WHO: మాస్కులు ధరించాల్సిందే.. బూస్టర్ డోస్ వేసుకోవాల్సిందే.. డబ్ల్యూహెచ్ఓ సరికొత్త మార్గదర్శకాలు..

కరోనా వైరస్ మళ్లీ కోరలు చాస్తోంది. తగ్గినట్లే తగ్గి మళ్లీ తన విశ్వరూపం చూపిస్తోంది. ఇప్పటికే పుట్టినిల్లుగా భావిస్తున్న చైనాను వణికించేస్తోంది. అంతే కాకుండా ప్రపంచంలోని పలు దేశాల్లోనూ పంజా విసురుతోంది. ఆంక్షలను...

WHO: మాస్కులు ధరించాల్సిందే.. బూస్టర్ డోస్ వేసుకోవాల్సిందే.. డబ్ల్యూహెచ్ఓ సరికొత్త మార్గదర్శకాలు..
Who On Corona
Follow us

|

Updated on: Jan 16, 2023 | 7:07 AM

కరోనా వైరస్ మళ్లీ కోరలు చాస్తోంది. తగ్గినట్లే తగ్గి మళ్లీ తన విశ్వరూపం చూపిస్తోంది. ఇప్పటికే పుట్టినిల్లుగా భావిస్తున్న చైనాను వణికించేస్తోంది. అంతే కాకుండా ప్రపంచంలోని పలు దేశాల్లోనూ పంజా విసురుతోంది. ఆంక్షలను పూర్తిగా సడలించిన తర్వాత ఈ పరిస్థితి మరింత అధికంగా మారింది. ప్రపంచంలోని అన్ని దేశాలకు వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చి, ప్రజలకు వేసినప్పటికీ మహమ్మారి ప్రాబల్యం కొనసాగుతూనే ఉంది. ఇలా మరో వేవ్‌ భయాలు నెలకొన్న సమయంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ కీలక సూచనలు చేసింది. కరోనా ఇన్‌ఫెక్షన్‌ సోకిన వ్యక్తులకు సంబంధించి నూతన మార్గదర్శకాలను రిలీజ్ చేసింది. దీంతోపాటు జన సమూహాల్లో మాస్కు ధరించడం, కొవిడ్‌ చికిత్స, వైద్య నిర్వహణ విషయంలో సిఫార్సులను అప్‌డేట్‌ చేసింది.

కరోనా వైరస్ రోజు రోజుకు పెరుగుతోంది. అంతే కాకుండా వేరియంట్ల రూపంలో విరుచుకుపడుతోంది. దీంతో మాస్కు ధరించడంతోపాటు బూస్టరు డోసు వేసుకోవాలని డబ్ల్యూహెచ్ఓ సూచించింది. కొవిడ్‌ ఇన్‌ఫెక్షన్‌ సోకిన బాధితులకు లక్షణాలు కనిపిస్తే అవి మొదలైనప్పటి నుంచి 10 రోజుల పాటు ఐసొలేషన్‌లో ఉండాలని చెప్పింది. యాంటీజెన్‌ టెస్టులో నెగెటివ్‌ వస్తే ఐసొలేషన్‌ నుంచి ముందుగానే బయటకు రావచ్చని వెల్లడించింది. లక్షణాలు లేని వారు మాత్రం ఐదు రోజులు ఐసొలేషన్‌లో ఉండాలి.

ప్రపంచ వ్యాప్తంగా వైరస్‌ వ్యాప్తి చెందుతోన్న పరిస్థితుల్లో స్థానికతతో సంబంధం లేకుండా మాస్కులను విధిగా ధరించాలని డబ్ల్యూహెచ్‌వో సిఫార్సు చేసింది. మాస్కుతో పాటు కరోనా కనీస జాగ్రత్తలు పాటించాలని స్పష్టం చేసింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం..