AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Russia: రష్యాలో పుతిన్‌కు వ్యతిరేకంగా సైనిక తిరుగుబాటు.. ప్రతీకారం తప్పదంటూ వాగ్నర్​ గ్రూప్ వార్నింగ్..

Wagner Group: రష్యా.. ఉక్రెయిన్ దేశాల మధ్య యుద్ధం భారీ నష్టాన్ని మిగిల్చింది.. ఇరు దేశాల్లో వేలాది మంది ప్రాణాలు కోల్పోగా.. లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. అంతర్జాతీయంగా విమర్శలు వ్యక్తమైన ఈ తరుణంలో రష్యా అధ్యక్షుడు పుతిన్ కు మరో వార్నింగ్ వచ్చింది.

Russia: రష్యాలో పుతిన్‌కు వ్యతిరేకంగా సైనిక తిరుగుబాటు.. ప్రతీకారం తప్పదంటూ వాగ్నర్​ గ్రూప్ వార్నింగ్..
Russia
Shaik Madar Saheb
|

Updated on: Jun 24, 2023 | 9:41 AM

Share

Wagner Group: రష్యా.. ఉక్రెయిన్ దేశాల మధ్య యుద్ధం భారీ నష్టాన్ని మిగిల్చింది.. ఇరు దేశాల్లో వేలాది మంది ప్రాణాలు కోల్పోగా.. లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. అంతర్జాతీయంగా విమర్శలు వ్యక్తమైన ఈ తరుణంలో రష్యా అధ్యక్షుడు పుతిన్ కు మరో వార్నింగ్ వచ్చింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్​పుతిన్​కు వ్యతిరేకంగా సైనిక తిరుగుబాటుకు రంగం సిద్ధమవుతున్నట్లు సమాచారం.. ప్రైవేట్​ మిలిటరీ సేవలు అందించే ‘వాగ్నర్​’ బృందం.. పుతిన్ కు వ్యతిరేకంగా తిరుగుబాటు రెడీ అయిందని రష్యన్ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. దీంతో పుతిన్ వర్గంలో ప్రకంపనలు సిద్ధమయ్యాయని.. మున్ముందు జరగబోయే పరిణామాలపై సైన్యం సిద్ధంగా ఉండాలంటూ పిలుపునిచ్చినట్లు తెలుస్తోంది. వాగ్నర్​ఫైటర్స్.. ప్రైవేట్​మిలిటరీ బృందానికి అధిపతి అయిన యెవ్జెనీ ప్రిగోజిన్.. రష్యా రక్షణ శాఖ, ప్రభుత్వ తీరుపై కొన్ని రోజులుగా అసంతృప్తిగా ఉన్నారు. యుద్ధం పేరుతో రక్షణ శాఖ తన దళంలోని చాలా మందిని హతమార్చిందని, దీనికి కచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటానని ప్రిగోజిన్ శపథం చేశారు. తమ దారికి అడ్డొచ్చిన వారిని ఉపేక్షించబోమని.. రష్యా సైనిక నాయకత్వాన్ని కూల్చివేసేందుకు “చివరికి వెళతానని” శనివారం ప్రతిజ్ఞ చేసారు వాగ్నెర్ మెర్సెనరీ గ్రూప్ అధిపతి.. తన మనుషులపై దాడులు చేశాడని.. అందుకు ప్రతీకారం దప్పదంటూ హెచ్చరించారు.

గత సంవత్సరం ఉక్రెయిన్‌లో దాడి ప్రారంభమైనప్పటి నుండి వారు చాలా చేశారని.. అందుకు, “మా మార్గంలో ఉన్న ప్రతిదాన్ని మేము నాశనం చేస్తాము” అని అతను అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు అత్యంత సాహసోపేతమైన సవాలును జోడించారు. ఆ తర్వాత రష్యా సైనిక హెలికాప్టర్‌ను తన బలగాలు కూల్చివేసినట్లు పేర్కొన్నాడు. “ఒక హెలికాప్టర్ ఇప్పుడే పౌరుల కాలమ్ వద్ద కాల్పులు జరిపింది. దానిని PMC వాగ్నర్ యూనిట్లు కూల్చివేసాయి” అని అతను చెప్పారు.. రష్యా దాడికి నాయకత్వం వహించిన తన బలగాలు దక్షిణ రష్యాలోని రోస్టోవ్‌లోకి ప్రవేశించాయన్నారు. అయితే దీనిని ప్రభుత్వ వర్గాలు ధృవీకరించలేదు.

“మేము ముందుకు వెళ్తున్నాము.. ముగింపు వరకు చేరుకుంటాం” అని 62 ఏళ్ల యవ్జెనీ ప్రిగోజిన్ ఒక ఆడియో సందేశంలో తెలపడం రష్యాలో కలకలం రేపింది. అయితే, ఆడియో విడుదల అనంతరం.. రష్యా ప్రాసిక్యూటర్ జనరల్ అతను “సాయుధ తిరుగుబాటు” కోసం విచారణలో ఉన్నాడంటూ పేర్కొన్నారు. దీంతో మాస్కోలో అధికారులు భద్రతా చర్యలను కఠినతరం చేశారు. క్లిష్టమైన సౌకర్యాలు పటిష్ట రక్షణలో ఉంచారని.. దీంతోపాటు.. దేశంలో హైఅలర్ట్ ప్రకటించారని TASS వార్తా సంస్థ నివేదించింది. అంతటా భారీ ఎత్తున బలగాలు మోహరించడంతోపాటు.. తాజా పరిస్థితులపై రష్యా అధ్యక్షుడు పుతిన్​ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారని సంబంధిత వర్గాలు వెల్లడించాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం..