AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: వీడెవడండీ బాబు.. విమానంలో ప్రయాణికుడి రిక్వెస్ట్‌కు ఎయిర్ హోస్టెస్ షాక్.. వీడియో చూస్తే నవ్వులే..

సోషల్ మీడియా ప్రపంచంలో నిత్యం ఎన్నో రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో కొన్ని ఫన్నీగా, మరికొన్ని ఆశ్చర్యకరంగా ఉంటాయి. అయితే, తాజాగా ఓ విమానంలో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

Viral Video: వీడెవడండీ బాబు.. విమానంలో ప్రయాణికుడి రిక్వెస్ట్‌కు ఎయిర్ హోస్టెస్ షాక్.. వీడియో చూస్తే నవ్వులే..
Viral Video
Shaik Madar Saheb
|

Updated on: Jan 15, 2023 | 5:10 PM

Share

సోషల్ మీడియా ప్రపంచంలో నిత్యం ఎన్నో రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో కొన్ని ఫన్నీగా, మరికొన్ని ఆశ్చర్యకరంగా ఉంటాయి. అయితే, తాజాగా ఓ విమానంలో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. గతంలో కంటే ఇప్పుడు విమానంలో ప్రయాణించడం చాలా సరసమైనదిగా మారింది. ఇంతకుముందు ఎప్పుడో విమానంలో ప్రయాణించవచ్చని భావించే వారు సైతం ఇప్పుడు దర్జాగా ప్రయాణిస్తున్నారు. అయితే, విమానంలో ఆహారం, పానీయాలు లాంటివి తీసుకెళ్లడం నిషేధం. ప్రయాణికులకు ఏది అవసరమో.. విమానం లోపల అందుబాటులో ఉంచుతారు. విమానంలో మద్యం లేదా సిగరెట్ తాగడం, గుట్కా నమలడం లాంటివి నిషేధం అన్న విషయం తెలిసిందే. అయితే, ఓ ప్రయాణికుడు సరదా కోసం చేసిన ఓ ఫన్నీ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిలో ఒక వ్యక్తి గుట్కా ఉమ్మివేయడానికి విమానం కిటికీని తెరవాలంటూ ఎయిర్ హెస్టెస్ ను కోరుతాడు. ఈ వీడియో చాలా ఫన్నీగా ఉంది, ఇది చూసి నెటిజన్లు తెగ నవ్వుకుంటున్నారు.

విమానంలో చాలా మంది సీట్లలో కూర్చొని ఉండటాన్ని వీడియోలో చూడవచ్చు. ఈలోగా, ఒక వ్యక్తి తంబాకు (ఖైనీ) అరచేతిలో వేసుకున్నట్లు నటించడం ప్రారంభించాడు. ఈ సమయంలో మహిళా సిబ్బందిని విమానం కిటికీ తెరవాలంటూ అడుగుతాడు. ఎయిర్ హోస్టెస్ ఏదో అడగగా.. గుట్కా ఉమ్మివేయాలని.. దానికి కిటికీ తెరవాలంటూ కోరుతాడు. ఇది విన్న ఎయిర్ హోస్టెస్ తెగ నవ్వుతుంది. ఆమెతోపాటు చుట్టూ కూర్చున్న వాళ్ళు సైతం నవ్వడం మొదలుపెట్టారు.

ఇవి కూడా చదవండి

వీడియో చూడండి..

వాస్తవానికి ఈ వీడియో సరదా కోసం రూపొందించారు. కానీ.. ఇది సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. విమానంలో కిటికీ తెరుచుకోదన్న విషయం తెలిసిందే. ఈ ఫన్నీ వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఇన్‌స్టాగ్రామ్‌లో videonation.teb అనే యూజర్ షేర్ చేయగా.. వేలాది మంది వీక్షించి లైక్ చేస్తున్నారు. ఇంతకుముందెన్నడూ చూడలేదని కొందరు వ్యాఖ్యానించగా.. ఇలాంటి ఘటన ఎక్కడో ఒకచోట జరిగే ఉంటుందంటూ మరొకరు కామెంట్ చేశారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం..

చికెన్‌-మటన్‌ ఇష్టపడని వారి కోసం వెజిటేరియన్‌ మటన్‌! పోషకాల పుట్ట
చికెన్‌-మటన్‌ ఇష్టపడని వారి కోసం వెజిటేరియన్‌ మటన్‌! పోషకాల పుట్ట
పసిడి ప్రియులకు దిమ్మతిరిగే షాక్ రికార్డ్ స్థాయికి బంగారం, వెండి
పసిడి ప్రియులకు దిమ్మతిరిగే షాక్ రికార్డ్ స్థాయికి బంగారం, వెండి
మేడారం జాతరకు వెళ్లేవారికి శుభవార్త.. ఆర్టీసీ బిగ్ అప్డేట్
మేడారం జాతరకు వెళ్లేవారికి శుభవార్త.. ఆర్టీసీ బిగ్ అప్డేట్
ప్రేమలో పడ్డారా? పెళ్లి వార్తలపై క్లారిటీ ఇచ్చిన మృణాల్!
ప్రేమలో పడ్డారా? పెళ్లి వార్తలపై క్లారిటీ ఇచ్చిన మృణాల్!
తెలంగాణలోని రైతులకు తీపికబురు.. రాష్ట్రవ్యాప్తంగా కొత్త పథకం
తెలంగాణలోని రైతులకు తీపికబురు.. రాష్ట్రవ్యాప్తంగా కొత్త పథకం
వందే భారత్‌ టికెట్ క్యాన్సిల్ చేస్తే రిఫండ్ వస్తుందా ??
వందే భారత్‌ టికెట్ క్యాన్సిల్ చేస్తే రిఫండ్ వస్తుందా ??
చంటి పిల్లాడిని ఎత్తుకుని.. కదిలే రైలు ఎక్కిన మహిళ.. కట్ చేస్తే..
చంటి పిల్లాడిని ఎత్తుకుని.. కదిలే రైలు ఎక్కిన మహిళ.. కట్ చేస్తే..
పెళ్లికాని ప్రసాదుల వెరైటీ ప్లాన్.. వధువు కావాలంటూ..
పెళ్లికాని ప్రసాదుల వెరైటీ ప్లాన్.. వధువు కావాలంటూ..
మేడారం జాతరలో టాలీవుడ్ హీరోయిన్..
మేడారం జాతరలో టాలీవుడ్ హీరోయిన్..
తీవ్రమైన కడుపునొప్పితో ఆస్పత్రికి వెళ్లిన ఓ ప్రజాపతి..స్కానింగ్‌
తీవ్రమైన కడుపునొప్పితో ఆస్పత్రికి వెళ్లిన ఓ ప్రజాపతి..స్కానింగ్‌