Funny Video: ప్లాన్ అంతా నాశనం చేసేశాడుగా! బ్యాచ్‌కొకరు ఇలాంటోడు ఉంటాడు కదా!
‘స్నేహమేరా జీవితం.. స్నేహమేరా శాశ్వతం’.. ‘స్నేహానికన్న మిన్నా.. లోకాన లేదురా’.. అంటూ ఏదో ఒక సందర్భంలో స్నేహం గురించి ఓ రేంజ్‌లో పాడుకునే ఉంటాం. ముఖ్యంగా.. స్నేహితులతో కలిసి పార్టీలో ఉంటే వచ్చే పాటలే వేరు. అది నెక్ట్స్ లెవల్ అని చెప్పుకోవాలి.
‘స్నేహమేరా జీవితం.. స్నేహమేరా శాశ్వతం’.. ‘స్నేహానికన్న మిన్నా.. లోకాన లేదురా’.. అంటూ ఏదో ఒక సందర్భంలో స్నేహం గురించి ఓ రేంజ్‌లో పాడుకునే ఉంటాం. ముఖ్యంగా.. స్నేహితులతో కలిసి పార్టీలో ఉంటే వచ్చే పాటలే వేరు. అది నెక్ట్స్ లెవల్ అని చెప్పుకోవాలి. అయితే, స్నేహితులు సరదాగా వివాహర యాత్రలకు వెళ్తుంటారు. అక్కడ వారందరూ కలిసి గ్రూఫ్ ఫోటోలు దిగడం, అల్లరి చేయడం షరా మామూలే. ఇక ప్రతి బ్యాచ్‌లో ప్లాన్స్‌ని స్పాయిల్ చేసేందుకు ఖచ్చితంగా ఒకరుంటారు. వీరు అస్సలు కుదురుగా ఉండరు. పైగా వీరే సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్‌గా నిలుస్తారు. తాజాగా అలాంటి ఫ్రెండ్స్ గ్యాంగ్‌కు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియో చూస్తే.. అచ్చం మా గ్యాంగ్‌లో ఒకడుంటాడు.. అనిపించడం ఖాయం.
ఈ వైరల్ వీడియోలో కొందరు ఫ్రెండ్స్ సరదాగా వివాహర యాత్రకు వెళ్లారు. అదంతా మంచు పాత్రం. మధ్యలో ఒక ఐరన్ గ్రిల్స్‌తో రెయిలింగ్ ఉంది. ఆ రెయిలింగ్‌పై వీరంతా సరదాగా కూర్చుని ఫోటోకు ఫోజు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. మధ్యలో కొంత గ్యాప్ మరొక స్నేహితుడి కోసం వదిలిపెట్టారు. ఆ గ్యాప్ ఫిల్ చేసే ఫ్రెండ్ రానే వచ్చాడు. ఎగిరి ఆ రైయిలింగ్‌పై కూర్చునే ప్రయత్నం చేశాడు. చెప్పాంగా ముందే.. ప్రతి బ్యాచ్‌లోనూ ఒకడుంటాడని. ఆ ఒక్కడే ఇతను. రెయిలింగ్‌పై కుదురుగా కూర్చోకుండా.. జంప్ చేసి కూర్చునే ప్రయత్నం చేశాడు. ఇంకేముంది అదికాస్తా పట్టుతప్పింది. కింద పడకుండా ఉండేందుకు మిగతా స్నేహితులను పట్టుకునే ప్రయత్నం చేశాడు. ఆ దెబ్బకు మిగతా వారు కూడా రెయిలింగ్ నుంచి దడేల్‌మని కింద పడిపోయారు. ఒక్కడు చేసిన పనికి ప్లాన్ అంతా పాడవటమే కాకుండా.. అందరూ కిందపడాల్సి వచ్చింది.
ఈ వీడియోను సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్విట్టర్‌లో పబ్లిష్ చేయగా.. అదికాస్తా వైరల్ అవుతోంది. నెటిజన్లు ఈ వీడియోను చూసి కడుపుబ్బా నవ్వుకుంటున్నారు. ప్రతి బ్యాచ్‌లో ఇలాంటోడు ఒక్కడు ఉంటాడు. మ్యాచ్ బ్యాచ్‌లోనూ ఉన్నారు అంటూ తమ మధుర స్మృతులను కామెంట్స్ రూపంలో పంచుకుంటున్నారు. మరెందుకు ఆలస్యం.. ఈ వీడియోపై ఓ లుక్కేసుకోండి..
వైరల్ అవుతున్న వీడియో ఇదే..
Group pic ruined . pic.twitter.com/yYwOrHbibj
— CCTV IDIOTS (@cctvidiots) May 28, 2023
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..