Jallikattu 2023: తగ్గేదేలే.. 60 మందికి గాయాలు.. పది మంది పరిస్థితి విషమం.. జోరుగా జల్లికట్టు సమరం..

మదురై జిల్లాలో జల్లికట్టు సంబరాలు అంబరాన్ని తాకాయి. అవనీయపురంలో జరిగిన జల్లికట్టు పోటీల్లో వందలాది మంది యువకులు పాల్గొన్నారు. జల్లికట్టు ప్రారంభంలోనే వందలాది ఎద్దులు ముందుకు దూసుకుపోయాయి.

Jallikattu 2023: తగ్గేదేలే.. 60 మందికి గాయాలు.. పది మంది పరిస్థితి విషమం.. జోరుగా జల్లికట్టు సమరం..
Jallikattu
Follow us

|

Updated on: Jan 15, 2023 | 8:33 PM

సంక్రాంతి సంబురాల్లో తమిళనాట జల్లికట్టు ఫేమస్‌. మదురై జిల్లాలోని అవనీయపురం ఈ జల్లికట్టు ఆటకు కేరాఫ్‌ అడ్రస్‌. ఇవాళ జల్లికట్టు ఫైనల్స్‌ లో 60 మందికి పైగా గాయపడ్డారు. 10 మంది పరిస్థితి విషమంగా ఉంది. జల్లికట్టు ఫైనల్స్ కోసం 1500 మంది పోలీసులతో భారీ భద్రత కల్పించారు. 40 ప్రత్యేక మెడికల్ క్యాంప్స్ ఏర్పాటు చేశారు. అవనీయపురంలో జరిగిన జల్లికట్టు ఫైనల్స్‌ అదరహో అనిపించాయి. బెదిరిపోతూ పరుగులు తీసిన ఎద్దులు, వాటిని పట్టుకునేందుకు యువకుల సాహసాలు అందరిని ఆకట్టుకున్నాయి. తమ్ముడూ లెట్స్‌ డూ కుమ్ముడు అనే లెవెల్లో ఎద్దులు వీరంగం వేశాయి. ఈ బాహు బుల్స్‌ను లొంగదీయడానికి యువకులు నానా తంటాలు పడ్డారు. కుమ్ము- దుమ్ము అన్నట్టు పోటీలు సాగాయి. ఎద్దులు కొమ్ములు విసిరితే దమ్మున్న కుర్రాళ్లు వాటి కొమ్ములు వంచేందుకు రంగంలోకి దూకారు. ఎద్దులు, యువకుల మధ్య వీర లెవెల్లో సమరం సాగింది. పోట్ల గిత్తలతో కొట్లాట కాక రేపింది.

మదురై జిల్లాలో జల్లికట్టు సంబరాలు అంబరాన్ని తాకాయి. అవనీయపురంలో జరిగిన జల్లికట్టు పోటీల్లో వందలాది మంది యువకులు పాల్గొన్నారు. జల్లికట్టు ప్రారంభంలోనే వందలాది ఎద్దులు ముందుకు దూసుకుపోయాయి. ఎద్దులను లొంగదీసిన వాళ్లకు, వీరులకు పట్టుబడకుండా తప్పించుకున్న ఎద్దుల యజమానులకు బహుమానాలు అందజేశారు.

10 మంది పరిస్థితి విషమం..

ఈసారి జల్లికట్టు పోటీల్లో దాదాపు 60 మందికిపైగా గాయపడ్డారు. వారిలో 10 మంది పరిస్థితి విషమంగా ఉందని పేర్కొంటున్నారు. ఇక ఫైనల్స్‌లో విజయ్‌ అనే యువకుడు విజేతగా నిలిచి కారును ప్రైజ్‌గా పొందారు.

ఇవి కూడా చదవండి

చిత్తూరులో 15మందికి గాయాలు..

సుప్రీంకోర్టుతో పాటు తమిళనాడు సర్కార్‌ విధించిన నిబంధనలకు అనుగుణంగా పోటీలు జరిగాయి. ఇక ఏపీలోని చిత్తూరు జిల్లాలో కూడా జల్లికట్టు పోటీల్లో పెద్దఎత్తున యువకులు పాల్గొన్నారు. చిత్తూరు జిల్లాలో జరిగిన జల్లికట్టు పోటీల్లో 15మంది గాయపడ్డారు. నిర్వాహకులు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా పోటీల్లో పాల్గొన్నవాళ్లకు ప్రమాదాలు తప్పట్లేదు. ఇది ప్రాణాలకు తెగించి ఆడే ఆట కావడంతో గాయాల పాలవడం, ఒక్కోసారి ప్రాణాలు కోల్పోవడం కూడా జరుగుతుంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం..