AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs NZ: క్రికెట్ ఫ్యాన్స్‌కు బిగ్ అలెర్ట్.. ఉప్పల్‌ మ్యాచ్‌ టికెట్ల జారీ కోసం 16 కౌంటర్లు.. పూర్తి వివరాలివే

India-New Zealand ODI in Hyderabad: హైదరాబాద్ ఉప్పల్ వేదికగా 18న జరగనున్న ఇండియా - న్యూజిలాండ్ వన్డే మ్యాచ్ టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. ఆన్లైన్లో పెట్టిన అరగంటలోపే వేలాది టికెట్లు సేల్ అయ్యాయి.

IND vs NZ: క్రికెట్ ఫ్యాన్స్‌కు బిగ్ అలెర్ట్.. ఉప్పల్‌ మ్యాచ్‌ టికెట్ల జారీ కోసం 16 కౌంటర్లు.. పూర్తి వివరాలివే
Ind Nz Odi Tickets
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Jan 15, 2023 | 9:21 PM

India-New Zealand ODI in Hyderabad: హైదరాబాద్ ఉప్పల్ వేదికగా 18న జరగనున్న ఇండియా – న్యూజిలాండ్ వన్డే మ్యాచ్ టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. ఆన్లైన్లో పెట్టిన అరగంటలోపే వేలాది టికెట్లు సేల్ అయ్యాయి. అయితే, ఆన్లైన్‌లో టికెట్స్ బుక్ చేసుకున్నవారికి సోమవారం నుంచి ఫిజికల్ టికెట్స్ ఇవ్వనున్నారు. దీనికోసం హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియం, ఎల్బీ స్టేడియంలో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారు. ఆన్లైన్ లో బుక్ చేసుకున్నట్టు మెసేజ్ చూపించిన వారినే స్టేడియంలోపలికి అనుమతిస్తారు. ఎల్బీ స్టేడియంలో 8 కౌంటర్లు, 75 మంది పోలీసులు, గచ్చిబౌలి స్టేడియంలో 8 కౌంటర్లు, 80 మంది పోలీసు సిబ్బందితో భద్రత ఏర్పాట్లు చేసినట్లు పోలీసులు తెలిపారు. మహిళలు, పురుషుల కోసం ప్రత్యేకంగా క్యూలైన్లు ఏర్పాటు చేశారు. క్యూఆర్‌ కోడ్‌ చూపిస్తే.. స్కాన్‌ చేసి పేటీఎం సిబ్బంది ఫిజికల్ టికెట్లను ఇస్తున్నారు.

ఇండియా న్యూజిలాండ్ మ్యాచ్ కోసం..14న 6 వేల టికెట్లు, ఆదివారం 7 వేల టికెట్లు ఆన్లైన్ లో అమ్ముడయ్యాయి. సోమవారం సాయంత్రం 5 గంటలకు మరో 7 వేల టికెట్లు అందుబాటులోకి తీసుకురానున్నట్లు హెచ్‌సీఏ వెల్లడించింది. కాగా, ఈ టికెట్లు అందుబాటులోకి తీసుకువచ్చిన నిమిషాల్లోనే అభిమానులు సొంతం చేసుకుంటున్నారు.

18న ఉప్పల్ స్టేడియం వేదికగా టీం ఇండియా తో జరగనున్న వన్డే మ్యాచ్ కోసం.. న్యూజిలాండ్ టీం హైదరాబాద్ చేరుకుంది. రేపు ఉప్పల్ స్టేడియంలో కివీస్ టీం ప్రాక్టీసు చేయనుంది. 16న టీం ఇండియా హైదరాబాద్ చేరుకుంటుంది. 17న ఉప్పల్ స్టేడియంలో రెండు టీమ్స్ ప్రాక్టీసు చేయనున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..