Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

లాఫింగ్ బుద్ధ ఎవరో తెలుసా..? మీ ఇంట్లో ఇక్కడ పెడితే డబ్బే డబ్బు

ప్రజలను నవ్వించడమే తన జీవిత లక్ష్యంగా పెట్టుకున్నాడు. అనేక దేశాలు పర్యటించి ఎక్కడికి వెళ్లినా అక్కడి ప్రజలకు నవ్వులు పంచారు. అప్పటి నుండి అతను లాఫింగ్ బుద్ధగా పిలువబడ్డాడు. లాఫింగ్ బుద్ధుడిని ఆనందానికి చిహ్నంగా భావిస్తారు. లాఫింగ్ బుద్ధను ఇంటికి తీసుకురావడం వల్ల ఇంటికి ఆనందం, శ్రేయస్సు లభిస్తుందని నమ్ముతారు.

లాఫింగ్ బుద్ధ ఎవరో తెలుసా..? మీ ఇంట్లో ఇక్కడ పెడితే డబ్బే డబ్బు
Laughing Buddha
Follow us
Jyothi Gadda

|

Updated on: Jun 23, 2023 | 7:04 PM

వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో ఉంచిన ప్రతి వస్తువు మనపై సానుకూల లేదా ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. అందువల్ల, శుభప్రదంగా భావించే విషయాలు కూడా తప్పుగా నిర్దేశించబడితే, అవి చెడు ప్రభావాన్ని చూపుతాయి. అలాగే చాలా మంది ఇళ్లల్లో లాఫింగ్ బుద్ధ విగ్రహాన్ని ఉంచుకోవడం మీరు చూసే ఉంటారు. వాస్తు శాస్త్రంలో ఈ విగ్రహాన్ని ఇంట్లో ఉంచడం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. కానీ దానిని ఉంచడానికి సరైన దిశను తెలుసుకోవడం ముఖ్యం. లేకపోతే మీరు భయంకరమైన పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. కాబట్టి మీరు లాఫింగ్ బుద్ధ విగ్రహాన్ని ఇంటికి తెచ్చినప్పుడు.. దానిని ఏ దిశగా పెట్టాలో తెలుసుకోవటం ముఖ్యం..

లాఫింగ్ బుద్ధ విగ్రహాన్ని ఇంట్లో ఉంచుకోవాలి. అయితే అతనెవరో తెలుసా? ఒక నమ్మకం ప్రకారం, జపాన్ నుండి వచ్చిన హోథాయ్ బౌద్ధమతంలోకి మారారు. చాలాకాలం తపస్సు చేసి జ్ఞానోదయం పొందాడు. జ్ఞానం పొందిన తరువాత, హుథై బిగ్గరగా నవ్వడం ప్రారంభించాడు. ప్రజలను నవ్వించడమే తన జీవిత లక్ష్యంగా పెట్టుకున్నాడు. హోతాయ్ అనేక దేశాలు పర్యటించి ఎక్కడికి వెళ్లినా అక్కడి ప్రజలకు నవ్వులు పంచారు. అప్పటి నుండి అతను లాఫింగ్ బుద్ధగా పిలువబడ్డాడు. అంటే..నవ్వుతున్న బుద్ధుడు అని అర్థం. లాఫింగ్ బుద్ధుడిని ఆనందానికి చిహ్నంగా భావిస్తారు. లాఫింగ్ బుద్ధను ఇంటికి తీసుకురావడం వల్ల ఇంటికి ఆనందం, శ్రేయస్సు లభిస్తుందని నమ్ముతారు. దీనివల్ల మానసిక ప్రశాంతత కూడా లభిస్తుందన్నారు.

లాఫింగ్ బుద్ధను ఇంట్లోకి తీసుకురావడం ద్వారా ఇంట్లో ప్రతికూల ప్రభావం పారిపోతుంది. దీని వల్ల కుటుంబ సభ్యులందరూ సంతోషంగా జీవిస్తారు. ఇంట్లో ఆనందం, శాంతి, ప్రశాంతత నెలకొంటాయి. అందుకే లాఫింగ్ బుద్ధను ఉంచడానికి సరైన దిశను వాస్తులో పేర్కొనబడింది. లాఫింగ్ బుద్ధుని విగ్రహాన్ని ఇంటి ప్రధాన ద్వారం ముందు ఉంచాలని సూచించారు. అంటే ఇంట్లో ఎప్పుడూ ఆనందం ఉంటుంది. లాఫింగ్ బుద్ధను తూర్పు దిశలో ఉంచడం కూడా శుభప్రదంగా పరిగణించబడుతుంది. పిల్లలు చదువుకునే గదిలో లాఫింగ్ బుద్ధ విగ్రహాన్ని పెడితే వారి మనసు చదువుపై కేంద్రీకృతం అవుతుందని చెబుతారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం).