AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

US Presidential polls: ట్రంప్‌ విజయానికి నిక్కీహేలీ బ్రేక్స్.. అధ్యక్షపదవి వైపు భారతీయ సంతతి మహిళ అడుగులు

డిస్ట్రిక్ట్‌ ఆఫ్‌ కొలంబియా ప్రైమరీ ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్‌ను ఓడించి నిక్కీ హేలీ రికార్డు సృష్టించారు. ట్రంప్‌ విజయపరంపరకు బ్రేక్‌ వేశారామె. డిస్ట్రిక్ట్‌ ఆఫ్‌ కొలంబియాలో ఉన్న 23 వేల ఓట్లలో నిక్కీ హేలీ 63 శాతం ఓట్లను దక్కించుకున్నారు. ట్రంప్‌ 33 శాతానికే పరిమితమయ్యారు. డెమోక్రాట్లకు పట్టున్న డిస్ట్రిక్ట్‌ ఆఫ్‌ కొలంబియాలో రిపబ్లికన్‌ పార్టీకి మెజార్టీ రాదని భావిస్తున్న తరుణంలో హేలీకి 63 శాతం ఓట్లు రావడం ఆసక్తికర పరిణామంగా మారింది. 

US Presidential polls: ట్రంప్‌ విజయానికి నిక్కీహేలీ బ్రేక్స్.. అధ్యక్షపదవి వైపు భారతీయ సంతతి మహిళ అడుగులు
Nikki Haley With Donald TruImage Credit source: File photo
Surya Kala
|

Updated on: Mar 05, 2024 | 7:07 AM

Share

రిపబ్లికన్‌ పార్టీ తరఫున అమెరికా అధ్యక్ష అభ్యర్థిత్వం ఆశిస్తున్న నిక్కీ హేలీకి ఫస్ట్‌ విక్టరీ లభించింది. డిస్ట్రిక్ట్‌ ఆఫ్‌ కొలంబియా ప్రైమరీ ఎన్నికల్లో తన ప్రత్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌పై ఆమె గెలుపొందారు. అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ముందు జరుగుతున్న ప్రైమరీ ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ తరఫున భారత సంతతికి చెందిన నిక్కీ హేలీ తొలి విజయాన్ని నమోదు చేశారు. డిస్ట్రిక్ట్‌ ఆఫ్‌ కొలంబియా ప్రైమరీ ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్‌ను ఓడించి నిక్కీ హేలీ రికార్డు సృష్టించారు. ట్రంప్‌ విజయపరంపరకు బ్రేక్‌ వేశారామె. డిస్ట్రిక్ట్‌ ఆఫ్‌ కొలంబియాలో ఉన్న 23 వేల ఓట్లలో నిక్కీ హేలీ 63 శాతం ఓట్లను దక్కించుకున్నారు. ట్రంప్‌ 33 శాతానికే పరిమితమయ్యారు. డెమోక్రాట్లకు పట్టున్న డిస్ట్రిక్ట్‌ ఆఫ్‌ కొలంబియాలో రిపబ్లికన్‌ పార్టీకి మెజార్టీ రాదని భావిస్తున్న తరుణంలో హేలీకి 63 శాతం ఓట్లు రావడం ఆసక్తికర పరిణామంగా మారింది.

తాజా విజయంతో రిపబ్లికన్‌ ప్రెసిడెన్షియల్‌ ప్రైమరీని గెలుచుకున్న తొలి మహిళగా హేలీ చరిత్ర సృష్టించారు. అదే విధంగా డెమొక్రాటిక్‌ లేదా రిపబ్లికన్‌ ప్రైమరీని గెలుచుకున్న తొలి ఇండియన్‌-ఆమెరికన్‌గా కూడా ఆమె నిలిచారు. తొలి విజయం ద్వారా నిక్కీ హేలీకి సూపర్‌ ట్యూస్‌డే పోటీకి ముందు ఊరట లభించినట్లైంది. సూపర్‌ ట్యూస్‌డే రోజు జరిగే ప్రాథమిక ఎన్నికల్లో కూడా నిక్కీ హేలీకి మెజార్టీ ప్రతినిధుల మద్దతు లభిస్తుందని భావిస్తున్నారు.

మరోవైపు ట్రంప్‌ ఇప్పటికే మిసోరి, మిషిగన్‌, న్యూ హాంప్‌షైర్‌, నెవాడా, సౌత్‌ కరోలినా ప్రైమరీల్లో నిక్కీ హేలీపై విజయం సాధించారు. ఆయన నెగ్గిన ప్రతినిధుల సంఖ్య 244కు చేరుకోగా హేలీ ఖాతాలో 24 మంది మాత్రమే ఉన్నారు. నవంబర్‌లో జరిగే అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్‌ పార్టీ తరపున అధ్యక్ష అభ్యర్థిగా నిలవాలంటే 1215 మంది ప్రతినిధులను నెగ్గాలి. మరోవైపు ట్రంప్‌కు అమెరికా సుప్రీంకోర్టులో భారీ విజయం దక్కింది. 2020లో అమెరికా క్యాపిటల్‌ భవనం దగ్గర జరిగిన అల్లర్లకు బాధ్యుడిని చేస్తూ రిపబ్లికన్‌ ప్రైమరీ బ్యాలెట్‌ నుంచి ట్రంప్‌ పేరును తొలగిస్తూ కొలరాడో అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు కొట్టివేసింది. మొదట కాంగ్రెస్‌ చర్య తీసుకోకుండా, అంతర్యుద్ధం తర్వాతి కాలంనాటి రాజ్యాంగ నిబంధనను రాష్ర్టాలు ప్రయోగించి, ప్రెసిడెన్షియల్‌ క్యాండిడేట్స్‌ను ఎన్నికలకు దూరంగా ఉంచలేవని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..