AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: దేవాలయంలోనే ఇంటి దొంగ.. ఎలా దొరికాడంటే ?

ఇంటి దొంగను ఈశ్వరుడైన పట్టుకోలేరంటారు. కానీ నిఘానేత్రమైన సీసీ కెమెరా పట్టేసింది. దేవాలయంలో ఆలయ పరిచారికుడిగా పనిచేస్తున్న వ్యక్తే హుండీలోని నగదును దర్జాగా తీసుకుని వాడుకుంటున్నాడు. గతకొంతకాలంగా గుట్టుగా పని కానిచ్చేస్తున్నాడు. కానీ చివరికి ఆలయంలోని సీసీ కెమెరాల ద్వారా ఆ ఇంటి దొంగను దొరికిపోయాడు. అంతకుముందు హుండీలో డబ్బులు తక్కువగా వస్తుండటంతో ఎవరో చోరీకి పాల్పడుతున్నారని ఆలయ నిర్వాహకులకు అనుమానం వచ్చింది.

Andhra Pradesh: దేవాలయంలోనే ఇంటి దొంగ.. ఎలా దొరికాడంటే ?
Temple
Fairoz Baig
| Edited By: |

Updated on: Oct 02, 2023 | 3:12 PM

Share

ఇంటి దొంగను ఈశ్వరుడైన పట్టుకోలేరంటారు. కానీ నిఘానేత్రమైన సీసీ కెమెరా పట్టేసింది. దేవాలయంలో ఆలయ పరిచారికుడిగా పనిచేస్తున్న వ్యక్తే హుండీలోని నగదును దర్జాగా తీసుకుని వాడుకుంటున్నాడు. గతకొంతకాలంగా గుట్టుగా పని కానిచ్చేస్తున్నాడు. కానీ చివరికి ఆలయంలోని సీసీ కెమెరాల ద్వారా ఆ ఇంటి దొంగను దొరికిపోయాడు. అంతకుముందు హుండీలో డబ్బులు తక్కువగా వస్తుండటంతో ఎవరో చోరీకి పాల్పడుతున్నారని ఆలయ నిర్వాహకులకు అనుమానం వచ్చింది. వేసిన తాళాలు వేసినట్టే ఉండగా హుండీలోని డబ్బులు ఎక్కడికి వెళుతున్నాయబ్బా అంటూ మదనపడిపోయారు. వెంటనే టక్కున ఓ ఆలోచన మదిలో మెదిలింది. ఆలయ నిర్వాహకులు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆలయంలో అమర్చిన సీసీటీవీ కెమెరాల పుటేజ్‌ను తీసి పరిశీలించారు. దీంతో ఆ ఇంటి దొంగ గుట్టు రట్టయింది. ఆలయంలో పనిచేస్తున్న పరిచారకుడే చోరీ చేస్తున్నట్టు గుర్తించి అతడ్ని విధుల నుంచి తొలగించారు.

రాష్ట్రంలో ప్రసిద్ధిగాంచిన దేవాలయాలలో ప్రకాశంజిల్లాలోని మిట్టపాలెం నారాయణస్వామి దేవస్థానం ఒకటిగా చెబుతారు. అక్కడా హుండీ ఆదాయం కూడా ఎక్కువే. అయితే దేవాలయాలలో మూడో కన్నుగా అమర్చిన సీసీ ఫుటేజ్‌లు కూడా ఉన్నాయి. అక్కడ సిబ్బంది కూడా ఎక్కువగానే ఉంటారు. అయితే అనూహ్యంగా గత కొద్దిరోజులుగా స్వామి వారి హుండీలో ఆదాయం తక్కువగా వస్తున్నట్టు గుర్తించారు. ఎప్పుడూ లేనిది ఈసారి ఆదాయం ఎందుకు తక్కువగా వస్తుందో ఎవరికి అర్థం కాలేదు. పగటి సమయంలో చోరీలు చేయడం కష్టమే అయినా రాత్రిళ్లు దొంగలు పడే అవకాశాలు ఉన్నాయి. అయితే తాళాలు పగులగొట్టినట్టు ఎక్కడా ఆనవాళ్లు లేవు. అందరూ శాకాహారులే మరి రొయ్యల ముల్లె ఎక్కడకు వెళ్ళిందబ్బా అంటూ ఆలయ నిర్వాహకులు పలుమార్లు మీటింగ్‌లు పెట్టి చర్చించుకున్నారు.

అయితే సీసీ కెమెరా పుటేజ్‌ పరిశీలనలో మిట్టపాలెం నారాయణ స్వామి దేవస్థానంలో పరిచారకుడుగా పనిచేస్తున్న నర్సయ్య అనే వ్యక్తి హుండీలో డబ్బులు కొట్టేస్తున్నట్టు గుర్తించారు. ఓరి నీ అసాధ్యం కూలా… నువ్వేనా ఇంటి దొంగవి అంటూ నర్సయ్యను పట్టుకుని అడిగిపారేశారు.. గత నెల 18, 19 తేదీలలో హుండీలో డబ్బులు చోరీకి ప్రయత్నిస్తుండగా సీసీటీవీ ఫుటేజీలో ఉన్నట్లు ఆలయ అధికారులు గుర్తించారు. మిట్టపాలెం దేవస్థానం ఈవో రమణారెడ్డి ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. పరిచారకుడిగా పనిచేస్తున్న నర్సయ్యను వెంటనే విధుల నుంచి తొలగించేశామని ఆలయ ఉన్నతాధికారులు తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్‌ చేయండి.