Gold Price Today: బంగారం ప్రియులకు కాస్త ఊరట.. స్వల్పంగా పెరిగన ధర. ఈరోజు తులం ఎంత ఉందంటే..

దేశంలో బంగారం ధరలు భారీగా పెరుగుతోన్న విషయం తెలిసిందే. గడిచిన కొన్ని రోజులుగా ప్రతీ రోజూ బంగారం ధరలో పెరుగుదల కనిపిస్తోంది. అయితే సోమవారం మాత్రం పెరుగుతోన్న ధరల నుంచి కాస్త ఉపశమనం కనిపించింది. ఈరోజు కూడా ధర పెరిగినప్పటికీ..

Gold Price Today: బంగారం ప్రియులకు కాస్త ఊరట.. స్వల్పంగా పెరిగన ధర. ఈరోజు తులం ఎంత ఉందంటే..
Gold Price Today
Follow us
Narender Vaitla

|

Updated on: Jan 16, 2023 | 6:04 AM

దేశంలో బంగారం ధరలు భారీగా పెరుగుతోన్న విషయం తెలిసిందే. గడిచిన కొన్ని రోజులుగా ప్రతీ రోజూ బంగారం ధరలో పెరుగుదల కనిపిస్తోంది. అయితే సోమవారం మాత్రం పెరుగుతోన్న ధరల నుంచి కాస్త ఉపశమనం కనిపించింది. ఈరోజు కూడా ధర పెరిగినప్పటికీ అది నామ మాత్రం కావడం సంతోషానిచ్చే వార్త. తులం బంగారం రూ. 10 పెరిగింది. ఇక దేశ వ్యాప్తంగా పలు ప్రధాన నగరాల్లో తులం బంగారం ధర ఎంత ఉందో ఇప్పుడు చూద్దాం.

* దేశ రాజధాని న్యూఢిల్లీలో 10 గ్రాముల 22 రూ. 52,160గా ఉండగా 24 క్యారెట్ల బంగారం ధర రూ. 56,990 వద్ద కొనసాగుతోంది.

* దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో 10 గ్రాముల 22 క్యారెట్స్‌ గోల్డ్‌ రేట్‌ రూ. 52,010గా ఉండగా, 24 క్యారెట్స్‌ బంగారం ధర రూ. 56,740గా ఉంది.

ఇవి కూడా చదవండి

* తమిళనాడు రాజధాని చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 52,970 వద్ద కొనసాగుతుండగా, 24 క్యారెట్ల గోల్డ్‌ రేట్‌ రూ. 57,780గా ఉంది.

* కర్ణాటక రాజధాని బెంగళూరులో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 52,060 కాగా, 24 క్యారెట్స్‌ గోల్డ్ రేట్‌ రూ. 56,790 వద్ద కొనసాగుతోంది.

తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి..

* హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 52,000 వద్ద కొనసాగుతుండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 56,730 వద్ద కొనసాగుతోంది.

* విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధరూ. 52,010 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 56,740 వద్ద కొనసాగుతోంది.

* విశాఖపట్నంలో 10 గ్రాముల 22 క్యారెట్స్‌ గోల్డ్‌ రేట్ రూ. 52,010 24 క్యారెట్స్‌ ధర రూ. 56,740గా ఉంది.

వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

ఇక వెండి ధరల విషయానికొస్తే ధరలో మార్పు కనిపించలేదు. దేశవ్యాప్తంగా దాదాపు అన్ని నగరాల్లో వెండి ధరలో ఎలాంటి మార్పలేదు. సోమవారం దేశంలోని పలు ప్రధాన నగరాల్లో సోమవారం కిలో వెండి ధర ఎంతో ఉందో ఇప్పుడు చూద్దాం. దేశ రాజధాని న్యూఢిల్లీలో కిలో వెండి ధర రూ. 72,750గా ఉంది. ముంబయిలో కిలో వెండి ధర రూ. 72,750 వద్ద కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే.. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ. 74,000గా నమోదుకాగా, విజయవాడ, విశాఖపట్నంలోనూ రూ. 74,000 వద్ద కొనసాగుతోంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..