Viral: ఏటీఎంకు వెళ్లి బ్యాలెన్స్ చెక్ చేయగా.. స్క్రీన్‌పై కనిపించిన నెంబర్ చూసి మైండ్ బ్లాంక్.!
ఓ యువకుడికి కొద్దిరోజుల క్రితం ఒక మెసేజ్ వచ్చింది. అది చూడగానే షాక్ అయ్యాడు. అయితే ఆ విషయాన్ని ఎవ్వరికీ చెప్పకుండా నేరుగా..
ఓ యువకుడికి కొద్దిరోజుల క్రితం ఒక మెసేజ్ వచ్చింది. అది చూడగానే షాక్ అయ్యాడు. అయితే ఆ విషయాన్ని ఎవ్వరికీ చెప్పకుండా నేరుగా ఏటీఎంకు వెళ్లి తన బ్యాంక్ అకౌంట్ బ్యాలెన్స్ చెక్ చేశాడు.. ఇక స్క్రీన్‌పై నెంబర్ చూడగానే బిత్తరపోయాడు. కట్ చేస్తే.. అసలేం జరిగిందంటే..?
వివరాల్లోకి వెళ్తే.. రాజస్థాన్‌లోని హనుమాన్‌గడ్‌కు చెందిన దినేష్ అనే యువకుడికి ఊహించని విధంగా ధనలక్ష్మీ తలుపు తట్టింది. తన మొబైల్‌కు వచ్చిన ఓ మెసేజ్ చూసి.. ఏటీఎంకి వెళ్లి బ్యాలెన్స్ చెక్ చేయగా.. తన ఖాతాలో రూ. 18 లక్షలు పడ్డట్టు కనుగొన్నాడు. దీంతో ఉబ్బితబ్బిబైన ఆ యువకుడు.. సొమ్ము మొత్తాన్ని ఖర్చు పెట్టడం మొదలుపెట్టాడు. కొంత డబ్బును తన తండ్రి చికిత్సకు, మరికొంత డబ్బు తన అవసరాలకు ఖర్చు చేశాడు. కట్ చేస్తే..! బ్యాంక్ అధికారులు అకౌంట్ నెంబర్ తప్పు వల్ల.. ఈ తతంగం అంతా జరిగిందని చల్లగా చెప్పారు. అప్పటికే దినేష్ తన దగ్గర ఉన్న డబ్బు మొత్తాన్ని ఖర్చు చేసేశాడు. అయితేనేం బ్యాంక్ అధికారుల నుంచి కాల్ రాగానే.. డబ్బులు తిరిగి ఇస్తానని దినేష్ స్పష్టం చేశాడు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన బాధ్యులపై తగిన చర్యలు తీసుకుంటామని బ్యాంక్ సిబ్బంది వెల్లడించారు.