AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

LIC Aadhaar Shila: రోజుకు రూ. 58 పెట్టుబడితో ఏకంగా రూ. 9 లక్షలు సంపాదించే అవకాశం.. మహిళలకు మంచి ఆప్షన్..

అన్ని ఆదాయ వర్గాల వారికి కూడా మరింత చేరువ అయ్యేందుకు అవసరమైన ప్రణాళికలతో సంస్థ ముందుకెళ్తోంది. ఇదే క్రమంలో ఎల్‌ఐసీ ఆధార్ శిలా పాలసీని తీసుకొచ్చింది. మహిళలకు ప్రత్యేకించిన ఈ పాలసీ గురించి తెలుసుకుందాం..

LIC Aadhaar Shila: రోజుకు రూ. 58 పెట్టుబడితో ఏకంగా రూ. 9 లక్షలు సంపాదించే అవకాశం.. మహిళలకు మంచి ఆప్షన్..
Lic
Follow us
Madhu

| Edited By: Ravi Kiran

Updated on: Jan 16, 2023 | 6:00 AM

లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC).. అత్యంత ప్రజాదరణ పొందిన సంస్థ. అది అందించే స్కీమ్ లు, రిటర్న్ లు, క్లయిమ్స్ లు నిర్వహించే విధానం, అనువైన, సులభమైన పద్ధతులు  ప్రజల్లో దానిపై నమ్మకాన్ని పెంచాయి. ఫలితంగా సమాజంలో ప్రతి వర్గానికి సంబంధించిన వారూ ఎల్ఐసీ పాలసీ కలిగి ఉంటున్నారు. అందువల్ల ఇది బీమా రంగంలోనే మార్కెట్ లీడర్ గా అవతరించింది. ఆ స్థానాన్ని పదిలం చేసుకునేందుకు మరిన్ని సంస్కరణలతో పాటు, వినియోగదారులకు అత్యంత సౌకర్యవంతమైన క్లయిమ్ విధానాలను తీసుకొస్తుంది. అన్ని ఆదాయ వర్గాల వారికి కూడా మరింత చేరువ అయ్యేందుకు అవసరమైన ప్రణాళికలతో సంస్థ ముందుకెళ్తోంది. ఇదే క్రమంలో ఎల్‌ఐసీ ఆధార్ శిలా పాలసీని తీసుకొచ్చింది. మహిళలకు ప్రత్యేకించిన ఈ పాలసీ గురించి తెలుసుకుందాం..

తక్కువ, మధ్యతరగతి వర్గాల వారికి..

ఎల్‌ఐసి ఆధార్ శిలా పాలసీ తక్కువ, మధ్యతరగతి ఆదాయ వర్గాలకు బాగుంటుంది. చాలా ఎల్‌ఐసీ పాలసీల మాదిరిగానే ఇది దీర్ఘకాలిక పెట్టుబడి. కేవలం మహిళలకు మాత్రమే ఈ పాలసీ అవకాశం ఉంటుంది. డెత్ కవర్ కూడా అవకాశం ఉంది. దీనిలో కనిష్టంగా రూ. 75,000.. గరిష్టంగా రూ. 3 లక్షలు వరకు పొదుపు చేసుకోవచ్చు. ఒక వ్యక్తి ప్రతిరోజూ రూ.58 పెట్టుబడి పెడితే, మెచ్యూరిటీ సమయంలో లక్షల రూపాయలు వస్తాయి.

ఇది ప్లాన్..

ఎల్ఐసీ ఆధార్ శిలా అనేది నాన్-లింక్డ్, పార్టిసిపేటింగ్, వ్యక్తిగత, లైఫ్ అస్యూరెన్స్ ప్లాన్. ఇది రక్షణతో పాటు పొదుపును కూడా అందిస్తుంది. ఇది పాలసీదారుడు దురదృష్టవశాత్తూ మరణించిన సందర్భంలో కుటుంబానికి ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది మెచ్యూరిటీ సమయంలో అధిక మొత్తాన్ని అందిస్తుంది. దీనికి రుణ సౌకర్యం కూడా ఉంది. ఆకస్మిక మరణం చెందిన సందర్భంలో వ్యక్తి కట్టిన వార్షిక ప్రీమియంలకు ఏడు రెట్లు, బేసిక్ మొత్తంలో 110 శాతం అందుతుంది. ఈ పాలసీ తీసుకునేందుకు కనీస వయస్సు 8 ఏళ్లు కాగా గరిష్ట వయస్సు 55 సంవత్సరాలు. పాలసీ వ్యవధి 10 నుంచి 20 ఏళ్లు ఉంటుంది. ఈ ప్లాన్ మహిళల కోసం మాత్రమే. మెచ్యూరిటీకి గరిష్ట వయస్సు 70 సంవత్సరాలు. ఇందులో లాయల్టీ అడిషన్ ఫీచర్ కూడా ఉంది. ప్రీమియంలను నెలవారీ, మూడునెలలకు ఓసారి, ఆరు నెలలు, ఏడాదికి ఒకసారి చెల్లించుకునే వెసులుబాటు ఉంది.

ఇవి కూడా చదవండి

ఎంత వస్తుంది..

20 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఈ పాలసీని ప్రారంభిస్తే.. ప్రతిరోజూ 58 రూపాయల చొప్పున పెట్టుబడి పెడితే, మీరు సంవత్సరానికి 21,918 రూపాయలు పెట్టుబడి పెట్టనట్లు అవుతుంది. అలా 20 ఏళ్ల తర్వాత, మీరు పెట్టుబడి పెట్టిన మొత్తం రూ. 4,29,392 అవుతుంది. మెచ్యూరిటీ సమయంలో మీరు రూ. 7,94,000 పొందుతారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం..