AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Full Time Daughter: పూర్తి-సమయం కుమార్తె కావడానికి ఉద్యోగం మానేసిన చైనా మహిళ.. నెలకు ₹ 47,000 జీతం ఇస్తున్న తల్లిదండ్రులు

ఓ చైనా యువతికి ఆమె తల్లిదండ్రులు బంపర్ ఆఫర్ ఇచ్చారు. నువ్వు ఉద్యోగం మానేసి.. మాతో రోజంతా గడుపు.. నీకు నెలకు 570 డాలర్లు అంటే దాదాపు 47 వేల రూపాయలను చెల్లిస్తామని చెప్పారు.  దీంతో ఆ కూతురు తన ఉద్యోగానికి గుడ్ బై చెప్పేసి.. ఇప్పుడు కూతురుగా ఉద్యోగం చేస్తోంది. వివరాల్లోకి వెళ్తే.. 

Full Time Daughter: పూర్తి-సమయం కుమార్తె కావడానికి ఉద్యోగం మానేసిన చైనా మహిళ.. నెలకు ₹ 47,000 జీతం ఇస్తున్న తల్లిదండ్రులు
Full Time Daughter
Surya Kala
|

Updated on: May 29, 2023 | 11:45 AM

Share

గత 15 సంవత్సరాలుగా ప్రతిష్టాత్మకమైన వార్తా సంస్థలో పనిచేస్తున్నాను. ఉదయం లేచినప్పటి నుండి సాయంత్రం నిద్రపోయే వరకూ నిరంతరం ఒకటే పని.. భోజనం, స్నాక్స్ తినడం రోజూ చేసేదే.. ఉద్యోగంలో బిజిబిజీ జీవితంతో అరుదుగా కుటుంబంతో గడుపుతాను. స్నేహితులు లేరు, బంధువుల గురించి తెలుసుకోవడానికి సమయం లేదు. వీటికి తోడు ఆఫీస్ లో ఎక్కువ సమయం గడుపుతూ పని చేస్తే చాలు బోర్ కొట్టేస్తుంది.. అయినా తప్పదు ఎందుకంటే ఉద్యోగం చేస్తేనే జీతం వస్తుంది. జీవితం గడుస్తుందని ఆలోచిస్తున్న ఓ చైనా యువతికి ఆమె తల్లిదండ్రులు బంపర్ ఆఫర్ ఇచ్చారు. నువ్వు ఉద్యోగం మానేసి.. మాతో రోజంతా గడుపు.. నీకు నెలకు 570 డాలర్లు అంటే దాదాపు 47 వేల రూపాయలను చెల్లిస్తామని చెప్పారు.  దీంతో ఆ కూతురు తన ఉద్యోగానికి గుడ్ బై చెప్పేసి.. ఇప్పుడు కూతురుగా ఉద్యోగం చేస్తోంది. వివరాల్లోకి వెళ్తే..

నియానన్ అనే 40 ఏళ్ల మహిళ ఒక వార్తా సంస్థలో 15 సంవత్సరాలు పనిచేసింది. 2022లో జీవితం రొటీన్ అనే ఫీలింగ్ తో  పాటు అధిక ఒత్తిడి, ఆఫీసులో ఎప్పుడూ అందుబాటులో ఉండవలసిన అవసరాన్ని తెచ్చిపెట్టింది. ఆ సమయంలో నియానన్ కు ఆమె తల్లిదండ్రులు అండగా నిలబడ్డారు. తమ కూతురికి సహాయం అందించడానికి ముందుకు వచ్చారు. తమ కూతురు ఉద్యోగం వదిలి తమకు కూతురిగా ఉద్యోగం చేయాలనీ సూచించారు. అంతేకాదు నియానన్ తల్లిదండ్రులు 10,000 యువాన్లు (US$1,500) కంటే ఎక్కువ  పెన్షన్ తీసుకుంటున్నారు. తమ పెన్షన్ నుంచి 4,000 యువాన్లు  ( $570) లను నెలకు జీతంగా ఇస్తామని తమ కూతురికి హామీనిచ్చారు. దీంతో తన తల్లిదండ్రులకు సంపూర్ణమైన కూతురిగా మారడానికి నిర్ణయించుకుంది. నియానన్ తన ఉద్యోగాన్ని వదిలి “పూర్తి సమయం కుమార్తె” పాత్రను స్వీకరించాలని నిర్ణయించుకుంది. ఆనందంగా విభిన్నమైన దినచర్యను చేపట్టింది.

ఇప్పుడు నియానన్ చేస్తోన్న దిన చర్య ఏమిటంటే..?

ఇవి కూడా చదవండి

తన తల్లిదండ్రులతో ఒక గంట డ్యాన్స్ చేస్తుంది. కిరాణా షాపింగ్ కు వారితో పాటు వెళ్తుంది. అంతేకాదు తన తండ్రితో కలిసి  చెప్పింది. సాయంత్రం, ఆమె తన తండ్రితో కలిసి..  రాత్రి భోజనం చేస్తుంది. అన్ని ఎలక్ట్రానిక్-సంబంధిత పనులను నిర్వహిస్తుంది, డ్రైవర్‌గా పనిచేస్తుంది. అంతేకాదు నెలాఖరులో ఎక్కడికైనా విహారయాత్రకు వెళ్తుంది. ఇలా తన తల్లిదండ్రుల చుట్టు తాను తిరగడం ఒక చికిత్స వంటిదే అని చెప్పారు.

అయితే తమ కూతురుకి తగిన ఉద్యోగం దొరికి మంచి జీతం వచ్చే వరకూ ఇక్కడే  ఉండమని తల్లిదండ్రులు చెప్పారు. అంతేకాదు.. తగిన ఉద్యోగం దొరికితే వెళ్లిపో, లేదా పని చేసే మూడ్ లేకపోతే మాతో ఇక్కడే ఉండు అని తల్లిదండ్రులు అంటున్నారు. నిరంతరం నియానన్ కు  భరోసా ఇస్తున్నారు.

అవుట్‌లెట్ ప్రకారం, “పూర్తి-సమయం కుమార్తె” అనే కాన్సెప్ట్ చైనా దేశంలో ఇప్పుడిప్పుడే ఆదరణ పొందుతుంది. చైనాలోని యువత అత్యంత పోటీతత్వ జాబ్ మార్కెట్, అలసిపోయిన పని షెడ్యూల్‌లకు ప్రత్యామ్నాయంగా ప్రజాదరణ పొందింది. ఈ ప్రత్యామ్నాయ జీవనశైలి సాంప్రదాయ పని పరిమితుల నుంచి  ఎక్కువ స్వయంప్రతిపత్తి, స్వేచ్ఛను ఇస్తుందని విశ్వాసం. అయినప్పటికీ  కొంతమంది విమర్శకులు కూతురు చేస్తున్న పని కేవలం తల్లిదండ్రులపై ఆధారపడటమే అని వాదించారు.

మరిన్ని అంతర్జాతీయ వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..