నలుగురు సున్నాలు.. సింగిల్ డిజిట్ దాటని బ్యాటర్లు..12 ఓవర్లలో 23 పరుగులకే ఆలౌట్.. టీ20ల్లో చెత్త రికార్డు
ఇంగ్లండ్ అమ్మాయిలు ఆల్‌రౌండ్ ఫెర్మామెన్స్‌తో అదరగొట్టారు. ముఖ్యంగా బౌలర్లు రికార్డు ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. ఫలితంగా ఆ జట్టు ఏకంగా 176 పరుగుల తేడాతో జింబాబ్వేపై భారీ విజయం సాధించింది.
అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) తొలిసారిగా మహిళల విభాగంలో అండర్-19 ప్రపంచకప్‌ను నిర్వహిస్తోంది. దక్షిణాఫ్రికా వేదికగా జరుగుతోన్న ఈ ప్రతిష్ఠాత్మక టోర్నీలో ఆదివారం ఇంగ్లండ్-జింబాబ్వే మధ్య ఏడో మ్యాచ్ జరిగింది. ఇందులో ఇంగ్లండ్ అమ్మాయిలు ఆల్‌రౌండ్ ఫెర్మామెన్స్‌తో అదరగొట్టారు. ముఖ్యంగా బౌలర్లు రికార్డు ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. ఫలితంగా ఆ జట్టు ఏకంగా 176 పరుగుల తేడాతో జింబాబ్వేపై భారీ విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నాలుగు వికెట్ల నష్టానికి 199 పరుగుల భారీ స్కోరు చేసింది. దీనికి సమాధానంగా జింబాబ్వే జట్టు హాఫ్ సెంచరీ కూడా చేయలేక కేవలం 23 పరుగులకే కుప్పకూలింది. కేవలం 12 ఓవర్లలో ఆ జట్టు ఆలౌటైంది. ఇంగ్లండ్ జట్టు బలమైన స్కోరు సాధించినా బలహీనమైన జింబాబ్వే పోరాడుతుందని చాలామంది భావించారు. కనీసం 100కు పైగా స్కోరు చేస్తారని అంచనా వేశారు. అయితే అంచనాలు తలకిందులయ్యాయి. జట్టులో నలుగురు బ్యాటర్లు అసలు ఖాతా కూడా తెరవలేకపోయారు. ఎవరూ కూడా రెండంకెల స్కోరును అందుకోలేకపోయారు. జట్టు తరఫున అయితే ఇందులో ఆమె విఫలమైంది. ఆ జట్టు బ్యాట్స్‌మెన్ ఎవరూ రెండంకెల స్కోరును అందుకోలేని పరిస్థితి నెలకొంది. జట్టు తరఫున అడెల్ జిమును గరిష్ఠంగా 5 పరుగులు చేసిందంటే ఆ జట్టు ఎంత చెత్తగా ఆడిందో అర్థం చేసుకోవచ్చు. ఆమె తర్వాత తవననైష మారుమణి నాలుగు పరుగులు చేస్తే, కెప్టెన్ కెలిస్ ఎంధోల్వ్ మూడు పరుగులు మాత్రమే చేసింది.
ఇంగ్లండ్ తరఫున గ్రేస్ స్క్రీవెన్స్ నాలుగు ఓవర్లలో రెండు పరుగులిచ్చి నాలుగు వికెట్లు పడగొట్టింది. ఇందులో రెండు మెయిడిన్ ఓవర్లు కూడా వేశాడు. సోఫియా స్మాలీ, జోసీ గ్రోవ్స్ చెరో రెండు వికెట్లు తీశారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ ఆరంభం నుంచే ధాటిగా ఆడింది. కెప్టెన్ గ్రేస్, లిబర్టీ హీప్ తొలి వికెట్‌కు 60 పరుగులు జోడించి జట్టుకు శుభారంభం అందించారు. 25 పరుగులు చేసిన తర్వాత హీప్ ఔట్‌కాగా గ్రేస్ 45 పరుగులు చేసింది. అనంతరం నిమా హాలండ్ 37 బంతుల్లో ఆరు ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 59 పరుగులు చేసింది. చారిస్ పావెల్లి 26 బంతుల్లో 45 పరుగులు చేసింది. ఆమె ఇన్నింగ్స్‌లో ఆరు ఫోర్లు, ఒక సిక్సర్ ఉన్నాయి.
A thumping win for England to kickstart their campaign ?
Watch the Women’s #U19T20WorldCup for FREE on https://t.co/CPDKNxoJ9v (in select regions) ? pic.twitter.com/ZEaes2JKlS
— ICC (@ICC) January 15, 2023
మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..