Tibetans DNA: ఆగని డ్రాగన్ కంట్రీ కంత్రి పనులు.. ఆ దేశ పౌరుల నుంచి బలవంతంగా డీఎన్‌ఏ సేకరిస్తుందంటూ ఆందోళన..
టిబెట్ స్వయంప్రతిపత్తి ప్రాంతం. ఈ ప్రాంతంపై తమకు సర్వాధికారాలు ఉన్నాయని చైనా వాదిస్తోంది. అంతేకాదు, 1951లో వేలాది మంది సైనికులను పంపి టిబెట్‌ను ఆక్రమించుకుంది. కొన్నేళ్లుగా టిబెట్ పౌరుల నుంచి చైనా బలవంతంగా డీఎన్‌ఏ నమూనాలను సేకరిస్తున్నట్లు నివేదికలు చెబుతున్నాయి.

డ్రాగన్ కంట్రీ కంత్రి పనులకు.. ఆగడాలకు అడ్డుకట్ట పడటంలేదు. ఎప్పుడూ ఏదో ఒక రూపంలో ప్రపంచవ్యాప్తంగా ఆందోళన క్రియేట్ చేస్తోంది. తాజాగా చైనా లక్షలాదిమంది డీఎన్‌ఏ సేకరిస్తున్న విషయం వెలుగులోకి వచ్చింది. ప్రపంచ పైకప్పుగా గుర్తింపు పొందిన టిబెట్ స్వయంప్రతిపత్తి ప్రాంతం. ఈ ప్రాంతంపై తమకు సర్వాధికారాలు ఉన్నాయని చైనా వాదిస్తోంది. అంతేకాదు, 1951లో వేలాది మంది సైనికులను పంపి టిబెట్‌ను ఆక్రమించుకుంది. కొన్నేళ్లుగా టిబెట్ పౌరుల నుంచి చైనా బలవంతంగా డీఎన్‌ఏ నమూనాలను సేకరిస్తున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. ఇప్పటికే లక్షల మంది నమూనాలను సేకరించినట్లు తెలుస్తోంది. దీనిపై తాజాగా అమెరికా విదేశాంగశాఖ కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది..
టిబెట్ స్వతంత్ర ప్రాంతంలో ఆరేళ్లుగా సుమారు 9.2లక్షల నుంచి 12లక్షల మంది పౌరుల నుంచి డీఎన్‌ఏ నమూనాలను చైనా పోలీసులు సేకరించినట్లు సెప్టెంబర్ 2022లో సిటిజెన్ ల్యాబ్ నివేదిక వెల్లడించింది. ఆ ప్రాంతంలోని మూడో వంతు ప్రజల నుంచి సేకరించినట్లు అంచనా. తల్లిదండ్రులు, కుటుంబీకుల అనుమతి లేకుండా టిబెట్ పౌరుల డీఎన్‌ఏలను ఒక క్రమపద్ధతిలో సేకరిస్తున్నట్లు హ్యూమన్ రైట్స్ వాచ్ నివేదిక ఇటీవల వెల్లడించింది.
‘భారీ స్థాయిలో టిబెట్ పౌరుల డీఎన్‌ఏలను చైనా సేకరిస్తోందని వార్తలు వస్తున్నాయి. అక్కడి పౌరులపై నియంత్రణ, పర్యవేక్షణ కోసమే చైనా ఈ తరహా చర్యలకు పాల్పడటం ఆందోళన కలిగిస్తోందని అమెరికా విదేశాంగమంత్రి ఆంటోని బ్లింకెన్ పేర్కొన్నారు. మానవ జన్యు సమాచారం సేకరణ మానవ హక్కుల ఉల్లంఘన కిందికే వస్తుందన్నారు. మరోవైపు బ్లింకెన్ వ్యాఖ్యలను అంతర్జాతీయ టిబెట్ ప్రచార సంస్థ స్వాగతించింది.




మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..