Viral Video: భానుడి భగభగ.. నీటి చెమ్మ దొరికిందే ఆలస్యం.. మురిసిపోయిన పక్షి..!
అక్కడా.. ఇక్కడా అనే తేడా ఏమీ లేదు.. దబిడి దిబిడే అంటూ దంచికొడుతోంది ఎండ. అత్యధిక ఉష్ణోగ్రతల దెబ్బకు ప్రతీ జీవి అతలాకుతలం అవుతోంది. అటు ఉక్కపోత, ఇటు ఎండ వేడిమి.. పరిస్థితి దారుణంగా ఉంది. మనుషులే ఈ ఎండ వేడిమిని తాళలేక అల్లాడిపోతున్నారు.
అక్కడా.. ఇక్కడా అనే తేడా ఏమీ లేదు.. దబిడి దిబిడే అంటూ దంచికొడుతోంది ఎండ. అత్యధిక ఉష్ణోగ్రతల దెబ్బకు ప్రతీ జీవి అతలాకుతలం అవుతోంది. అటు ఉక్కపోత, ఇటు ఎండ వేడిమి.. పరిస్థితి దారుణంగా ఉంది. మనుషులే ఈ ఎండ వేడిమిని తాళలేక అల్లాడిపోతున్నారు. చాలా మంది వడ దెబ్బకు ప్రాణాలు కోల్పోయారు. ఇక పశుపక్షాదుల పరిస్థితి అయితే చెప్పనలవి కాదు. పక్షులు ఎండల తీవ్రతకు ఎక్కడికక్కడ కుప్పకూలిపోతున్నాయి. వేసవి తాపాన్ని తట్టుకునేందుకు నీరు ఎక్కడ ఉంటే అక్కడ వాలిపోతున్నాయి. ఎక్కడైనా నీటి దారలు కనిపించినా, నీటి గుంటలు కనిపించినా.. ఎండ నుంచి ఉపశమనం కోసం వెంటనే అక్కడకు చేరుకుంటున్నాయి. తాజాగా ఇందుకు సంబంధించిన మోస్ట్ బ్యూటీఫుల్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఓ హమ్మింగ్ బర్డ్.. ఎండ నుంచి తట్టుకునేందుకు నీటిలో సరదాగా ఆడుతోంది. తనను తాను పూర్తిగా తడుపుకుంటూ.. వేసవితాపం నుంచి బయటపడే ప్రయత్నం చేసింది.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఓ ఫౌంటెన్ నుంచి ధారగా వాటర్ వస్తుండగా.. పక్షి వచ్చి వాలింది. ఆ నీటి దారపై ఎగురుతూ, కాసేపు సరదాగా ఆడుకుంది. ఎండ వేడిమిని తట్టుకునేందుకు.. తనను తాను పూర్తిగా తడిపేసుకుంది. నీటి బిందువులపై ఎగురుతూ, ఒక్కో చుక్కను తాగుతూ.. ఎంజాయ్ చేసింది. పైనుంచి ఎండ.. కింద నుంచి ఎగసిపడుతున్న నీటి ధార.. మధ్యలో పిచ్చుక ఆట.. చూసేందుకు చాలా అందంగా అనిపిస్తోంది. అయితే, చూడటానికి అందంగా ఉన్నా.. ఈ తట్టుకోలేని ఎండలకు వాటి మనుగడ ఏంటా? అనే అంశం బాధ కలిగిస్తోంది. ప్రతి నెటిజన్ల ఇదే విషయంలో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వీడియోకు తక్కువ వ్యవధిలోనే 3 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. మరెందుకు ఆలస్యం.. ఈ బ్యూటీఫుల్ వీడియోను మీరూ చూసేయండి..
Aweeeeeeeee this is so beautiful. pic.twitter.com/Nitzmrl0mo
— Figen (@TheFigen_) May 27, 2023
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..