AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Amaravati: బిజీయెస్ట్ సిటీగా మారబోతున్న అమరావతి.. సీఆర్డీఏ సమావేశంలో కీలక ప్రతిపాదనలు!

ఏపీ రాజధాని అమరావతి రాబోయే రోజుల్లో కొత్తకొత్త ఐకానిక్ బిల్డింగ్స్‌తో బిజీయెస్ట్ ప్లేస్‌గా మారబోతోంది. దీంతో అమరావతికి కొత్త సొగసులద్దే యజ్ఞాన్ని మరింత వేగవంతం చేసింది కూటమి సర్కార్‌. దానికి తగ్గ మౌలిక సదుపాయాల కల్పనకు సీఆర్డీఏ అథారిటీ సమావేశంలో కీలక ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది ప్రభుత్వం.

Amaravati: బిజీయెస్ట్ సిటీగా మారబోతున్న అమరావతి.. సీఆర్డీఏ సమావేశంలో కీలక ప్రతిపాదనలు!
Amaravati's Transformation
Anand T
|

Updated on: Aug 19, 2025 | 9:39 AM

Share

అమరావతి రాజధాని నిర్మాణంపై ఫుల్ ఫోకస్ పెట్టింది కూటమి ప్రభుత్వం. శరవేగంగా పనులు పూర్తిచేస్తోంది. ప్రపంచంలోనే ఉత్తమ నగరంగా తీర్చిదిద్దాలన్నది లక్ష్యం. అదే సంకల్పంతో ముందుకు సాగుతున్నారు చంద్రబాబు. ఈ క్రమంలో అమరావతికి కొత్త రూపు ఇవ్వడానికి 51వ సీఆర్డీఏ అథారిటీ సమావేశంలో కీలక ప్రతిపాదనలకు ఆమోదం తెలిపారు. రాజధాని గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు 904 కోట్ల నిధులు కేటాయిస్తూ సీఆర్డీఏ అథారిటీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. నీటి సరఫరాకు రూ. 64 కోట్లు, సీవరేజ్ వాటర్​కు రూ. 110 కోట్లు, రహదారులకు రూ. 300 కోట్లు, వీధి దీపాలకు రూ. 12 కోట్లు కేటాయించారు.

మంగళగిరిలో జెమ్స్ అండ్ జ్యువలరీ పార్క్ 78 ఎకరాల్లో ఏర్పాటు కోసం భూ సమీకరణ చేయాలని నిర్ణయించారు. దాదాపు రూ.5 వేల కోట్ల పెట్టుబడితో ఏర్పాటయ్యే ఈ పార్క్ ద్వారా 20 వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని మంత్రి నారాయణ తెలిపారు. రిటర్నబుల్ ప్లాట్స్​లో అసైన్ భూమి అని పేర్కొనటం వల్ల తాము నష్టపోతున్నామన్న రైతుల విజ్ఞప్తి మేరకు అసైన్ అనే పదాన్ని తొలగించాలని సీఎం ఆదేశించారని తెలిపారు. స్పెషల్ పర్పస్ వెహికల్ కింద అంతర్జాతీయ విమానాశ్రయంతో పాటు వివిధ ప్రాజెక్టులు చేపట్టేందుకు అనుమతులు మంజూరు చేశారన్నారు. వాటర్ ట్రీట్​మెంట్ ప్లాంట్ కోసం 2 ప్యాకేజీల కింద నీటిని శుద్ధి చేసేందుకు రూ.411 కోట్లతో ఒక ప్యాకేజీ, నీటి సరఫరా కోసం రూ.376 కోట్లతో మరో ప్యాకేజీకి ఆమోదం తెలిపారని వివరించారు. SRM, విట్ సంస్థలకు మెడికల్, డెంటల్, పారామెడికల్ కళాశాలల ఏర్పాటుకు చెరో 100 ఎకరాలు కేటాయింపునకు నిర్ణయం తీసుకున్నామని మంత్రి నారాయణ వెల్లడించారు.

కృష్ణా నదిపై నిర్మించే ఐకానిక్ వంతెనకు అద్భుతమైన డిజైన్

మరోవైపు రాజధాని అమరావతిని అనుసంధానిస్తూ కృష్ణా నదిపై నిర్మించే ఐకానిక్ వంతెనకు అద్భుతమైన డిజైన్ ఎంపిక చేయాలని సీఎం చంద్రబాబు అధికారులకు ఆదేశించారు. సంప్రదాయ కూచిపూడి నృత్య భంగిమ సహా వేర్వేరు నూతన డిజైన్లను పరిశీలించాలని సూచించారు. ప్రతీ ప్రాజెక్టు పరిధిలోనూ ఆర్ధిక కార్యాకలాపాలు జరిగేలా ప్రణాళికలు ఉండాలని సీఎం సూచించారు. టోటల్‌గా అమరావతి పనులు మరింత స్పీడప్ చేయడానికి చంద్రబాబు అండ్ టీమ్‌ నాన్‌స్టాప్ ఎక్సర్‌సైజ్ కొనసాగిస్తోంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
టీ20 వరల్డ్ కప్ వేళ పాక్ జట్టులో రచ్చ రచ్చ
టీ20 వరల్డ్ కప్ వేళ పాక్ జట్టులో రచ్చ రచ్చ
రైల్వే ప్రయాణికులకు బిగ్‌ అలర్ట్.. అమల్లోకి కొత్త రూల్స్!
రైల్వే ప్రయాణికులకు బిగ్‌ అలర్ట్.. అమల్లోకి కొత్త రూల్స్!
లిఫ్ట్‌లో అద్దాలు ఎందుకు ఉంటాయో తెలుసా? 99 శాతం మందికి తెలియదు..!
లిఫ్ట్‌లో అద్దాలు ఎందుకు ఉంటాయో తెలుసా? 99 శాతం మందికి తెలియదు..!
AP POLYCET 2026 కౌన్సెలింగ్ ప్రారంభం.. సీటు పొందాలంటే ఇలా చేయండి
AP POLYCET 2026 కౌన్సెలింగ్ ప్రారంభం.. సీటు పొందాలంటే ఇలా చేయండి
కెనడా ప్లేయర్ కాలు విరగ్గొట్టిన ఖతార్ ప్లేయర్ పై నిషేధం
కెనడా ప్లేయర్ కాలు విరగ్గొట్టిన ఖతార్ ప్లేయర్ పై నిషేధం
నోట్లో వేస్తే ఇట్టే కరిగిపోవాల్సిందే.. హెల్తీ ‘బెల్లం రవ్వ లడ్డు
నోట్లో వేస్తే ఇట్టే కరిగిపోవాల్సిందే.. హెల్తీ ‘బెల్లం రవ్వ లడ్డు
భారీగా పెరిగిన కూరగాయల ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో ఇలా..
భారీగా పెరిగిన కూరగాయల ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో ఇలా..
ముడుచుకుందంటే పులులు, సింహాలు కూడా ఏం చేయలేవ్..
ముడుచుకుందంటే పులులు, సింహాలు కూడా ఏం చేయలేవ్..
ఆ ఇద్దరి ఎఫెక్ట్.. ఇంగ్లాండ్ సిరీస్ నుంచి వైభవ్ ఔట్.. ఎందుకంటే?
ఆ ఇద్దరి ఎఫెక్ట్.. ఇంగ్లాండ్ సిరీస్ నుంచి వైభవ్ ఔట్.. ఎందుకంటే?
గంగమ్మ కస్టోడియల్ డెత్ కేసు ట్విస్ట్.. హైకోర్టు కీలక ఆదేశాలు
గంగమ్మ కస్టోడియల్ డెత్ కేసు ట్విస్ట్.. హైకోర్టు కీలక ఆదేశాలు