AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra News: ఎంత పనిచేశావ్‌రా..! సెల్ ఫోన్ కొనివ్వలేదని 15 ఏళ్ల బాలుడు..

15ఏళ్లే.. చదువు మానేసి ఖాళీగా ఉంటున్నాడు.. స్నేహితులు అందరూ సెల్‌ఫోన్ వాడుతుండడంతో దానిపై మోజు పెరిగింది.. తనకు కూడా సెల్ ఫోన్ కావాలని తల్లిని అడిగాడు ఆ బాలుడు.. భర్త చనిపోయి వీధి వీధి తిరుగుతూ పండ్లు కూరగాయలు అమ్ముకొని కుటుంబాన్ని నెట్టుకొస్తున్న... ఆ తల్లి స్మార్ట్ ఫోన్ కొనివ్వలేనని కొడుకుకి చెప్పింది.

Andhra News: ఎంత పనిచేశావ్‌రా..! సెల్ ఫోన్ కొనివ్వలేదని 15 ఏళ్ల బాలుడు..
Smartphone
Nalluri Naresh
| Edited By: |

Updated on: Mar 09, 2025 | 12:13 PM

Share

15ఏళ్లే.. చదువు మానేసి ఖాళీగా ఉంటున్నాడు.. స్నేహితులు అందరూ సెల్‌ఫోన్ వాడుతుండడంతో దానిపై మోజు పెరిగింది.. తనకు కూడా సెల్ ఫోన్ కావాలని తల్లిని అడిగాడు ఆ బాలుడు.. భర్త చనిపోయి వీధి వీధి తిరుగుతూ పండ్లు కూరగాయలు అమ్ముకొని కుటుంబాన్ని నెట్టుకొస్తున్న… ఆ తల్లి స్మార్ట్ ఫోన్ కొనివ్వలేనని కొడుకుకి చెప్పింది. తన దగ్గర స్తోమత లేదని చెప్పింది.. అయినా వినకుండా మారం చేశాడు.. చివరకు.. సెల్ ఫోన్ కొనివ్వలేదని ఆ 15 ఏళ్ల కుర్రాడు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ షాకింగ్ ఘటన అనంతపురం జిల్లా యాడికి మండలం నిట్టూరు గ్రామంలో జరిగింది..

నిట్టూరు గ్రామానికి చెందిన 15 ఏళ్ల బాలుడు మహేంద్ర తనకు మొబైల్ ఫోన్ కొనివ్వలేదని ఆత్మహత్య చేసుకున్నాడు.. మహేంద్ర తండ్రి 5 సంవత్సరాల క్రితం అనారోగ్యంతో మృతి చెందాడు. దీంతో అప్పటి నుంచి బాలుడు మహేంద్ర తల్లి వెంకటలక్ష్మి వీధి, వీధి తిరుగుతూ గంపతో.. పళ్ళు, కూరగాయలు అమ్ముతూ కుటుంబాన్ని పోషిస్తుంది… తండ్రి మరణం తర్వాత బాలుడు మహేంద్ర చదువు మానేసి జులాయిగా తిరగటం మొదలుపెట్టాడు.. చదువు మానేసి స్నేహితులతో చెడు వ్యసనాలకు అలవాటుపడ్డాడు.. డబ్బుల కోసం తాపీ పనికి వెళ్లేవాడు. తనతో పని చేసుకుంటున్న స్నేహితులు మొబైల్ ఫోన్ వాడుతున్నారని.. తనకు కూడా సెల్ ఫోన్ కొనివ్వాలని గత కొద్దిరోజులుగా తల్లి వెంకటలక్ష్మిని బాలుడు మహేంద్ర అడుగుతూ వస్తున్నాడు. తనకు ఎలాగైనా సెల్ కొనివ్వాల్సిందేనని ఒత్తిడి చేస్తున్నాడు.. తన స్నేహితులందరికీ సెల్‌ఫోన్ ఉందని… తనకు కూడా ఫోన్ కావాలని గొడవ పడుతున్న మహేంద్రను తల్లి వెంకటలక్ష్మి కుటుంబ ఆర్థిక పరిస్థితిని చెబుతూ మందలించింది.

ఈ క్రమంలో మహేంద్ర తల్లి సెల్ఫోన్ కొన్నివ్వలేదని రెండు రోజుల క్రితం పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. దీంతో అతన్ని హుటా హుటిన ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ క్రమంలోనే.. అనంతపురం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బాలుడు మహేంద్ర చనిపోయాడు. సెల్ ఫోన్ కోసం కుమారుడు ఆత్మహత్య చేసుకోవడంతో తల్లి కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

అలర్ట్.. సిబిల్ స్కోర్ రూల్స్ మారుతున్నాయి.. జనవరి 1 నుంచి..
అలర్ట్.. సిబిల్ స్కోర్ రూల్స్ మారుతున్నాయి.. జనవరి 1 నుంచి..
డిసెంబర్‌ 31న స్విగ్గీ, జొమాటో, జెప్టో, బ్లింకిట్ సేవలు బంద్‌!
డిసెంబర్‌ 31న స్విగ్గీ, జొమాటో, జెప్టో, బ్లింకిట్ సేవలు బంద్‌!
ప్రభాస్ ది రాజాసాబ్ ప్రీ-రిలీజ్‌ ఈవెంట్‌ లైవ్ వీడియో
ప్రభాస్ ది రాజాసాబ్ ప్రీ-రిలీజ్‌ ఈవెంట్‌ లైవ్ వీడియో
కథలో కొత్తదనం లేదు.. ఫస్టాఫ్‌లో ల్యాగ్.. బ్యాడ్ గర్ల్స్‌ రివ్యూ
కథలో కొత్తదనం లేదు.. ఫస్టాఫ్‌లో ల్యాగ్.. బ్యాడ్ గర్ల్స్‌ రివ్యూ
మేష రాశి ఫలితాలు 2026: జూన్ తర్వాత ఆర్థిక పరిస్థితిలో మార్పు..!
మేష రాశి ఫలితాలు 2026: జూన్ తర్వాత ఆర్థిక పరిస్థితిలో మార్పు..!
KVS-NVSలో 15,762 ఉద్యోగాలకు మీరూ దరఖాస్తు చేశారా? కీలక అప్‌డేట్‌
KVS-NVSలో 15,762 ఉద్యోగాలకు మీరూ దరఖాస్తు చేశారా? కీలక అప్‌డేట్‌
ఫ్రిడ్జ్‌లో ఈ 9 పదార్థాలను అస్సలు నిల్వ చేయొద్దు!
ఫ్రిడ్జ్‌లో ఈ 9 పదార్థాలను అస్సలు నిల్వ చేయొద్దు!
అప్పులు, డిప్రెషన్, ఆందోళన.. అన్నింటికీ కారణం ఈ ఒక్క అలవాటే!
అప్పులు, డిప్రెషన్, ఆందోళన.. అన్నింటికీ కారణం ఈ ఒక్క అలవాటే!
మూగజీవాలూ సైతం పోరుకు సై అన్నాయ్.. వినూత్న నిరసన మర దగ్గరే..
మూగజీవాలూ సైతం పోరుకు సై అన్నాయ్.. వినూత్న నిరసన మర దగ్గరే..
మొన్న ప్రేమదేశం.. నిన్న బేబీ.. ఇప్పుడు పతంక్! కాకపోతే
మొన్న ప్రేమదేశం.. నిన్న బేబీ.. ఇప్పుడు పతంక్! కాకపోతే