AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vizianagaram: కూతుర్ని హీరోయిన్‌ చేయాలని హార్మోన్ ఇంజెక్షన్స్ ఇచ్చి టార్చర్.. పాపం బాలిక..

Vizianagaram News in Telugu: విజయనగరం పట్టణంలోని తోటపల్లిలో దారుణ ఘటన వెలుగుచూసింది. కన్నకూతురిని తల్లే చిత్రహింసలకు గురిచేసింది. సినిమాలపై మోజుతో బాలికకు హార్మోన్ ఇంజక్షన్స్ ఇచ్చింది. దీంతో తల్లిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

Vizianagaram: కూతుర్ని హీరోయిన్‌ చేయాలని హార్మోన్ ఇంజెక్షన్స్ ఇచ్చి టార్చర్.. పాపం బాలిక..
Vizianagaram News
Ram Naramaneni
|

Updated on: Jun 04, 2023 | 4:40 PM

Share

కన్న కూతురి పట్ల ఓ తల్లి అత్యంత పాశవికంగా వ్యవహరించింది. కూతురుని హీరోయిన్ చేయాలనే పిచ్చిలో నరకం చూపింది. మాయగాళ్ల మాటలు విని అభం శుభం తెలియని బాలికకు ఇంజెక్షన్లు ఇచ్చి శరీరాన్ని కుళ్ల బొడిచింది. మాట వినకపోతే చిత్రహింసలు పెట్టి వేధించింది. ఆ బాధ భరించలేక బాలిక చైల్డ్ లైన్ అధికారులను ఆశ్రయించడంతో ఎట్టకేలకూ తల్లి చెర నుండి బయటపడింది. ఈ వ్యవహారం సంచలనంగా మారింది.

విజయనగరం తోటపాలెంలో నివాసం ఉండే మహిళకు కుమార్తె పుట్టిన తర్వాత భర్త చనిపోయాడు. దీంతో ఆమె మరో వ్యక్తితో కలిసి ఉంటున్నట్లు సమాచారం. మొదటి భర్తతో పుట్టిన బాలిక విశాఖలో ప్రభుత్వ విద్యాసంస్థలో ఇటీవలే టెన్త్‌ క్లాస్‌ పూర్తి చేసి, వేసవి సెలవులకు ఇంటికొచ్చింది. ఐతే తల్లి దగ్గరకు తరచూ కొత్త వాళ్లు వస్తుండడంతో అక్కడ ఉండడం ఇష్టంలేక తల్లితో గొడవపడింది. ఈ మధ్య ఇంటికి వచ్చిన ఓ వ్యక్తి బాలికను చూసి సినిమాల్లో హీరోయిన్‌ అయ్యే లక్షణాలు ఉన్నాయన్నాడు. అయితే శరీర భాగాలు ఇంకా పెరగాలని ఆమెకు చెప్పారు. అతను చెప్పినట్లు కుమార్తెకు నిత్యం ఇంజెక్షన్లు ఇప్పించడం మొదలుపెట్టింది. దీంతో బాలిక అనారోగ్యానికి గురైంది. రోజూ ఇచ్చే ఇంజెక్షన్ల బాధ భరించలేకపోయేది. ఇంజెక్షన్లు వద్దని తల్లిని వేడుకున్నా ఆమె కనికరించేది కాదు. చివరకు చైల్డ్ లైన్ అధికారులకు చెప్పడంతో, వాళ్లు అధికారులు , పోలీసులకు సమాచారం ఇచ్చి బాలికను రక్షించారు.

మరోవైపు ఈ ఘటనపై పోలీసులు కూడా స్పందించి దర్యాప్తు చేపట్టారు. బాలిక ఇచ్చిన ఫిర్యాదుతో తల్లితో పాటు చుట్టుపక్కల ప్రాంతాల వారిని కూడా విచారించారు. వారిపై కఠిన చర్యలు ఉంటాయన్నారు జిల్లాఎస్పీ దీపిక. అయితే తల్లి పెట్టిన మానసిక, శారీరక వేధింపులతో పాటు అవయవాలు పెరగటానికి ఇచ్చిన మెడిసిన్ కారణంగా బాలిక తీవ్ర అనారోగ్యానికి గురైంది. ఆమె కోలుకోవడానికి కొంత సమయం పట్టవచ్చంటున్నారు వైద్యులు. మొత్తానికి స్టెరాయిడ్స్‌ లాంటి ఇంజక్షన్లు మొదటికే మోసం అంటున్నారు వైద్య నిపుణులు. ఇవి ఒక్కోసారి ప్రాణాలమీదకి తెస్తాయని హెచ్చరిస్తున్నారు. ఇలాంటి వాటిని ఎవరూ ప్రోత్సహించవద్దంటున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం..