Jyothi Gadda |
Updated on: Jun 23, 2023 | 9:02 PM
టైటానిక్.. ఒకప్పుడు ప్రపంచంలోనే అతి పెద్ద నౌక టైటానిక్. నేడు టైటానిక్ స్థానంలో మరో ఓడ వచ్చింది.
సింఫనీ ఆఫ్ ది సీస్ ఫుట్‌బాల్ మైదానం కంటే పెద్దదని చెబుతారు. అయితే, ఆ సమయంలో టైటానిక్ మూడు ఫుట్‌బాల్ మైదానాల పొడవు ఉండేది.
సింఫనీ ఆఫ్ సీస్ 215.5 అడుగుల వెడల్పు, 1188 అడుగుల పొడవు కలిగి ఉంది.
ఇది సముద్రం మీద తేలియాడే ఒక పెద్ద నగరంలా కనిపిస్తుంది. ఎందుకంటే 18 అంతస్తుల ఓడలో మొత్తం 6,780 మంది ప్రయాణికులు ఉంటారు.
ఇంతకు ముందు హార్మొనీ ఆఫ్ ది సీస్ ప్రపంచంలోనే అతిపెద్ద ఓషన్ లైనర్. ఒక నివేదిక ప్రకారం, సింఫనీ ఆఫ్ ది సీస్ తయారు చేయడానికి దాదాపు మూడు సంవత్సరాలు పట్టిందని తెలిసింది..