఖర్చులు, తక్కువ ఆదాయం.. రోజంతా కష్టపడినా సొంతంగా బైక్ కొనలేని పరిస్థితి. సైకిల్‌పై తిరుగుతూ ఆర్డర్లు డెలివరీ చేస్తున్న ఓ బ్లింకిట్‌ ఏజెంట్‌ జీవితంలో అనూహ్యమైన సంఘటన చోటుచేసుకుంది. అతడి కష్టాలను తెలుసుకున్న ముంబైకి చెందిన పరోపకారి, సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌ హుస్సేన్‌ మన్సూరి సరికొత్త స్కూటర్‌ను బహుమతిగా ఇచ్చారు. ఈ బహుమతిని చూసిన డెలివరీ ఏజెంట్‌ సుజీత్‌ భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకున్నాడు. ప్రస్తుతం ఈ హృదయాలను హత్తుకునే వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

సైకిల్‌పైనే రోజువారీ డెలివరీలు

ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసిన వీడియో ప్రకారం.. సుజీత్‌ అనే యువకుడు సైకిల్‌పై ఓ ఆర్డర్‌ను డెలివరీ చేయడానికి వెళ్తుండగా హుస్సేన్‌ మన్సూరి అతడిని ఆపి మాట్లాడారు. అతడి పేరు, పని గురించి అడిగి తెలుసుకున్నారు. సైకిల్‌పైనే డెలివరీలు ఎందుకు చేస్తున్నావని, బైక్‌ ఎందుకు కొనుగోలు చేయలేదని ప్రశ్నించారు. దీనికి సుజీత్‌ తన ఆర్థిక పరిస్థితిని వివరిస్తూ.. “సర్‌, ఇంత తక్కువ సంపాదనతో బైక్‌ ఎలా కొనగలం? ఖర్చులు చాలా పెరిగిపోయాయి” అని చెప్పాడు. పెరుగుతున్న నిత్యావసరాల ధరలు, జీవన వ్యయాల మధ్య ద్విచక్ర వాహనం కొనడం తనకు కష్టంగా మారిందని వివరించాడు.

సర్‌ప్రైజ్‌ అంటూ.. కళ్లకు గంతలు కట్టి!

సుజీత్‌ పరిస్థితిని తెలుసుకున్న మన్సూరి అతడికి ఓ సర్‌ప్రైజ్‌ ఇస్తానని చెప్పారు. ముందుగా తన డెలివరీ పూర్తి చేసి తిరిగి రావాలని కోరారు. అతడు తిరిగి వచ్చిన తర్వాత కళ్లకు గంతలు కట్టి, ఎర్రటి కవర్‌తో కప్పి ఉంచిన బహుమతి వద్దకు తీసుకెళ్లారు. ఆ కవర్‌ను తొలగించగానే అక్కడ కొత్త స్కూటర్‌ కనిపించింది. “ఇది అనంత్‌ అంబానీ గారి తరఫున మీకు అందిస్తున్న చిన్న బహుమతి” అని మన్సూరి చెప్పడంతో సుజీత్‌ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

కన్నీళ్లతో కృతజ్ఞతలు

తనకు స్కూటర్‌ బహుమతిగా లభించిందని తెలుసుకున్న సుజీత్‌ భావోద్వేగానికి గురయ్యాడు. హుస్సేన్‌ మన్సూరిని కౌగిలించుకుని కన్నీళ్లు పెట్టుకున్నాడు. మాటలు రాక కొద్దిసేపు మౌనంగా ఉండిపోయి, చివరకు “థాంక్యూ సర్‌” అంటూ కృతజ్ఞతలు తెలిపాడు. తన రోజువారీ పనిని మరింత సులభంగా చేసుకునేందుకు ఉపయోగపడే బహుమతి లభించడంతో అతడి ఆనందం వీడియోలో స్పష్టంగా కనిపించింది.

గిగ్‌ వర్కర్లకు అండగా సేవా కార్యక్రమం

ఈ బహుమతి అనంత్‌ సేవా ఫౌండేషన్‌ చేపట్టిన కార్యక్రమంలో భాగంగా అందించారు. రాహుల్‌ కనాల్‌, హుస్సేన్‌ మన్సూరి సహకారంతో ముంబైలో కష్టపడి పనిచేసే ప్రజలకు ఎలక్ట్రిక్‌ ద్విచక్ర వాహనాలను అందించే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. మహా నగరంలో రోజువారీ సేవలు అందిస్తూ జీవనోపాధి పొందే కార్మికులకు రవాణా సౌకర్యం కల్పించడం ఈ కార్యక్రమం లక్ష్యంగా పేర్కొంటున్నారు.

వైరల్ వీడియోను ఇక్కడ చూడండి..

ఈ వీడియో సోషల్‌ మీడియాలో 46 మిలియన్లకు పైగా వీక్షణలు సాధించింది. నెటిజన్లు సుజీత్‌ ఆనందాన్ని చూసి భావోద్వేగానికి గురవుతున్నారు. కష్టపడి పనిచేసే డెలివరీ సిబ్బందికి ఇలాంటి సాయం ఎంతో ఉపయోగపడుతుందని పలువురు ప్రశంసిస్తున్నారు. హుస్సేన్‌ మన్సూరి గతంలోనూ సేవా కార్యక్రమాలకు సంబంధించిన వీడియోలను పంచుకున్నారు. అస్సాంలో వరదలతో ప్రభావితమైన కుటుంబాలకు తన బృందంతో కలిసి పడకలను పంపిణీ చేశారు.

ఈ ఘటన మరోసారి గుర్తుచేసిన విషయం ఒక్కటే.. రోజూ మన ఇంటి గుమ్మం వరకు వస్తువులను తీసుకొచ్చే డెలివరీ కార్మికుల వెనుక కూడా ఎన్నో ఆర్థిక ఇబ్బందులు, వ్యక్తిగత పోరాటాలు ఉంటాయి. అలాంటి సమయంలో అందే చిన్న సహాయం కూడా వారి జీవితంలో పెద్ద మార్పుకు దారితీయవచ్చు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
అతడు లేకపోతే నేను ఇండస్ట్రీకి వచ్చేవాడినే కాదు..
అతడు లేకపోతే నేను ఇండస్ట్రీకి వచ్చేవాడినే కాదు..
మొబైల్‌ యూజర్లకు బిగ్‌ అలర్ట్‌.. నవంబర్‌ 1 నుంచి కొత్త రూల్‌..!
మొబైల్‌ యూజర్లకు బిగ్‌ అలర్ట్‌.. నవంబర్‌ 1 నుంచి కొత్త రూల్‌..!
ముగ్గురిని మింగేసిన నీటి కుంట..!
ముగ్గురిని మింగేసిన నీటి కుంట..!
అనంత్‌ అంబానీ చేసిన పనికి కన్నీళ్లు పెట్టుకున్న బ్లింకిట్ ఏజెంట్!
అనంత్‌ అంబానీ చేసిన పనికి కన్నీళ్లు పెట్టుకున్న బ్లింకిట్ ఏజెంట్!
డబుల్ ఎలిమినేషన్‌లో బిగ్ ట్విస్ట్.. నెటిజన్స్ కామెంట్స్ ఇవే..
డబుల్ ఎలిమినేషన్‌లో బిగ్ ట్విస్ట్.. నెటిజన్స్ కామెంట్స్ ఇవే..
ఇంటర్ విద్యార్థి అద్భుత ఆలోచన.. షిప్పింగ్ కంటైనర్‌లో క్లాస్‌రూమ్!
ఇంటర్ విద్యార్థి అద్భుత ఆలోచన.. షిప్పింగ్ కంటైనర్‌లో క్లాస్‌రూమ్!
పచ్చటి కొబ్బరిబోండం చూసి మోసపోకండి.. ఎక్కువ నీళ్లున్న కాయను..
పచ్చటి కొబ్బరిబోండం చూసి మోసపోకండి.. ఎక్కువ నీళ్లున్న కాయను..
నాలుగు రోజుల్లో వెండి ధర రూ.16 వేలు పతనం..బంగారం ఎంత తగ్గిందంటే..
నాలుగు రోజుల్లో వెండి ధర రూ.16 వేలు పతనం..బంగారం ఎంత తగ్గిందంటే..
సెంచరీలతో చెలరేగిన హర్మన్‌, దీప్తి శర్మ.. జింబాబ్వే టార్గెట్ 329
సెంచరీలతో చెలరేగిన హర్మన్‌, దీప్తి శర్మ.. జింబాబ్వే టార్గెట్ 329
‘డర్టీ పిక్చర్’ లాంటి రోల్స్ కోసం విద్యాబాలన్ వెయిటింగ్‌
‘డర్టీ పిక్చర్’ లాంటి రోల్స్ కోసం విద్యాబాలన్ వెయిటింగ్‌