Andhra Pradesh: స్నేహితుని అప్పు కోసం పూచీకత్తుగా ఉన్నాడు.. చివరికి రుణదాతల చేతిలో బలి
అప్పు కోసం పూచీకత్తుగా వ్యవహరించిన ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోవడం కలకల రేపుతోంది. వివరాల్లోకి వెళ్తే వైఎస్సార్ జిల్లా చింతకొమ్మదిన్నెలో శ్రీకాంత్ అనే వ్యక్తి నివసిస్తున్నాడు. ఇటీవల శ్రీకాంత్ స్నేహితుడు ఒకతడకి అప్పు అవసరం అయ్యింది. దీంతో అతడు రూ.15 లక్షలు అప్పు తీసుకున్నాడు.
అప్పు కోసం పూచీకత్తుగా వ్యవహరించిన ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోవడం కలకల రేపుతోంది. వివరాల్లోకి వెళ్తే వైఎస్సార్ జిల్లా చింతకొమ్మదిన్నెలో శ్రీకాంత్ అనే వ్యక్తి నివసిస్తున్నాడు. ఇటీవల శ్రీకాంత్ స్నేహితుడు ఒకతడకి అప్పు అవసరం అయ్యింది. దీంతో అతడు రూ.15 లక్షలు అప్పు తీసుకున్నాడు. అయితే ఈ అప్పుకు పూచీకత్తుగా శ్రీకాంత్ ఉన్నాడు. కొన్నిరోజులకు అప్పు తీసుకున్న శ్రీకాంత్ స్నేహితుడు రుణం ఇచ్చిన వారికి అప్పు తిరిగి చెల్లించలేదు. దీంతో చివరికి పూచీకత్తుగా ఉన్న శ్రీకాంత్‌ను రుణదాతలు అడిగారు. ఈ క్రమంలో వాళ్ల మధ్య వాగ్వాదం జరిగి చివరికి ఘర్షణకు దారి తీసింది.
అయితే ఈ గొడవలో శ్రీకాంత్‌కు తీవ్రంగా గాయాలయ్యాయి. చివరికి అక్కడికక్కడే అతను మృతి చెందాడు. ఆధారాలు దొరకకుండా చేయాలనే ఉద్దేశంతో మృతదేహంపై నిందితులు పెట్రోల్ పోసి నిప్పంటించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనలు స్థలానికి చేరుకున్నారు. ఈ హత్య కేసులో ఏడుగురు నిందితుల్ని అరెస్ట్ చేశారు. నిందితుల్లో ఇద్దరు ఇంజినీరింగ్ విద్యార్థులు, ఇద్దరు మహిళలు ఉన్నారు. ప్రస్తుతం ఈ ఘటనపై విచారణ జరుపుతున్నట్లు పోలీసులు వెల్లడించారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..