Viral Video: గజరాజుకు కోపం వస్తే ఇట్లనే ఉంటది మరి.. రోడ్డుపై వెళ్లే వాహనంపై ఒక్కసారిగా ఎటాక్.. ఆ తర్వాత..

ఒకప్పుడు భూమిపై అడవులు ఎక్కువగా కనిపించేవి, కానీ ఇప్పుడు అడవులు అంతంతమాత్రంగానే ఉన్నాయి. అడవులను ఎక్కువగా నరుకుతుండటంతో అక్కడ నివసించే జంతువులు.. జనావాస ప్రాంతాలకు వస్తున్నాయి.

Viral Video: గజరాజుకు కోపం వస్తే ఇట్లనే ఉంటది మరి.. రోడ్డుపై వెళ్లే వాహనంపై ఒక్కసారిగా ఎటాక్.. ఆ తర్వాత..
Elephant Attack
Follow us

|

Updated on: Jan 15, 2023 | 6:38 PM

ఒకప్పుడు భూమిపై అడవులు ఎక్కువగా కనిపించేవి, కానీ ఇప్పుడు అడవులు అంతంతమాత్రంగానే ఉన్నాయి. అడవులను ఎక్కువగా నరుకుతుండటంతో అక్కడ నివసించే జంతువులు.. జనావాస ప్రాంతాలకు వస్తున్నాయి. అంతరించిపోతున్న అడవులతో పర్యావరణం కూడా రోజురోజుకి క్షీణిస్తోంది. అడవులు అంతరించిపోవడం వల్ల అక్కడ ఉండే సింహాలు, పులులు వంటి క్రూరమైన జంతువులు, ఏనుగులు, జింకలు లాంటి జంతువులు కూడా ఆహారం, నీటి కోసం జనావాసాల్లోకి ప్రవేశించడం లేదా సంచరించడం లాంటివి చేస్తున్నాయి. ఇలాంటి సందర్భాల్లో జంతువుల విధ్వంసంతో అక్కడి ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. తాజాగా, సోషల్ మీడియాలో ఓ ఏనుగు విధ్వంసానికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. దీనిలో ఏనుగు వాహనంపై దాడి చేస్తుంది.

ఈ వీడియోలో భారీ ఏనుగు కదులుతున్న వాహనంపై అకస్మాత్తుగా దాడి చేయడాన్ని చూడవచ్చు. వీడియోలో రోడ్డు మధ్యలో ఏనుగు నిలబడి ఉంది. ఈ క్రమంలో దానికి ఎదురుగా ట్రాలీ కారు వెళుతూ కనిపించింది. ఈ క్రమంలో రోడ్డు దాటడానికి ప్రయత్నిస్తున్న ఏనుగు అకస్మాత్తుగా వాహనంపై అటాక్ చేసింది. గజరాజు కోపంతో వాహనంపై పలుమార్లు దాడి చేసింది. ముందుగా వాహనాన్ని రోడ్డుపై నుంచి తోసేసి ఒక్కసారిగా బోల్తా పడేసింది. ఆ తర్వాత కూడా కోపం చల్లారకపోవడంతో కారుపై పలుమార్లు దాడిచేసింది.

ఇవి కూడా చదవండి

వీడియో చూడండి..

ఈ ప్రమాదకరమైన వీడియోను ఐపీఎస్ అధికారి రూపిన్ శర్మ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్విట్టర్‌లో పంచుకున్నారు. ఈ వీడియో గౌహతికి సంబంధించినదని పేర్కొంటున్నారు. ఈ 35 సెకన్ల ఈ వీడియోను ఇప్పటివరకు 35 వేలకు పైగా వీక్షించగా.. వందలాది మంది లైక్ చేశారు. దీంతోపాటు పలు రకాలుగా స్పందిస్తున్నారు. అడవులు అంతరించిపోతే.. ఇలాంటి ఘటనలే జరుగుతాయంటూ పేర్కొంటున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం..