Anil kumar poka |
Updated on: Jan 15, 2023 | 4:39 PM
సంక్రాంతి పండుగను సాంప్రదాయం ఉట్టిపడేలా జరుపుకున్నారు ఎమ్మెల్సీ కవిత. హైదరాబాద్ లోని ఎమ్మెల్సీ కవిత గారి నివాసం వాకిట్లో గొబ్బెమ్మలు, హరివిల్లును తలపించే రంగురంగుల ముగ్గులతో ప్రత్యేక శోభను సంతరించుకుంది.
ఎమ్మెల్సీ కవిత స్వయంగా ముగ్గులు వేసి, సంక్రాంతి వేడుకల్లో పాలుపంచుకున్నారు. రాష్ట్ర ప్రజలు, రైతాంగం పాడిపంటలు,సిరి సంపదలు, సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్న ఎమ్మెల్సీ కవిత గారు ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు.
సంక్రాంతి శోభ ఉట్టిపడేలా ఎమ్మెల్సీ కవిత స్వయంగా ముగ్గులు వేసి , పొంగల్ పెట్టిన ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి..