International Nurses Day: నేడు అంతర్జాతీయ నర్సుల దినోత్సవం..ఆ సేవాముర్తుల రోజు వెనక ఉన్న చరిత్ర ఎంటో తెలుసా..
International Nurses Day 2021: నర్సులు నిజంగానే సేవాముర్తులు.. చికిత్స చేయండి అని చేరిన నాటి నుంచి కోలుకొని తిరిగి వెళ్ళేవరకు వెన్నంటే
International Nurses Day 2021: నర్సులు నిజంగానే సేవాముర్తులు.. చికిత్స చేయండి అని చేరిన నాటి నుంచి కోలుకొని తిరిగి వెళ్ళేవరకు వెన్నంటే ఉండి సేవలు చేస్తారు. అనుక్షణం నర్స్.. సిస్టర్ అంటూ పిలిచినా విసుగు చెందకుండ వస్తారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం సమయంలో కరోనాను కట్టడి చేసేందుకు అటు డాక్టర్స్తోపాటు నర్సులు అందిస్తున్న సేవలు వెలకట్టలేనివి. తమ ప్రాణాలను సైతం లేక్కచేయకుండా.. కరోనా రోగులకు దగ్గరుండి మరీ సేవలు అందిస్తున్నారు. కుటుంబాలకు దూరంగా ఉంటూ.. రోగులే తమ పిల్లలుగా భావిస్తూ అహోరాత్రులు శ్రమిస్తున్న చల్లని దేవతలు. కరోనా బాధితులకు ఫ్లూయిడ్స్ అందించడం, రెమ్‌డెసివిర్ ఇంజెక్షన్లు ఇవ్వడం, ఆక్సిజన్ పెట్టడం వంటి అనేక సపర్యలు చేస్తున్నారు. కరోనా పోరులో సేవలు చేస్తూ.. వారిలో కొందరు ఈ మహమ్మారికి బలయ్యారు. అయిన ఏమాత్రం అధైర్య పడకుండా.. కోవిడ్ బాధితులకు బాసటగా నిలుస్తున్నారు. అటు డాక్టర్లకు, ఇటు రోగులకు అనునిత్యం అందుబాటులో ఉంటూ స్వీయ రక్షణతోపాటు… బాధితులను కూడా రక్షించేందుకు పాటుపడుతున్నారు. ఇంతటి సేవ చేస్తూ.. ఉద్యోగంలో ఎదురయ్యే ఒత్తిళ్లను ఎదుర్కోంటూ.. వ్యక్తిగత జీవితానికి, కుటుంబానికి దూరంగా ఉంటూ ఈ కష్ట కాలంలో సేవలు అందిస్తున్న ప్రతి ఒక్క నర్సుకు మనస్పూర్తిగా ధన్యవాదలు తెలుపుతుంది ఈ సమాజం నేడు. మే 12 అంతర్జాతీయ నర్సుల దినోత్సవం.
చరిత్ర..
1820 మే 12న నర్సు వృత్తి ఆవిర్బావానికీ, వృత్తి గౌరవానికి ప్రతీక అయిన ఫ్లొరెన్స్ నైటింగేల్ పుట్టిన రోజు. ఆమె చేసిన త్యాగపూరితమైన కృషి ఫలితంగా నేడు నర్సు వృత్తి కొనసాగటమే కాదు, వైద్యరంగానికి వన్నెతెచ్చింది. ఆమె పుట్టిన రోజున అంతర్జాతీయ నర్సు దినోత్సవంగా పేర్కొంటారు. క్రిమియన్ యుద్ధం సందర్భంగా1854లో 38 మంది నర్సుల బృందం యుద్ధంలో గాయపడిన సైనికులకు విశేషమైన సేవలు అందించింది. మరణాల రేటును చాలా తగ్గించగలిగింది. ఇందులో ఫ్లొరెన్స్ నైటింగేల్ ఆ నర్సుల బృందానికి నాయకురాలిగా, మార్గదర్శకురాలిగా సేవలందించటంలో ఆదర్శంగా నిలించింది. నిరంతరం ఆ క్షతగాత్రులకు సేవలందించేందుకు దీపం పట్టుకొని శిబిరాల్లో తిరిగేది. దీంతో ఆమెను లేడీ విత్ ది ల్యాంప్ అని పిలిచేవారు. 1858లో నైటింగేల్ రాయల్ స్టాటిటికల్ సొసైటీలో మొదటి మహిళా సభ్యురాలిగా చేరింది. ఆ తర్వాత 1860లో లండన్ లోని సెయింట్ థామస్ హాస్పిటల్ లో ఆధునిక నర్సింగ్ స్కూల్ ను స్థాపించారు. నర్సింగ్ రంగానికి విశేషమైన సేవలందించారు. ఆమె ‘Notes on Nur -sing’ అనే పుస్తకాన్ని రాశారు.1907 ఆర్డర్ ఆఫ్ మెరిట్ పొందిన మొదటి మహిళా కూడా ఆమెనే. 1953లో యూఎస్ ఆరోగ్య, విద్య, సంక్షేమ శాఖ అధికారి డోరతీ సదర్లాండ్ అధ్యక్షుడు డ్వైట్ డి ఐసన్‌హోవర్ “నర్సుల దినోత్సవాన్ని” ప్రకటించాలని ప్రతిపాదించారు. కానీ ఆ విషయాన్ని ఎవరు అంగీకరించలేదు. ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఆఫ్ నర్సెస్ (ఐసిఎన్) – 1965 నుంచి ఈ రోజును జరుపుకుంటున్నారు. ఆధునిక నర్సింగ్ వ్యవస్థాపకుడు ఫ్లోరెన్స్ నైటింగేల్ పుట్టిన వార్షికోత్సవం కావడంతో జనవరి 1974 లో, మే 12 ను ఈ రోజు జరుపుకునేందుకు ఎంపిక చేశారు.