Jiddu Krishnamurti: మనిషి తనకు తానుగా కట్టుబాట్లు, మూడ నమ్మకాల నుంచి విముక్తి పొందాలి.. నేడు జిడ్డు కృష్ణమూర్తి జయంతి..
Philosopher Jiddu Krishnamurti: మానసిక విప్లవం, మనోభావ విచారణ, ధ్యానం, మానవ సంబంధాలు, సమాజంలో మౌలిక మార్పు కోసం తాత్విక, ఆధ్యాత్మిక
Philosopher Jiddu Krishnamurti: మానసిక విప్లవం, మనోభావ విచారణ, ధ్యానం, మానవ సంబంధాలు, సమాజంలో మౌలిక మార్పు కోసం తాత్విక, ఆధ్యాత్మిక విషయాలపై అనేక ప్రసంగాలు చేసిన తత్వవేత్త జిడ్డు కృష్ణమూర్తి. ఈయన మే 12న 1895లో ఆంధ్రప్రదేశ్‌లోని మధనపల్లెలోని బ్రహ్మణ కుటుంబంలో జిడ్డు నారాయణయ్య, సంజీవమ్మ దంపతులకు జన్మించాడు. ఆయన ఓ ఆధ్యాత్మిక తత్వవేత్త. 1929 నుంచి 1986లో తాను మరణించే వరకు ప్రపంచ వ్యాప్తంగా ప్రయాణం చేస్తూ తాత్విక, ఆధ్యాత్మిక విషయాలపై అనేక ప్రసంగాలు చేశాడు. మానసిక విప్లవం, మనోభావ విచారణ, ధ్యానం, మానవ సంబంధాలు, సమాజంలో మౌలిక మార్పు వీటిపైనే ఆయన ప్రసంగాలు ఉండేవి. మద్రాసులోని అడయారు దివ్యజ్ఞాన సమాజానికి అంతర్జాతీయ కేంద్రంగా ఉండేది. అనీబిసెంట్ దానికి అధ్యక్షురాలు. జిడ్డు కృష్ణమూర్తి సోదరులు అక్కడే విద్యనభ్యసించేవారు. ఆ తర్వాత వారిని అనిబిసెంట్ తదుపరి విద్య కోసం ఇంగ్లాండ్ పంపించింది. పారిస్ లోని సారబాన్ విశ్వ విద్యాలయంలో కృష్ణమూర్తి సంస్కృతమూ, ఫ్రెంచి భాషలను అధ్యయనం చేసాడు. తన కొడుకులను తనకు తిరిగి ఇప్పించమని కృష్ణమూర్తి తండ్రి కోర్టులో దావా వేశాడు. చివరికి అనిబిసెంట్ కు ఆ దావా వ్యతిరేకమైంది. 1925లో తమ్ముడి మరణంతో కృష్ణమూర్తి తీవ్ర దుఃఖంలో మునిగిపోయాడు. తమ్ముడి మరణం కృష్ణమూర్తిలో పెను మార్పులు తీసుకువచ్చింది.
ఆ క్షణం నుంచి ఏ విషయాన్ని నమ్మేవారు కాదు కృష్ణమూర్తి. కృష్ణమూర్తిని జగద్గురువుగా భావించిన డాక్టర్ అనిబిసెంట్ “ఆర్డర్ ఆఫ్ ది స్టార్ ఇన్ ది ఈస్ట్” అనే ఒక అంతర్జాతీయ సంఘాన్ని స్థాపించి, కృష్ణమూర్తిని దానికి ప్రధానిని చేసింది. ఆ తర్వాత కృష్ణమూర్తిలో దుఃఖం వదిలి ఉత్సాహాన్ని, ఉల్లాసంగా ఉండగలిగాడు. 1929 లో హాలెండ్ లోని ఆమెన్ లో తాను జగద్గురువును కాదని ప్రకటించి “ఆర్డర్ ఆఫ్ ది స్టార్ ఇన్ ది ఈస్ట్ “ను రద్దుపరచాడు.మనిషి తనంతట తానుగా భయం, కట్టుబాట్లు, అధికారం, మూఢవిశ్వాసాల నుండి విముక్తి చెందాలి ఇవే కృష్ణమూర్తి భోదనలు. కృష్ణమూర్తి ఎక్కువ కాలం విదేశాలలో గడిపారు. కానీ, ప్రతి సంవత్సరం భారతదేశానికి వస్తుండేవారు. కృష్ణమూర్తికి తెలుగు రాదు. అసలైన విప్లవం జరగవలసినది హృదయపు లోతులలో. మనిషిలో సమూలమైన పరివర్తన కలగపోతే ఈ యుద్ధాలు, ఈ హింసాకాండ, ఈ విధ్వంసము ఇట్లాగే కొనసాగుతూ ఉంటాయి. ” అలాగే “ రాజకీయ, ఆర్ధిక విప్లవాలు కానీ, సామాజిక సంస్కరణలు కానీ ఈ పరివర్తనను తేలేవు. నూతన ఆదర్శాలు, మతాత్మకమైన ఆశయాలు అవలంబించిన, కొత్త సిద్ధాంతాలతో, కొత్త పద్ధతులలో మనిషిని నిర్బంధించినా ఇది జరగదు. తనని తాను పూర్తిగా అవగాహన చేసుకుంటూ హృదయంతో స్పందిస్తూ జీవించటంలోనే పరివర్తన సాధ్యమౌతుంది. ” ఇవే కృష్ణమూర్తి ప్రసంగాల సారాంశం..
తెలుగులో ఆయనపై కొన్ని ప్రచురణలు కూడా వెలువడ్డాయి. అవి.. కృష్ణమూర్తి తత్వం-పరిచయ సంపుటం, శ్రీలంక సంభాషణలు, గతం నుండి విముక్తి, ఈ విషయమై ఆలోచించండి, ముందున్న జీవితం, ధ్యానం, విద్య, అందు జీవితమునకు గల ప్రాధాన్యత, మన జీవితాలు – జిడ్డు కృష్ణమూర్తి వ్యాఖ్యానాలు, స్వీయజ్ఞానం, స్వేచ్ఛ (ఆది లోనూ – అంతంలోనూ), నీవే ప్రపంచం , గరుడయానం, నిరంతర సత్యాన్వేషణ , చేతన ఇవే ఆయనపై వెలువడిన ప్రచురణలు.
Also Read: బ్యాంక్ కస్టమర్లకు శుభవార్త.. ఇకపై నచ్చిన నెంబర్‌తోనే అకౌంట్.. ఆ బ్యాంకులో కొత్త సేవలు…