Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Supriya Sule: ఎంపీ సుప్రియా సులేకు తృటిలో తప్పిన ప్రమాదం.. కరాటే ప్రారంభోత్సవ వేడుకలో చీరకు అంటుకున్న నిప్పు..

ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌ కుమార్తె, ఎంపీ సుప్రియా సులేకు తృటిలో పెను ప్రమాదం తప్పింది. హింజేవాడిలో జరిగిన ఓ కార్యక్రమంలో ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే చీరకు ప్రమాదవశాత్తూ మంటలు అంటుకున్నాయి.

Supriya Sule: ఎంపీ సుప్రియా సులేకు తృటిలో తప్పిన ప్రమాదం.. కరాటే ప్రారంభోత్సవ వేడుకలో చీరకు అంటుకున్న నిప్పు..
Supriya Sule
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Jan 15, 2023 | 7:39 PM

ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌ కుమార్తె, ఎంపీ సుప్రియా సులేకు తృటిలో పెను ప్రమాదం తప్పింది. హింజేవాడిలో జరిగిన ఓ కార్యక్రమంలో ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే చీరకు ప్రమాదవశాత్తూ మంటలు అంటుకున్నాయి. దీపం తగిలి చీరకు మంటలు వ్యాపించగా.. సకాలంలో మంటలను ఆర్పివేయడంతో పెను ప్రమాదం తప్పింది. బారామతి లోక్‌సభ నియోజకవర్గంలోని హింజేవాడిలో కరాటే పోటీల ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎన్సీపీ ఎంపీ సుప్రియా సులే పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఛత్రపతి శివాజీ విగ్రహానికి పూలమాల వేస్తుండగా.. ప్రమాదవశాత్తు దీపం తగిలి ఆమె చీరకు మంటలు వ్యాపించాయి. అయితే, వెంటనే అప్రమత్తమైన ఎంపీ సుప్రియా సులే స్వయంగా మంటలను ఆర్పివేశారు.

ఈ ఘటన తర్వాత ఎన్సీపీ కార్యకర్తల్లో ఆందోళన నెలకొంది. సమాచారం అందుకున్న కార్యకర్తలు సుప్రియా సూలే ఆరోగ్యం గురించి ఆరా తీయడం ప్రారంభించారు. దీంతో సుప్రియా సులే తాను ఆరోగ్యంగా ఉన్నట్లు సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ‘‘నేను క్షేమంగా ఉన్నాను. ఎవరూ ఆందోళన చెందవద్దు’’ అంటూ సుప్రియా సూలే కార్యకర్తలకు విజ్ఞప్తి చేశారు. ‘‘మా శ్రేయోభిలాషులు, పౌరులు, కార్యకర్తలు, అధికారులకు నా విన్నపం ఏమిటంటే.. నేను క్షేమంగా ఉన్నాను.. ఆందోళన చెందవద్దు. మీరు చూపే ప్రేమ, శ్రద్ధ నాకు విలువైనవి. అందరికీ ధన్యవాదాలు’’ అంటూ సుప్రియా సూలే ప్రకటన విడుదల చేశారు.

వీడియో చూడండి..

కాగా, సుప్రియా సూలే ఈరోజు పూణె పర్యటనలో ఉన్నారు. పూణే, బారామతిలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. బారామతిలోని హింజేవాడిలో శిబారీ ఆఫ్ కరాటే పోటీల ప్రారంభోత్సవం సమయంలో ఈ ఘటన జరిగింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం..

ఏసీ లాంటి కూలింగ్‌.. తక్కువ ధరల్లో ఐదు ఎయిర్‌ కూలర్లు..!
ఏసీ లాంటి కూలింగ్‌.. తక్కువ ధరల్లో ఐదు ఎయిర్‌ కూలర్లు..!
సిల్వర్‌ స్క్రీన్‌ మీద రామనామస్మరణ.. హనుమాన్ జయంతి అప్డేట్స్ ఇవే.
సిల్వర్‌ స్క్రీన్‌ మీద రామనామస్మరణ.. హనుమాన్ జయంతి అప్డేట్స్ ఇవే.
పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకుంటే.. ఆస్తిలో వాటా ఆడగొచ్చా?
పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకుంటే.. ఆస్తిలో వాటా ఆడగొచ్చా?
ఎడారి దేశంలో ఈ మొక్క బంగారు గని.. మన దేశంలో పెంచే ప్రయత్నం..
ఎడారి దేశంలో ఈ మొక్క బంగారు గని.. మన దేశంలో పెంచే ప్రయత్నం..
మీరు గ్యాస్ట్రిక్ సమస్యతో బాధపడుతున్నారు..అయితే ఇలా చేయండి!
మీరు గ్యాస్ట్రిక్ సమస్యతో బాధపడుతున్నారు..అయితే ఇలా చేయండి!
అల్లు అర్జున్ బన్నీ సినిమా హీరోయిన్ ఇప్పుడు ఎలా ఉందో తెలుసా.?
అల్లు అర్జున్ బన్నీ సినిమా హీరోయిన్ ఇప్పుడు ఎలా ఉందో తెలుసా.?
మహిళ శరీరం నుంచి పంది కిడ్నీ తొలగింపు! కారణం..?
మహిళ శరీరం నుంచి పంది కిడ్నీ తొలగింపు! కారణం..?
మెడిమిక్స్‌ సోప్‌ తొలినాళ్లలో ఎందుకు తయారు చేశారో తెలుసా..?
మెడిమిక్స్‌ సోప్‌ తొలినాళ్లలో ఎందుకు తయారు చేశారో తెలుసా..?
వచ్చే మూడు రోజలు ఏపీకి రెయిన్ అలర్ట్.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్
వచ్చే మూడు రోజలు ఏపీకి రెయిన్ అలర్ట్.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్
పవర్‌ఫుల్‌ టూ గ్లామర్.. 2 వారాల్లో రెండు వేరియేషన్స్‌‎లో తమన్నా..
పవర్‌ఫుల్‌ టూ గ్లామర్.. 2 వారాల్లో రెండు వేరియేషన్స్‌‎లో తమన్నా..