బ్యాంక్ కస్టమర్లకు శుభవార్త.. ఇకపై నచ్చిన నెంబర్‏తోనే అకౌంట్.. ఆ బ్యాంకులో కొత్త సేవలు…

మీరు కొత్తగా బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలని ఆలోచిస్తున్నారా ? అయితే మీకు ఇది నిజాంగానే గుడ్ న్యూస్. తమ కస్టమర్లకు అదిరిపోయే సర్వీసులను

బ్యాంక్ కస్టమర్లకు శుభవార్త.. ఇకపై నచ్చిన నెంబర్‏తోనే అకౌంట్.. ఆ బ్యాంకులో కొత్త సేవలు...
Banks

మీరు కొత్తగా బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలని ఆలోచిస్తున్నారా ? అయితే మీకు ఇది నిజాంగానే గుడ్ న్యూస్. తమ కస్టమర్లకు అదిరిపోయే సర్వీసులను అందుబాటులోకి తీసుకువచ్చింది ఓ ప్రముఖ బ్యాంకు. ఇందులో తమ కస్టమర్లకు నచ్చిన నెంబర్లతో అకౌంట్ ఓపెన్ చేసుకునే సదుపాయం కల్పిస్తోంది. అంటే ఇక నుంచి మీ లక్కీ నెంబర్ తోనే బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు అన్న మాటా. ఇంతకీ ఈ కొత్త సర్వీసులను అందుబాటులోకి తీసుకువచ్చిన బ్యాంక్ ఏదీ ? అని ఆలోచిస్తున్నారా ? అయితే నిజాంగానే ఆ బ్యాంకు గురించి తెలుసుకోవాల్సిందే.. New Services

జన స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ తమ కస్టమర్ల కోసం తాజాగా నూతన సర్వీసులను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఐ చ్యూజ్ మై నెంబర్ అనే కొత్త సర్వీసులను అందుబాటులోకి తీసుకువచ్చింది. అంటే ఈ నూతన సర్వీసులలో భాగంగా కస్టమర్లు తమకు నచ్చిన నంబరుతో బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. సేవింగ్స్ ఖాతా, కరెంట్ ఖాతా కస్టమర్లకు ఇది వర్తిస్తుంది. ఇక జన స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఐ చ్యూజ్ మై నెంబర్ సర్వీసులలో భాగంగా కస్టమర్లు 10 నెంబర్ల అకౌంట్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇది వరకు ఈ నెంబర్ పై బ్యాంక్ అకౌంట్ లేనట్లయితే.. ఆ నంబర్ పై మీకు బ్యాంక్ అకౌంట్ ఓపెన్ అవుతుంది. లేదంటే ఖాతా ఓపెన్ కాదు. కాగా జన స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ 2015 నుంచి బ్యాంకింగ్ సేవలు నిర్వహిస్తూ వస్తోంది. మరీ ఇంకెందుకు ఆలస్యం ఇప్పటివరకు మీ లక్కీ నంబర్ పై బ్యాంక్ అకౌంట్ లేని వాళ్లు ఈ నూతన సర్వీసులను ఉపయోగించుకోండి. Jana Small Finance Bank

Also Read: వినియోగదారులకు అలర్ట్.. మరో ట్విస్ట్ ఇచ్చిన వాట్సప్.. ప్రైవసీ పాలసీ అంగీకరించకపోతే ఆ సర్వీసులు పొందలేరు..

ఆ బ్యాంక్ ఖాతాదారులకు శుభవార్త.. కొత్త సర్వీసులు అందుబాటులోకి తెచ్చిన సంస్థ.. వారికి బెనిఫిట్..

Car Loan: మీరు కొత్త కారు కొనాలనుకుంటున్నారా..? తక్కువ వడ్డీతో కారు లోన్లు అందిస్తున్న బ్యాంకులు ఇవే..!