Viral: తీవ్రమైన కడుపు నొప్పి, తిమ్మిర్లతో ఆస్పత్రికి బాలుడు.. సీటీ స్కాన్ తీసి స్టన్ అయిన డాక్టర్లు

పిల్లలకు ఇచ్చే ఫుడ్ విషయంలో అత్యంత అప్రమత్తంగా ఉండాలి. వారు అడుగుతున్నారు కదా అని ఏది పడితే అది కొనివ్వకూడదు. ఇంకో విషయం ఏంటంటే.. వారిని చూయింగ్ గమ్స్‌కు ఎంత దూరంగా ఉంచితే అంత మంచిది.

Viral: తీవ్రమైన కడుపు నొప్పి, తిమ్మిర్లతో ఆస్పత్రికి బాలుడు.. సీటీ స్కాన్ తీసి స్టన్ అయిన డాక్టర్లు
Boy CT Scan
Follow us

|

Updated on: May 28, 2023 | 7:44 PM

చిన్న వయస్సులో పిల్లలను ఎప్పటికప్పుడు కనిపెడుతూ ఉండాలి. లేదంటే వారు ప్రమాదాల బారిన పడతారు. తాజాగా అమెరికాలో అదే జరిగింది. నాలుగేళ్ల బాలుడు 40 చూయింగ్ గమ్ ముక్కలను మింగేశాడు. దీంతో చిన్నోడికి ఎమర్జెన్సీ ఆపరేషన్ చేయాల్సి వచ్చింది. యూఎస్‌లోని ఓహియోకు చెందిన బుడ్డోడు.. చూయింగ్ గమ్ ప్యాకెట్ దొరకడంతో ఫట్ ఫట్‌మని అన్నీ మింగేశాడు. దీంతో అతడి జీర్ణక్రియకు అంతరాయం వాటిల్లింది. కడుపు నొప్పి, ఒళ్లంతా తిమ్మిర్లతో పాటు  విరేచనాలు పెట్టాయి. దీంతో కంగారుపడిన పేరెంట్స్.. వెంటనే బాలుడ్ని దగ్గర్లోని క్లీనిక్‌కు తీసుకెళ్లారు. సీటీ స్కాన్ చేసిన తర్వాత డాక్టర్లు అతడి కడుపులో చూయింగ్ గమ్స్ ఉన్నట్లు గుర్తించారు. వెంటనే లాపరోస్కోపిక్ పద్దతిలో.. వైద్య పరికరాలు వినియోగించి నోటి నుంచి వాటిని బయటకు తీశారు. చూయింగ్ గమ్స్ అతడి పేగులకు బ్లాక్ చేయకపోవడం వల్ల పెను ప్రమాదం తప్పిందని వైద్యులు తెలిపారు.

ఒకవేళ పేగులకు పగుళ్లు వచ్చినా.. తిన్న పదార్థాలు శరీరంలోకి లీక్ అయ్యి డేంజర్ అయ్యేదని వెల్లడించారు. కడుపులోని 25 శాతం స్థలాన్ని అతడు మింగిన చూయింగ్ గమ్స్‌కు ఆక్యూపై చేశాయని వివరించారు. ఆపరేషన్ సమయంలో బాలుడుకి మత్తు ఇవ్వడం వల్ల.. చూయింగ్ గమ్‌ను బయటకు తీయడానికి చాలా సమయం పట్టిందని డాక్టర్ చిజైట్ ఇహియోనునెక్వు తెలిపారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను వైద్య పబ్లికేషన్ JEM రిపోర్ట్స్‌లో ప్రచురించారు. చికిత్స తర్వాత బాలుడికి కాస్త గొంతు నొప్పి ఉందని చెప్పాడని.. మెడిసిన్ ఇచ్చి అతడిని డిశ్చార్జ్ చేసినట్లు డాక్టర్లు వివరించారు.

చూయింగ్ గమ్‌ను శరీరం జీర్ణించుకోలేదని.. దాన్ని మింగకూడదని వైద్యులు సలహా ఇస్తున్నారు. ముఖ్యంగా పిల్లల్ని వాటికి దూరంగా ఉంచడమే బెస్ట్ అని చెబుతున్నారు. (Source)

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..