AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

విద్యుత్ వినియోగదారులకు ఊరట..! భారీగా తగ్గనున్న కరెంట్‌ బిల్లులు..

ఈ రెండు ముఖ్యమైన మార్పులు విద్యుత్ రంగంలో విప్లవాన్ని సృష్టిస్తాయని ప్రభుత్వం చెబుతోంది. TOD టారిఫ్ విద్యుత్ బిల్లులను తగ్గించడానికి వినియోగదారులకు అవగాహన కల్పిస్తుంది. వనరులను మరింత సమర్ధవంతంగా వినియోగించుకునేందుకు విద్యుత్ వ్యవస్థకు ఇది దోహదపడుతుందని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది.

విద్యుత్ వినియోగదారులకు ఊరట..! భారీగా తగ్గనున్న కరెంట్‌ బిల్లులు..
New Electricity
Jyothi Gadda
|

Updated on: Jun 23, 2023 | 9:32 PM

Share

భారతదేశంలో ప్రస్తుతం ఉన్న విద్యుత్ టారిఫ్ విధానంలో కొత్త మార్పులను కేంద్రం జూన్‌ 23 శుక్రవారం ప్రకటించింది. కొత్త వ్యవస్థ ‘టైమ్ ఆఫ్ డే’ టారిఫ్ మెకానిజంపై ఆధారపడి ఉంటుంది. అంటే విద్యుత్‌ వినియోగదారులు రోజంతా ఒకే రేటుకు బదులుగా వేర్వేరు సమయాల్లో విద్యుత్ ధర మారుతూ ఉంటుంది. విద్యుత్ (వినియోగదారుల హక్కులు) రూల్స్, 2020కి సవరణ ద్వారా కొత్త మార్పును చేసింది కేంద్రం. మారిన నిబంధనలు సాధారణ వినియోగదారులకు (వ్యవసాయ వినియోగానికి మినహా) 2025 నుండి అమల్లోకి వస్తాయి. ఇక, ప్రతిపాదిత టైమ్ ఆఫ్ డే-బేస్డ్ సిస్టమ్ కింద రోజులో ఎనిమిది గంటలు సాధారణ టారిఫ్ కంటే 10-20 శాతం తక్కువ ఛార్జీ విధించబడుతుంది. “పీక్ అవర్స్” సమయంలో టారిఫ్ 10-20 శాతం ఎక్కువగా ఉంటుందని నివేదిక పేర్కొంది.

వచ్చే ఏడాది ఏప్రిల్ 1 నుండి గరిష్టంగా 10 KW, అంతకంటే ఎక్కువ డిమాండ్ ఉన్న వాణిజ్య, పారిశ్రామిక వినియోగదారులకు ఈ విద్యుత్ వినియోగాన్ని ఛార్జ్ చేసే విధానం వర్తిస్తుంది. వ్యవసాయ వినియోగదారులకు మినహా మిగిలిన వినియోగదారులందరికీ ఈ టారిఫ్ విధానం ఏప్రిల్ 1, 2025 నుండి ప్రారంభమవుతుంది.

స్మార్ట్ మీటర్లను అమర్చిన వెంటనే, స్మార్ట్ మీటర్లను కలిగి ఉన్న వినియోగదారుల కోసం డే టైం ఆఫ్ డే టారిఫ్ అమలులోకి వస్తుందని కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ శుక్రవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొంది. ఇది వినియోగదారులకు,విద్యుత్ పరిశ్రమకు అనుకూలంగా ఉంటుందని కేంద్ర మంత్రి ఆర్‌కె సింగ్ అన్నారు. పీక్ అవర్స్, సోలార్ అవర్స్, సాధారణ గంటల కోసం ప్రత్యేక టారిఫ్‌లతో కూడిన TOD టారిఫ్‌లు, టారిఫ్ ప్రకారం తమ లోడ్‌ను నిర్వహించడానికి వినియోగదారులకు ధర సంకేతాలను పంపుతాయి. ToD టారిఫ్ మెకానిజం అవగాహన, సమర్థవంతమైన వినియోగంతో వినియోగదారులు తమ విద్యుత్ బిల్లులను తగ్గించుకోవచ్చునని మంత్రి అన్నారు.

ఇవి కూడా చదవండి

ఈ రెండు ముఖ్యమైన మార్పులు విద్యుత్ రంగంలో విప్లవాన్ని సృష్టిస్తాయని ప్రభుత్వం చెబుతోంది. TOD టారిఫ్ విద్యుత్ బిల్లులను తగ్గించడానికి వినియోగదారులకు అవగాహన కల్పిస్తుంది. వనరులను మరింత సమర్ధవంతంగా వినియోగించుకునేందుకు విద్యుత్ వ్యవస్థకు ఇది దోహదపడుతుందని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..