AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral News : మెట్రోను ఇలా కూడా వాడొచ్చంటున్న కపుల్స్‌.. పెళ్లిరోజు కోసం స్పెషల్‌ సెటప్‌.. నెటిజన్లు షాక్‌

సోషల్ మీడియా ప్రపంచంలో ఢిల్లీ మెట్రో తీవ్ర చర్చకు దారితీసింది. ఢిల్లీ మెట్రోలో ప్రయాణించే ప్రయాణీకుల్లో చాలా మంది తమ వీడియోలు ఇంటర్నెట్‌లో వైరల్‌ అవ్వాలనే లక్ష్యంతోనే విన్యాసాలు చేస్తున్నారు. ఇటీవల ఓ జంట మెట్రోలో రొమాన్స్ చేస్తున్న వీడియో కూడా వైరల్‌గా మారింది. ఇప్పుడు తాజాగా

Viral News : మెట్రోను ఇలా కూడా వాడొచ్చంటున్న కపుల్స్‌.. పెళ్లిరోజు కోసం స్పెషల్‌ సెటప్‌.. నెటిజన్లు షాక్‌
Kanpur Metro
Jyothi Gadda
|

Updated on: Jun 23, 2023 | 6:10 PM

Share

మెట్రోను ఎన్ని రకాలుగా వాడుకోవచ్చునో అన్ని విధాలుగా వాడేస్తున్నారు జనాలు. అలాంటివి ఢిల్లీ మెట్రోకి సంబంధించిన ఎన్నో రకాల రిల్స్‌ వైరల్‌ కావటం చూశాం. అందులో కొందరు డ్యాన్స్‌ చేస్తుండగా, మరికొందరు పాటలు పాడుతూ.. వింత చేష్టలకు సంబంధించిన రిల్స్‌ అనేకం చూశాం. సోషల్ మీడియా ప్రపంచంలో ఢిల్లీ మెట్రో తీవ్ర చర్చకు దారితీసింది. ఢిల్లీ మెట్రోలో ప్రయాణించే ప్రయాణీకుల్లో చాలా మంది తమ వీడియోలు ఇంటర్నెట్‌లో వైరల్‌ అవ్వాలనే లక్ష్యంతోనే విన్యాసాలు చేస్తున్నారు. ఇటీవల ఓ జంట మెట్రోలో రొమాన్స్ చేస్తున్న వీడియో కూడా వైరల్‌గా మారింది. ఇప్పుడు తాజాగా ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో మరో విచిత్ర ఘటన వెలుగు చూసింది. ఒక జంట తమ వివాహ వార్షికోత్సవాన్ని మెట్రో కోచ్‌లో జరుపుకున్నారు. యూపీ మెట్రో రైల్ కార్పొరేషన్ స్వయంగా వారి వేడుకకు సంబంధించిన ఫోటోలను ఇంటర్‌ నెట్‌లో షేర్‌ చేశారు.

ఈ ఫోటోలు ఉత్తర ప్రదేశ్ మెట్రో రైల్ కార్పొరేషన్’ (@OfficialUPMetro) ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా జూన్ 21న పోస్ట్ చేశారు. క్యాప్షన్‌లో ‘కాన్పూర్ మెట్రో’ పూనమ్ వర్మ ప్రయాస్ కుమార్ సింగ్ వివాహ వార్షికోత్సవాన్ని చిరస్మరణీయం చేసింది. ప్రత్యేకంగా అలంకరించిన మెట్రో కోచ్‌లో వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకున్నారు. వారి సంతోషంలో మెట్రో కుటుంబంతో పాటు ఇతర ప్రయాణికులు కూడా పాల్గొన్నారు.

సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్న ఈ వార్తకు వేల సంఖ్యలో వ్యూస్‌ లైకులు వచ్చాయి. అలాగే, ప్రజలు తమ భిన్నమైన అభిప్రాయాన్ని తెలిపారు. ఒక వ్యక్తి DMRCని ట్యాగ్ చేసి, ఢిల్లీ మెట్రోలో కూడా ఇది సాధ్యమేనా అని అడిగారు. మరొకరు ఇక్కడ పార్టీకి ఎంత ఖర్చవుతుందని అడుగుతున్నారు..

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

విష్ణు విగ్రహ కూల్చివేతతో ఉద్రిక్తత.. థాయిలాండ్–కంబోడియా యుద్ధం
విష్ణు విగ్రహ కూల్చివేతతో ఉద్రిక్తత.. థాయిలాండ్–కంబోడియా యుద్ధం
తిరుపతి నుంచి వస్తుండగా ప్రమాదం..నలుగురు హైదరాబాదీలు మృతి
తిరుపతి నుంచి వస్తుండగా ప్రమాదం..నలుగురు హైదరాబాదీలు మృతి
2025లో తెలంగాణలో పెరిగిన అవినీతి.. ఏ శాఖలో ఎక్కువ జరిగిందంటే..
2025లో తెలంగాణలో పెరిగిన అవినీతి.. ఏ శాఖలో ఎక్కువ జరిగిందంటే..
నెలకు రూ.60 వేల ఆదాయం.. తక్కువ పెట్టుబడి!
నెలకు రూ.60 వేల ఆదాయం.. తక్కువ పెట్టుబడి!
గతంలో ఎన్నో తప్పులు చేశాను.. ఇప్పుడు అలాంటి పాత్రలే చేయాలనుంది..
గతంలో ఎన్నో తప్పులు చేశాను.. ఇప్పుడు అలాంటి పాత్రలే చేయాలనుంది..
రైల్వే ప్రయాణీకులకు అటెన్షన్.! భారీగా పెరిగిన ఛార్జీలు అమలులోకి..
రైల్వే ప్రయాణీకులకు అటెన్షన్.! భారీగా పెరిగిన ఛార్జీలు అమలులోకి..
36 బంతుల్లో సెంచరీ..వైభవ్ సూర్యవంశీ ఊచకోతకు ప్రధాని మోదీ ఫిదా!
36 బంతుల్లో సెంచరీ..వైభవ్ సూర్యవంశీ ఊచకోతకు ప్రధాని మోదీ ఫిదా!
ఏపీకి కేంద్రం శుభవార్త.. కూటమి ప్రభుత్వానికి పండగే
ఏపీకి కేంద్రం శుభవార్త.. కూటమి ప్రభుత్వానికి పండగే
అద్దె భవనాల ఖాళీపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు!
అద్దె భవనాల ఖాళీపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు!
చేదు కాకరకాయలో చెప్పలేనన్నీ పోషకాలు,ఇలా వాడితే ఆ రోగాలన్నీ పరార్!
చేదు కాకరకాయలో చెప్పలేనన్నీ పోషకాలు,ఇలా వాడితే ఆ రోగాలన్నీ పరార్!