South Central Railways: ఒక్కరోజులో రికార్డు స్థాయిలో జరిమానాలు వసూలు చేసిన రైల్వే డివిజన్ ఇదే..
దక్షిణ మధ్య రైల్వేలో ఉన్న అన్ని డివిజన్లలో విజయవాడ డివిజన్ అత్యంత రద్దీగా ఉంటుంది. ఈ డివిజన్ మీదుగా ఉత్తర,దక్షిణ భారతదేశాన్ని కలుపుతూ ప్రయాణించే ముఖ్యమైన రైళ్లు ప్రయాణిస్తుంటాయి. ఎస్‌సీఆర్ జోన్‌లో అత్యధిక ఆదాయాన్నిచ్చే డివిజన్ కూడా ఇదే. అయితే రైల్వే ఆదాయానికి గండికొట్టే వారిపై ప్రత్యేక దృష్టి పెట్టారు విజయవాడ డివిజన్ అధికారులు. టిక్కెట్ లేకుండా రైళ్లలో ప్రయాణించడం, రైల్వే స్టేషన్ లోకి ప్రవేశించినప్పుడు ప్రయాణికులతో పాటు వచ్చేవారు ప్లాట్ ఫామ్ టిక్కెట్

దక్షిణ మధ్య రైల్వేలో ఉన్న అన్ని డివిజన్లలో విజయవాడ డివిజన్ అత్యంత రద్దీగా ఉంటుంది. ఈ డివిజన్ మీదుగా ఉత్తర,దక్షిణ భారతదేశాన్ని కలుపుతూ ప్రయాణించే ముఖ్యమైన రైళ్లు ప్రయాణిస్తుంటాయి. ఎస్‌సీఆర్ జోన్‌లో అత్యధిక ఆదాయాన్నిచ్చే డివిజన్ కూడా ఇదే. అయితే రైల్వే ఆదాయానికి గండికొట్టే వారిపై ప్రత్యేక దృష్టి పెట్టారు విజయవాడ డివిజన్ అధికారులు. టిక్కెట్ లేకుండా రైళ్లలో ప్రయాణించడం, రైల్వే స్టేషన్ లోకి ప్రవేశించినప్పుడు ప్రయాణికులతో పాటు వచ్చేవారు ప్లాట్ ఫామ్ టిక్కెట్ తీసుకోకపోవడం, జనరల్ టిక్కెట్లు తీసుకుని రిజర్వేషన్ కోచ్‌లలో ప్రయాణించడం, ఒక ప్రాంతానికి టిక్కెట్ తీసుకుని మరో ప్రాంతానికి ప్రయాణించడం, ఎక్కువ లగేజి తీసుకెళ్తూ ఎలాంటి లగేజి టిక్కెట్ తీసుకోకపోవం వంటి వారిపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. ఇలా రైల్వే ఆదాయానికి గండికొట్టే వారిని అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టారు విజయవాడ రైల్వే డివిజన్ అధికారులు. దీనికోసం నవంబర్ ఆరో తేదీ సోమవారం స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. మెగా టిక్కెట్ చెకింగ్ డ్రైవ్ ద్వారా భారీగా జరిమానాలు విధించారు అధికారులు. ఈ జరిమానాల ద్వారా కొత్త రికార్డు సృష్టించినట్లు దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్ పీఆర్వో నుస్రత్ తెలిపారు.
డివిజన్ మొత్తంలో 24.5 లక్షలు
విజయవాడ డివిజన్ పరిధిలోని అన్ని రూట్లలో మెగా టికెట్ చెకింగ్ డ్రైవ్ నిర్వహించారు అధికారులు..సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ వావిలాలపల్లి రాంబాబు ఆధ్వర్యంలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. దీంతో పాటు విజయవాడ రైల్వే స్టేషన్ లో కూడా ప్రత్యేకంగా తనికీలు చేసారు. మొత్తం 135 మంది చెకింగ్ స్టాఫ్ ఈ తనిఖీల్లో పాల్గొన్నారు. స్క్వాడ్ టీటీఈలు,స్టేషన్ సిబ్బంది, ప్రో కమర్షియల్ క్లర్క్ లు, టిక్కెట్ కలెక్టర్లు కలిపి మొత్తం 48 రైళ్లలో తనిఖీలు చేసారు. ఒక్క రోజులో డివిజన్ పరిధిలో 3,484 కేసులు నమోదు చేసి 24.5 లక్షలు జరిమానా రూపంలో వసూలు చేసారు. ఇంత మొత్తంలో జరిమానాలు ద్వారా వసూలు చేయడం విజయవాడ డివిజన్ పరిధిలో ఇదే ప్రథమం అంటున్నారు అధికారులు.
ఇలా నమోదు చేసిన కేసుల్లో 1641 కేసులు టిక్కెట్ లేకుండా ప్రయాణిస్తున్న వారిపై నమోదు చేసినవి. వీరి వద్ద నుంచి 15.41 లక్షల రూపాయిలు వసూలు చేసారు. ఇక సరైన టిక్కెట్ లేకుండా ప్రయాణిస్తున్న 1825కి 9.10 లక్షల జరిమానా విధించారు. డివిజన్ మొత్తం ఒక ఎత్తయితే ఒక్క విజయవాడ రైల్వే స్టేషన్ లోనే భారీగా కేసులు నమోదయ్యాయి. విజయవాడ రైల్వే స్టేషన్ లో మొత్తం 86 మంది చెకింగ్ స్టాఫ్ తో పాటు 10 మంది రైల్వే పోలీసులు తనిఖీలు చేసారు. రైల్వే స్టేషన్ లోపలికి ప్రవేశించే, బయటికి వెళ్లే మార్గాల వద్ద చెకింగ్ చేసారు. అధిక లగేజితో వెళ్తున్న ప్రయాణికులు పార్సిల్ ఆఫీస్ వద్ద బుకింగ్ చేసుకుని వెళ్లాలని సూచించారు. విజయవాడ స్టేషన్ లో మొత్తం 1294 కేసులు నమోదు చేసి వారి వద్ద నుంచి 8.68 లక్షల రూపాయిలను జరిమానా కింద వసూలు చేసారు. మరోవైపు అనుమతి లేకుండా వివిధ వస్తువులు విక్రయిస్తున్న వారికి 45 వేల జరిమానా విధించారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




