Hyderabad: హైదరాబాద్ ఎనిమిదో నిజాం కన్నుమూత.. అంత్యక్రియలపై ఆయన చివరి కోరిక ఇదే..

ఎనిమిదో నిజాం నవాబు మీర్‌ అలీఖాన్‌ ముఖరంజా బహదూర్‌ కన్నుమూశారు. టర్కీ రాజధాని ఇస్తాంబుల్‌లో శనివారం రాత్రి 10.30 గంటలకు ముఖరంజా బహదూర్‌ తుదిశ్వాస విడిచినట్లు కుటుంబసభ్యులు వెల్లడించారు.

Hyderabad: హైదరాబాద్ ఎనిమిదో నిజాం కన్నుమూత.. అంత్యక్రియలపై ఆయన చివరి కోరిక ఇదే..
8th Nizam Of Hyderabad Mukarram Jah Bahadur
Follow us

|

Updated on: Jan 15, 2023 | 4:06 PM

ఎనిమిదో నిజాం నవాబు మీర్‌ అలీఖాన్‌ ముఖరంజా బహదూర్‌ కన్నుమూశారు. టర్కీ రాజధాని ఇస్తాంబుల్‌లో శనివారం రాత్రి 10.30 గంటలకు ముఖరంజా బహదూర్‌ తుదిశ్వాస విడిచినట్లు కుటుంబసభ్యులు వెల్లడించారు. ఆయన మృతదేహాన్ని కుటుంబ సభ్యులు ఈనెల 17న హైదరాబాద్‌‌కు తీసుకురానున్నారు. అంత్యక్రియలను స్వస్థలమైన హైదరాబాద్‌లోనే చేయాలన్న ముఖరంజా బహదూర్‌ కోరిక మేరకు కుటుంబ సభ్యులు ఇక్కడే నిర్వహించేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ముఖరంజా బహదూర్‌ కుటుంబసభ్యులు ప్రకటన విడుదల చేశారు.

ఈ మేరకు టర్కీ నుంచి భారతదేశానికి మృతదేహాన్ని తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. హైదరాబాద్‌కు 17న పార్ధీవదేహాన్ని తీసుకువచ్చిన అనంతరం చౌమహల్లా ప్యాలెస్‌లో సందర్శల కోసం ఉంచనున్నారు. అనంతరం పార్థివదేహానికి సంప్రదాయ కార్యక్రమాలు పూర్తి చేసి అసఫ్ జాహీ కుటుంబ సమాధుల వద్ద అత్యక్రియలు నిర్వహించనున్నట్టు కుటుంబ సభ్యులు వెల్లడించారు.

కాగా, హైదరాబాద్ స్టేట్ ఏడవ (చివరి) నిజాం, మీర్ ఉస్మాన్ అలీఖాన్ జూన్ 14, 1954న.. ప్రిన్స్ ముఖరంజా బహదూర్‌ వారసుడిగా ప్రకటించారు. 1971 వరకు ఆయన హైదరాబాద్ యువరాజుగా అధికారికంగా కొనసాగారు. 1954 నుంచి ముఖరంజా హైదరాబాద్ ఎనిమిదవగా నిజాంగా గుర్తింపుపొందారు. అయితే, 1971లో రాష్ట్రాలకు సంబంధించిన నామమాత్రపు హోదాలను భారత ప్రభుత్వం రద్దు చేసింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం.. 

Latest Articles