Andhra: మనుషుల్ని సైతం మింగేసే భారీ ఫైథాన్‌ను ఎప్పుడైనా చూశారా..? ధైర్యముంటేనే వీడియో చూడండి..
మనుషుల్ని సైతం మింగేసేలా ఉన్న ఈ భారీ కొండచిలువను బహుశా ఎక్కడ చూసి ఉండరేమో.. చూసిన వారంతా భయంతో ఇంటిపైకి ఎక్కారు. వెంటనే.. స్నేక్ క్యాచర్ కి సమాచారం ఇవ్వడంతో.. అతను వచ్చి ఫైథాన్ కోసం ఆ ప్రాంతంలోనే అణ్వేషణ ప్రారంభించాడు.. చివరకు దాన్ని పట్టుకొని అడవిలో వదిలేయడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

అసలే వాకాలం దగ్గరలో నల్లమల అటవీ ప్రాంతం.. అటవీ సమీపంలో నివసిస్తున్న ప్రజల ఇండ్ల వద్ద నాగపాములు, కొండచిలువల సంచారంతో ప్రజలు నిత్యం భయం, భయంతో జీవనం సాగిస్తున్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలోని మహానంది మండలం బుక్కాపురం గ్రామంలో గత కొంతకాలం నుంచి నిత్యం నాగుపాములు, కొండచిలువలు ప్రజల నివాసాల మద్య సంచరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మంగళవారం తెల్లవారుజామున గ్రామస్థుడు విజయ్ ఇంటి వద్ద అతి పెద్ద కొండచిలువ చూశాడు.. దాన్ని చూసి గ్రామస్థులంతా భయభ్రాంతులకు గురయ్యారు.
కొండచిలువ సంచరిస్తున్నట్లు వెంటనే స్నేక్ స్నాచర్ మోహన్ కు సమాచారం ఇచ్చారు. కొండచిలువ పట్టుకోవడానికి రంగంలోకి దిగిన స్నేక్ స్నాచర్ కు.. అది ముచ్చేమటలు పట్టించింది. దాదాపు గంటసేపు శ్రమించిన స్నేక్ స్నాచర్ పది అడుగులకు పైన ఉన్న కొండచిలువ అతి కష్టం మీద పట్టుకున్నాడు.. అనంతరం ఆ కొండచిలువను సమీపంలోని నల్లమల అడవిలో వదిలిపెట్టాడు. కొండచిలువ పట్టుకోవడంతో గ్రామస్థులంతా ఊపిరి పీల్చుకున్నారు.
వీడియో చూడండి..
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
