CDOT Recruitment 2023: ఈ కేంద్ర ప్రభుత్వ సంస్థలో 252 సాఫ్ట్ వేర్ కొలువులు.. రాత పరీక్షలేకుండానే ఎంపిక
భారత ప్రభుత్వ కమ్యూనికేషన్స్ మంత్రిత్వశాఖకు చెందిన సెంటర్ ఫర్ డెవలస్‌మెంట్ ఆఫ్ టెలీమాటిక్స్ (సీడ్యాక్).. డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ప్రాతిపదికన 252 సాఫ్ట్‌వేర్ ఇంజినీర్, ఆర్‌ఎఫ్ ఇంజినీర్, డెవలప్‌మెంట్ ఇంజినీర్, సీనియర్ హార్డ్‌వేర్ డిజైన్ ఇంజినీర్, సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ ఇంజినీర్ తదితర..
భారత ప్రభుత్వ కమ్యూనికేషన్స్ మంత్రిత్వశాఖకు చెందిన సెంటర్ ఫర్ డెవలస్‌మెంట్ ఆఫ్ టెలీమాటిక్స్ (సీడ్యాక్).. డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ప్రాతిపదికన 252 సాఫ్ట్‌వేర్ ఇంజినీర్, ఆర్‌ఎఫ్ ఇంజినీర్, డెవలప్‌మెంట్ ఇంజినీర్, సీనియర్ హార్డ్‌వేర్ డిజైన్ ఇంజినీర్, సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ ఇంజినీర్, హార్డ్‌వేర్ డిజైన్ ఇంజినీర్, డేటాబేస్ డిజైనర్, సాఫ్ట్‌వేర్ సెక్యూరిటీ ప్రొఫెషనల్, పీసీబీ డిజైన్ ఇంజినీర్ తదితర పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు సంబంధత స్పెషలైజేషన్‌లో బీఈ/బీటెక్, ఎంఈ/ఎంటెక్, ఎంబీఏ, పీహెచ్‌డీ లేదా తత్సమాన కోర్సులో కనీసం 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో కనీసం 3 నుంచి ఐదేళ్ల అనుభవం కూడా ఉండాలి. దరఖాస్తుదారుల వయసు 30 ఏళ్లకు మించకుండా ఉండాలి.
ఆసక్తి కలిగిన వారు ఆన్‌లైన్ విధానంలో జూన్ 30, 2023లోపు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఎంపికైన వారు బెంగళూరు, న్యూఢిల్లీలో పనిచేయవల్సి ఉంటుంది. ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్ చేసుకోవచ్చు.
నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.