AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Budget stocks 2023: మదుపరులకు గుడ్ న్యూస్.. పెట్టుబడికి బెస్ట్ స్టాక్స్ ఇవే.. వివరాలు ఇవిగో..

ప్రస్తుత ప్రభుత్వానికి ఇదే చివరి పూర్తి స్థాయి బడ్జెట్ కానుండటంతో అందరి దృష్టి దీనిపై పడింది. ముఖ్యంగా మౌలిక సదుపాయాల పెంపుపై కేంద్రం ప్రత్యేకంగా ఫోకస్ పెట్టే అవకాశాలున్నాయన్న ఊహాగానాల నేపథ్యంలో దలాల్ స్ట్రీట్ ఉత్సాహంతో బడ్జెట్ కోసం ఎదురుచూస్తోంది.

Budget stocks 2023: మదుపరులకు గుడ్ న్యూస్.. పెట్టుబడికి బెస్ట్ స్టాక్స్ ఇవే.. వివరాలు ఇవిగో..
Stocks To Buy
Madhu
| Edited By: Ravi Kiran|

Updated on: Jan 16, 2023 | 6:30 AM

Share

బడ్జెట్ సమయం ఆసన్నమైంది. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తన కొత్త పద్దుల లెక్కను ప్రకటించేందుకు సమాయత్తమవుతున్నారు. పైగా ప్రస్తుత ప్రభుత్వానికి ఇదే చివరి పూర్తి స్థాయి బడ్జెట్ కానుండటంతో అందరి దృష్టి దీనిపై పడింది. ముఖ్యంగా మౌలిక సదుపాయాల పెంపుపై కేంద్రం ప్రత్యేకంగా ఫోకస్ పెట్టే అవకాశాలున్నాయన్న ఊహాగానాల నేపథ్యంలో దలాల్ స్ట్రీట్ ఉత్సాహంతో బడ్జెట్ కోసం ఎదురుచూస్తోంది.

ఇదే చివరి బడ్జెట్..

కొంతమంది స్టాక్ మార్కెట్ నిపుణుల అభిప్రాయం ప్రకారం, అధికారంలో ఉన్న కేంద్ర ప్రభుత్వానికి ఇది చివరి పూర్తి స్థాయి బడ్జె.. మరోవైపు 2023లో 5 రాష్ట్రాల ఎన్నికలు జరగనున్నాయి. దీంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ మౌలిక సదుపాయాల రంగంపై దృష్టి సారిస్తాయని చెబుతున్నారు. వారి చేతుల్లో ఉన్న అవకాశం మేరకు నిర్ణీత సమయంలోనే భారీ ఉద్యోగ అవకాశాలను సృష్టించే చాన్స్ ఉందని వివరిస్తున్నారు. దీని ఫలితంగా వచ్చే 3-4 త్రైమాసికాలలో కొన్ని లిస్టెడ్ ఇన్‌ఫ్రా రంగ కంపెనీల ఆర్డర్ బుక్, మార్జిన్‌లు మెరుగుపడతాయని వివరిస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో పెట్టుబడి దారులు ఆలోచనలు సహజంగానే ఇన్ ఫ్రా రంగం వైపు మళ్లతున్నాయి. అది ఎందుకో ఇప్పుడు చూద్దాం..

బడ్జెట్ కన్నా ముందే ఎందుకు..

యూనియన్ బడ్జెట్ 2023 కంటే ముందుగానే ఇన్‌ఫ్రా స్టాక్‌లను కొనుగోలు చేస్తే మేలని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే వచ్చే యూనియన్ బడ్జెట్ ప్రస్తుత కేంద్ర ప్రభుత్వానికి చివరి పూర్తి బడ్జెట్ అవుతుంది. దాని గత బడ్జెట్‌లను పరిశీలిస్తే, ఉపాధి కల్పన విషయంలో మోడీ ప్రభుత్వం వెనుకబడి ఉంది. దీనిపై ప్రతిపక్షాలు తీవ్రంగా విమర్శిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఉపాధి కల్పనపై ప్రత్యేక దృష్టి సారించే ప్రజా-కేంద్రీకృత బడ్జెట్‌ను ప్రభుత్వం సమర్పించాలని భావిస్తోంది. వ్యవసాయం తర్వాత అత్యధిక ఉద్యోగాలను సృష్టించే రంగాలలో మౌలిక సదుపాయాలు ఒకటి. పైగా ఈ ఏడాది 5 రాష్ట్రాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఆ రాష్ట్రాల్లో కూడా ప్రభుత్వాలు ఉద్యోగాల కల్పనపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తాయి. ఫలితంగా రాబోయే ఒకటిన్నర సంవత్సరాలలో, మౌలిక సదుపాయాల కంపెనీలు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల ప్రత్యేక దృష్టిలో ఉండబోతున్నాయి. ఇది కొన్ని లిస్టెడ్ ఇన్‌ఫ్రా కంపెనీల ఆర్డర్ బుక్, మార్జిన్‌లలో మెరుగుదలకు దారి తీస్తుంది . కాబట్టి, మీడియం నుంచి లాంగ్ టర్మ్ లేదా 9 నెలల నుండి 12 నెలల వరకు బడ్జెట్ ప్రెజెంటేషన్ కంటే ముందుగానే ఇన్‌ఫ్రా స్టాక్‌లను కొనుగోలు చేయడం మంచిది.

ఇవి కూడా చదవండి

ఏ స్టాక్స్ అయితే మంచిది..

స్టాక్ మార్కెట్ నిపుణుల అభిప్రాయం పక్రారం బడ్జెట్ రావడానికి కన్నా ముందే ఎన్‌సిసి , కెఎన్‌ఆర్ కన్స్ట్రక్షన్స్ , కమిన్స్ ఇండియా , ఎల్ అండ్ టి మొదలైన స్టాక్‌ లు బెస్ట్ ఎంపికలుగా సూచిస్తున్నారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం..