Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Guinness World Record: ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన వాటర్‌ బాటిల్‌.. దీంతో బంగారం తాగినట్టే..!

దీని ధర సుమారు రూ. 50 లక్షల 750 ఎంఎల్. ఏంటీ నమ్మలేకపోతున్నారా..? కానీ, ఇది నిజమేనండోయ్.. ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన వాటర్ బాటిల్‌గా గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సాధించింది. అయితే, నీరు ప్రతిచోటా ఉంది. ఇది ప్రపంచంలో అత్యంత విస్తృతంగా అందుబాటులో ఉండే జీవాధారం. కానీ, ఈ బాటిల్ ధర..

Guinness World Record: ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన వాటర్‌ బాటిల్‌.. దీంతో బంగారం తాగినట్టే..!
Most Expensive Water Bottle
Follow us
Jyothi Gadda

|

Updated on: Jun 23, 2023 | 9:25 PM

Acqua Di Cristallo Tributo A Modigliani (అక్వా డి క్రిస్టల్లో ట్రిబ్యూటో ఎ మొడిగ్లియాని)ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన వాటర్ బాటిల్‌గా పేరొందింది. దీని ధర సుమారు రూ. 50 లక్షల 750 ఎంఎల్. ఏంటీ నమ్మలేకపోతున్నారా..? కానీ, ఇది నిజమేనండోయ్.. ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన వాటర్ బాటిల్‌గా గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సాధించింది. అయితే, నీరు ప్రతిచోటా ఉంది. ఇది ప్రపంచంలో అత్యంత విస్తృతంగా అందుబాటులో ఉండే జీవాధారం. ఇదిలావుంటే వాటర్ బాటిల్ ధర ఎందుకు అంత ఖరీదు..? Acqua Di Cristallo Tributo A Modigliani ప్రత్యేకత ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం..

అయితే, ఇక్కడ నీరు అంత ఖరీదు కాదు. వాటర్ బాటిల్ ప్యాకేజింగ్ ఏదైనా ప్రత్యేకించి ఉండాలి. అది చాలా ఖరీదైనది. ఇతరులకు భిన్నంగా ఉంటుంది. ఎందుకంటే..ఇది 24 క్యారెట్ బంగారం. ఈ 750 ml గాజు సీసా పూర్తిగా బంగారంతో తయారు చేసింది. బంగారు వాటర్ బాటిల్‌కు మ్యాజిక్ టచ్ అందించారు. ఇక సొగసైన బాటిల్ డిజైన్‌లకు పేరుగాంచిన ప్రముఖ డిజైనర్ ఫెర్నాండో అల్టామిరానో డిజైన్‌ను కూడా ఈ బాటిల్‌ ప్రత్యేకం. అందుకే ఆక్వా డి క్రిస్టల్లో ట్రిబ్యూటో మోడిగ్లియాని వాటర్ బాటిల్ నిజంగా ఖరీదైనది. ఈ బాటిల్‌ ఐశ్వర్యానికి ప్రసిద్ధి చెందినది అయినప్పటికీ, దాని ధర ఎక్కువగా దాని డిజైన్‌లో బంగారాన్ని ఉపయోగించడమే ఇందుకు కారణం.

ఫెర్నాండో అల్టమిరానో ఒక మెక్సికన్ ప్రకృతి శాస్త్రవేత్త, వృక్షశాస్త్రజ్ఞుడు, డిజైనర్ కూడా. దివంగత ఇటాలియన్ కళాకారుడు అమెడియో క్లెమెంటే మొడిగ్లియానీకి నివాళిగా అతను ఖరీదైన బాటిల్‌ను తయారు చేశాడు. అందుకే ఆ వాటర్ బాటిల్‌కి ‘ఆక్వా డి క్రిస్టల్లో ట్రిబ్యూటో ఎ మొడిగ్లియాని’ అని పేరు పెట్టారు. ఇక ఈ వాటర్ బాటిల్ గురించి మరింత ఆసక్తికరమైన విషయం ఉంది. వాటర్ బాటిల్‌లోని ప్రతి నీటి చుక్కలో 5 గ్రాముల 23 క్యారెట్ల బంగారం ఉంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే.. మీరు అక్షరాలా ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన వాటర్ బాటిల్ నుండి బంగారాన్ని తాగుతున్నారు. బంగారు ఉనికి కారణంగా నీరు సాధారణ నీటి కంటే ఎక్కువ ఆల్కలీన్‌గా ఉంటుంది.

ఇవి కూడా చదవండి

మార్చి 4, 2010న మెక్సికో సిటీలోని లా హసీండా డి లాస్ మోరేల్స్‌లో ప్లానెట్ ఫౌండేషన్ AC నిర్వహించిన వేలంలో, ఆక్వా డి క్రిస్టల్లో ట్రిబ్యూటో ఎ మొడిగ్లియాని 774,000 పెసోలు లేదా $60,000 US (£39,357)కి విక్రయించబడింది. ఈ లావాదేవీ ద్వారా వచ్చిన మొత్తం గ్లోబల్ వార్మింగ్‌తో పోరాడుతున్న సంస్థకు అందించబడింది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..