PM Modi US Visit: బ్లూప్రింట్‌గా డిజిటల్ ఇండియా.. ప్రధాని మోడీతో భేటీ తర్వాత గూగుల్, అమెజాన్ సీఈఓలు ఏమన్నారంటే..
PM Narendra Modi US Visit: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అమెరికా పర్యటన బిజిబిజీగా కొనసాగుతోంది. ఈ సందర్భంగా ప్రధాని మోడీ.. ద్వైపాక్షిక సంబంధాలతోపాటు.. పలు కీలక రంగాల్లో పరస్పర సహకారంపై అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ తో చర్చించారు.
PM Narendra Modi US Visit: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అమెరికా పర్యటన బిజిబిజీగా కొనసాగుతోంది. ఈ సందర్భంగా ప్రధాని మోడీ.. ద్వైపాక్షిక సంబంధాలతోపాటు.. పలు కీలక రంగాల్లో పరస్పర సహకారంపై అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ తో చర్చించారు. దీంతోపాటు భారతదేశంలో పెట్టుబడులపై టెక్, వ్యాపార దిగ్గజాలు, పలువురు ప్రముఖులతో వరుసగా భేటీ అవుతున్నారు. వాషింగ్టన్ డీసీలో పర్యటిస్తున్న ప్రధాని మోడీ తాజాగా.. గూగుల్ – ఆల్ఫాబెట్ సీఈఓ సుందర్ పిచాయ్, అమెజాన్ సీఈఓ ఆండ్రూ జాస్సీతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా భారతదేశంలో పెట్టుబడులు, అదేవిధంగా డిజిటల్ ఇండియా తదిర అంశాలపై సుధీర్ఘంగా చర్చించారు. అంతేకాకుండా.. ప్రవాస భారతీయులు, మల్టీబిలియనీర్లు, పలువురు ప్రముఖులతో కూడా మోడీ భేటీ అయ్యారు.
సుందర్ పిచాయ్ ఏమన్నారంటే..
అయితే, ప్రధాని నరేంద్ర మోడీని కలిసిన తర్వాత, గూగుల్ సిఇఒ సుందర్ పిచాయ్ మాట్లాడుతూ.. భారతదేశంలో డిజిటలైజేషన్ ఫండ్‌లో భాగంగా గూగుల్ 10 బిలియన్ డాలర్లు పెట్టుబడి పెడుతుందని తెలిపారు. డిజిటల్ ఇండియా ఇతర దేశాలకు బ్లూప్రింట్‌గా పనిచేస్తుందన్నారు. ప్రధాని మోదీని కలిసిన అనంతరం పిచాయ్ మాట్లాడుతూ “చరిత్రాత్మక యుఎస్ పర్యటనలో ప్రధాని మోదీని కలవడం గౌరవంగా భావిస్తున్నాము. భారతదేశ డిజిటలైజేషన్ ఫండ్‌లో గూగుల్ 10 బిలియన్ డాలర్లు పెట్టుబడి పెడుతుందని మేము ప్రధానితో పంచుకున్నాము.. GIFT సిటీ గుజరాత్‌లో మా గ్లోబల్ ఫిన్‌టెక్ ఆపరేషన్ సెంటర్‌ను ప్రారంభిస్తున్నట్లు ప్రకటిస్తున్నందుకు సంతోషిస్తున్నాను” అని పిచాయ్ పేర్కొన్నారు.
#WATCH | Prime Minister Narendra Modi meets Google and Alphabet CEO Sundar Pichai in Washington, DC. pic.twitter.com/PCLnqiYEQ4
— ANI (@ANI) June 23, 2023
ఆండ్రూ జాస్సీ మాట్లాడుతూ..
అమెజాన్ సీఈఓ ఆండ్రూ జాస్సీ మాట్లాడుతూ.. మరిన్ని ఉద్యోగాలను సృష్టించడంలో సహాయం చేయడం, మరిన్ని చిన్న, మధ్య తరహా వ్యాపారాలను డిజిటలైజ్ చేయడంలో సహాయం చేయడం, మరిన్ని భారతీయ కంపెనీలు, ఉత్పత్తులను ప్రపంచవ్యాప్తంగా ఎగుమతి చేయడంలో సహాయం చేయడంలో చాలా ఆసక్తి ఉంది.. అని పేర్కొన్నారు. తాము ఇప్పటికే 11 బిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టాము, మరో 15 బిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టాలనే ఉద్దేశ్యంతో మొత్తం 26 బిలియన్ డాలర్లకు చేరుకుంది.. అని జాస్సీ పేర్కొన్నారు. భవిష్యత్తు కోసం భారత్ తో కలిసి పనిచేయడం బాగుందంటూ పేర్కొన్నారు. ఈ పర్యటనలో ప్రధాని మోడీ.. పలువురు ప్రముఖులతో సైతం భేటీ అయ్యారు. అమెరికా – భారత్ పరస్పర సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని తెలిపారు.
#WATCH | Prime Minister Narendra Modi meets Amazon CEO Andrew Jassy in Washington, DC. pic.twitter.com/HgIg1WZ3yu
— ANI (@ANI) June 23, 2023
మోడీకి స్పెషల్ గిఫ్ట్ ఇచ్చిన బైడెన్..
అమెరికా అధ్యక్షుడు జో బిడెన్.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి AIపై ప్రధాని కోట్‌తో కూడిన ప్రత్యేక టీ-షర్ట్‌ను బహుమతిగా ఇచ్చారు. “గత కొన్ని సంవత్సరాలలో AI- కృత్రిమ మేధస్సులో అనేక పురోగతులు ఉన్నాయి. అదే సమయంలో, మరొక AI- అమెరికా – భారతదేశంలో మరింత ముఖ్యమైన అభివృద్ధి ఉంది” అని US సంయుక్త సమావేశంలో ప్రధాని మోదీ అన్నారు.
#WATCH | US President Joe Biden gifted a special T-Shirt to PM Narendra Modi with the PM’s quote on AI.
“In the past few years, there have been many advances in AI- Artificial Intelligence. At the same time, there has been even more momentous development in another AI-… pic.twitter.com/rx97EHZnMj
— ANI (@ANI) June 23, 2023
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం..