Andhra: అర్ధరాత్రి ఏంట్రా ఈ పని..! గుట్టుగా చేద్దామనుకున్నారు.. కట్ చేస్తే.. నదిలో చిక్కుకున్నామంటూ 100కు ఫోన్..
18 మంది ఉన్నాం.. పెన్నా నదిలో చిక్కుకున్నాం.. మమ్మల్ని కాపాడండి సార్.. అకస్మాత్తుగా 100 నెంబర్‌కు ఫోన్ వచ్చింది.. దీంతో పోలీసు అధికారులు ఒక్కసారిగా అప్రత్తమయ్యారు.. ఉరుకులు పరుగులతో ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఫైర్, రెవెన్యూ డిపార్ట్‌మెంట్స్‌కు సమాచారం ఇచ్చారు పోలీసులు.. వారు కూడా హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు.

18 మంది ఉన్నాం.. పెన్నా నదిలో చిక్కుకున్నాం.. మమ్మల్ని కాపాడండి సార్.. అకస్మాత్తుగా 100 నెంబర్‌కు ఫోన్ వచ్చింది.. దీంతో పోలీసు అధికారులు ఒక్కసారిగా అప్రత్తమయ్యారు.. ఉరుకులు పరుగులతో ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఫైర్, రెవెన్యూ డిపార్ట్‌మెంట్స్‌కు సమాచారం ఇచ్చారు పోలీసులు.. వారు కూడా హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. వెంటనే రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు పోలీసులు.. అలా ఆ ఆపరేషన్.. రాత్రి నుంచి తెల్లవారే వరకు జరిగింది.. అందరూ క్షేమంగా బయటపడటంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. అయితే.. ఇక్కడో ట్విస్ట్ ఉంది.. వారంతా ఏదో పని కోసం వెళ్లారనుకుంటే పొరబడినట్లే.. అందరూ పెన్నా నది ఇసుక తిన్నెలపై పేకాట ఆడేటందుకు వెళ్లి చిక్కుకుపోయారు.
నెల్లూరులోని.. భగత్ సింగ్ కాలనీ సమీపంలోని పెన్నా బ్యారేజ్ వద్దకు పేకాట ఆడేందుకు 18 మంది వెళ్లారు. అయితే.. రెండు రోజుల క్రితం సోమశిల నుంచి పెన్నా బ్యారేజ్ కి అధికారులు నీటిని విడుదల చేశారు.. అకస్మాత్తుగా బ్యారేజ్‌లో మూడు వైపులా నీరు రావడంతో.. పేకాట ఆడేందుకు వెళ్లిన 18 మంది వరదలో చిక్కుకుపోయారు. నదిలో నీళ్లు లేవని పేకాట ఆడుతూ.. ఎంజాయ్ చేద్దామని వెళ్లగా.. సడన్‌గా వరద నీరు చుట్టుముట్టడంతో పెన్నానదిలో అక్కడే ఉండిపోయారు.. బయటపడేందుకు మార్గం దొరకలేదు..
దీంతో.. భయం.. భయంతో ఏం చేయాలో అర్థంకాక.. 100కి కాల్ చేసి.. కాపాడాలని వేడుకున్నారు.. దీంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఫైర్, రెవెన్యూ డిపార్ట్‌మెంట్స్‌తో కలిపి రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు.
మంత్రి నారాయణ.. అధికారులతో మాట్లాడి సహాయక చర్యలపై పర్యవేక్షించారు. అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము వరకు రెస్క్యూ ఆపరేషన్ సాగింది. నిచ్చెన సాయంతో 9మందిని గట్టుపైకి తీసుకొచ్చారు పోలీసులు. మిగతావాళ్లు అప్పటికే క్షేమంగా బయటికి వచ్చేసినట్టు చెప్పారు అధికారులు.. అందరూ సేఫ్ గా బయటపడటంతో కుటుంబసభ్యులు, జిల్లా యంత్రాంగం ఊపిరి పీల్చుకుంది.
వీడియో చూడండి..
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




