Corona Vaccine Overdose: ఆ యువతికి ఒకేసారి ఆరు డోసుల టీకా.. ఆ తర్వాత ఏం జరిగిందంటే.!

Corona Vaccine Overdose: కరోనా.. ఇప్పుడు ఈ పేరు వింటే చాలు.. ప్రజలందరిలోనూ వణుకు మొదలవుతోంది. మహమ్మారి అడుగుపెట్టిన....

Corona Vaccine Overdose: ఆ యువతికి ఒకేసారి ఆరు డోసుల టీకా.. ఆ తర్వాత ఏం జరిగిందంటే.!
Vaccination


Corona Vaccine Overdose: కరోనా.. ఇప్పుడు ఈ పేరు వింటే చాలు.. ప్రజలందరిలోనూ వణుకు మొదలవుతోంది. మహమ్మారి అడుగుపెట్టిన ప్రతీ చోటా అల్లకల్లోలం సృష్టిస్తుండటం జనాలు భయభ్రాంతులకు లోనవుతున్నారు. ఇదిలా ఉంటే కోవిడ్ కట్టడికి వ్యాక్సిన్ ఓ కవచంలా పని చేస్తున్న సంగతి తెలిసిందే. అందుకే ప్రతీ ఒక్కరూ వ్యాక్సినేషన్ చేయించుకోవాలని ప్రభుత్వాలు సూచిస్తున్నాయి. అయితే టీకా వేయించుకునేందుకు ఆసుపత్రికి వెళ్లిన ఓ మహిళకు నర్సు అజాగ్రత్తతో ఏకంగా ఒకేసారి ఆరు డోసుల వ్యాక్సిన్ ఇచ్చింది. ఈ ఘటన ఇటలీలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..

ఇటలీకి చెందిన 23 ఏళ్ల యువతి కోవిడ్ వ్యాక్సిన్ కోసం టస్కాన్సీ నగరంలోని ఓ ఆసుపత్రికి వెళ్ళింది. ఆ హాస్పిటల్‌లో పని చేస్తున్న హెల్త్ వర్కర్ అనుకోకుండా ఫైజర్ టీకా ఆరు డోసులను ఇవ్వడంతో ఆ యువతి అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చేరింది. ఇక తాను చేసిన తప్పును గ్రహించిన ఆ నర్సు జరిగిన విషయాన్ని వైద్యులకు తెలియజేసింది. సదరు యువతిని 24 గంటల పాటు పర్యవేక్షించిన వైద్యులు.. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగా ఉందన్నారు. కాగా, ఈ పొరపాటు కేవలం మానవ తప్పిదమేనని.. ఉద్దేశపూర్వకంగా చేసింది కాదని హాస్పిటల్ వర్గాలు వెల్లడించారు.

Also Read:

హోం ఐసోలేషన్‌లో ఉన్న కరోనా బాధితులు.. ఏం చేయాలి.? ఏం చేయకూడదు.?

ఐపీఎల్ వాయిదా.. పలు ఫ్రాంచైజీలకు లాభం.. ఆ ఐదుగురు ప్లేయర్ల పునరాగమనం.!

Viral Video: ద్యావుడా.. బైక్‌పై ఇలా కూడా వెళ్తారా.. నవ్వు తెప్పిస్తున్న వీడియో..!

భారీ నాగపామును పట్టి బరాబరా ఈడ్చుకెళ్లిన బామ్మ.. నెటిజన్లు ఫిదా.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో.!