AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Modi US Visit: భవిష్యత్ అంతా AIదే.. ప్రధాని మోడీకి స్పెషల్ గిఫ్ట్ ఇచ్చిన జోబైడెన్.. ఏఐ అంటే ఏంటో తెలుసా..?

America and India: అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ప్రత్యేక టీ షర్ట్‌ను బహుమతిగా ఇచ్చారు. ఈ టీ-షర్టుపై- 'భవిష్యత్తు AI’.. అమెరికా-ఇండియా' అని రాసి ఉంది. నిన్న (శుక్రవారం) అమెరికా పార్లమెంట్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రధాని మోదీ మాట్లాడుతూ..

PM Modi US Visit: భవిష్యత్ అంతా AIదే.. ప్రధాని మోడీకి స్పెషల్ గిఫ్ట్ ఇచ్చిన జోబైడెన్.. ఏఐ అంటే ఏంటో తెలుసా..?
Pm Modi
Shaik Madar Saheb
|

Updated on: Jun 24, 2023 | 8:43 AM

Share

America and India: అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ప్రత్యేక టీ షర్ట్‌ను బహుమతిగా ఇచ్చారు. ఈ టీ-షర్టుపై- ‘భవిష్యత్తు AI’.. అమెరికా-ఇండియా’ అని రాసి ఉంది. నిన్న (శుక్రవారం) అమెరికా పార్లమెంట్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రధాని మోదీ మాట్లాడుతూ.. భారత్, అమెరికాల మధ్య సంబంధాలు ఏఐ లాంటిదని వ్యాఖ్యానించారు. ప్రధాని మోడీ చేసిన ఈ ప్రకటనకు బిడెన్ చాలా సంతోషం వ్యక్తం చేశారు. అందుకే ప్రధాని మోదీకి ప్రత్యేక టీ షర్ట్‌ను బహుమతిగా ఇచ్చారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో గత కొన్నేళ్లుగా చాలా పురోగతి సాధించామని ప్రధాని మోదీ సంయుక్త సమావేశంలో ప్రసంగిస్తూ వివరించారు. అదేవిధంగా, అమెరికా, భారతదేశంలో కూడా అనేక ముఖ్యమైన పరిణామాలు చోటు చేసుకున్నాయంటూ పేర్కొన్నారు.

అమెరికా.. భారతదేశ సంబంధాలు పురాతనమైనవి.. ప్రధాని మోదీ

అమెరికా కాంగ్రెస్ సంయుక్త సమావేశంలో ప్రధాని మోదీ ప్రసంగిస్తూ.. అమెరికా.. భారతదేశ సంబంధాలు పురాతనమైనవని.. భారతదేశం అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమని వ్యాఖ్యానించారు. ఇరు దేశాల భాగస్వామ్యం ప్రజాస్వామ్య భవిష్యత్తుకు శుభ సంకేతం అని ప్రధాని అన్నారు. దీంతో పాటు ఉగ్రవాదం, రష్యా ఉక్రెయిన్ యుద్ధం తదితర అంశాలపై కూడా ప్రధాని మోదీ మాట్లాడారు. ఉగ్రవాదం ప్రపంచానికి పెనుముప్పు అని.. దీనికి వ్యతిరేకంగా అన్ని దేశాలు ఏకం కావాలంటూ ప్రపంచానికి పిలుపునిచ్చారు. “గత కొన్ని సంవత్సరాలలో AI- కృత్రిమ మేధస్సులో అనేక పురోగతులు ఉన్నాయి. అదే సమయంలో, మరొక AI- అమెరికా – భారతదేశంలో మరింత ముఖ్యమైన అభివృద్ధి ఉంది” అని US సంయుక్త సమావేశంలో ప్రధాని మోదీ అన్నారు.

వైట్‌హౌస్‌లో ప్రధాని మోదీకి ఘనంగా రిసెప్షన్..

అంతకుముందు వైట్‌హౌస్‌లో ప్రధాని మోదీకి ఘనస్వాగతం లభించింది. ఈ స్వాగతానికి అమెరికా అధ్యక్షుడు జో బిడెన్‌, ఆయన భార్య జిల్‌లకు ప్రధాని ధన్యవాదాలు తెలిపారు. వైట్‌హౌస్‌లో ఘనంగా రిసెప్షన్‌ జరగడం 140 కోట్ల మంది భారత ప్రజలకు దక్కిన గౌరవమని ఆయన అన్నారు. అమెరికాలో నివసిస్తున్న 40 లక్షల మంది భారతీయులకు కూడా ఈ గౌరవం ఉందని ప్రధాని అన్నారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం..