Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Donald Trump: అమెరికా ఫస్ట్‌ కోసం దేనికైనా సిద్ధం.. భారత్‌ సహా బ్రిక్స్‌ దేశాలకు ట్రంప్‌ మాస్‌ వార్నింగ్‌

భారతదేశం సహా బ్రిక్స్‌ దేశాలకు అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్‌ మాస్‌ వార్నింగ్‌ ఇచ్చారు. డాలర్‌ హవాకు గండి కొట్టేలా బ్రిక్స్‌ కరెన్సీ సృష్టించాలని చూస్తే కథ మరోలా ఉంటుందన్నారు. అమెరికాతో అమెరికాలో వ్యాపారం చేయాలనుకుంటే డాలర్‌లోనే ట్రేడ్‌ జరగాలన్నారు. కాదు కూడదంటే ఎక్స్‌పోర్ట్‌పై హాండ్రెడ్‌ పర్సెంట్‌ ట్యాక్స్‌ తప్పదని కన్నెర్ర చేశారు పెద్దన్న.

Donald Trump: అమెరికా ఫస్ట్‌ కోసం దేనికైనా సిద్ధం.. భారత్‌ సహా బ్రిక్స్‌ దేశాలకు ట్రంప్‌ మాస్‌ వార్నింగ్‌
Trump On Brics
Follow us
Balaraju Goud

|

Updated on: Jan 31, 2025 | 6:44 PM

అమెరికా ఫస్ట్‌ అంటూ దూకుడు కంటిన్యూ చేస్తున్నారు యూఎస్ ప్రెసిడెంట్‌ డోనాల్డ్‌ ట్రంప్‌. అక్రమ వలసలపై ఉక్కుపాదం మోపిన ట్రంప్‌.. ఇప్పుడు ఉరిమి.. ఉరిమి బ్రిక్‌ దేశాలపై గురిపెట్టారు. రావొచ్చు.. పోవచ్చు.. వ్యాపారం చేసుకోవచ్చు. కానీ మారకం మాత్రం డాలర్లలో ఉండాలి. మీ దేశం.. మీ కరెన్సీ.. అమెరికాలో ఎగుమతులు, దిగుమతులకు సంబంధించి లావాదేవీలు మాత్రం పక్కాగా డాలర్లలోనే జరగాలని అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్‌ స్పష్టం చేశారు. కాదు.. కూడదంటే వంద శాతం సుంకం తప్పదంటూ బ్రిక్స్‌ దేశాలకు వార్నింగ్‌ బెల్‌ ఇచ్చారు.

బ్రెజిల్‌, రష్యా, భారత్, చైనా, సౌతాఫ్రికా.. బ్రిక్స్‌ కూటమి ఏర్పడి 16 ఏళ్లు. ఆ తరువాత ఇండినేషియా, ఇరాన్‌, ఇథోపియా, అరబ్ ఎమిరేట్స్‌ వంటి దేశాలు బ్రిక్స్‌లో చేరాయి. 2023లో జరిగిన బ్రిక్స్‌ సమావేశంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ డాలర్ డామినేషన్‌కు కళ్లెం వేసేలా ఓ కీలక ప్రతిపాదన చేశారు. అప్పటి సూచనపై ఇప్పుడు ట్రిగ్గర్‌ ఎక్కు పెట్టారు అగ్రరాజ్యాధినేత డొనాల్డ్ ట్రంప్‌. అమెరికాతో వాణిజ్య బంధాన్ని కొనసాగించాలంటే, ట్రేడింగ్‌ డాలర్లలోనే జరగాలని మెలిక పెట్టనే పెట్టేశారు ట్రంప్‌. అమెరికన్‌ డాలర్‌ను పక్కన పెట్టాలని చూసే దేశాలు ఆర్ధికంగా అల్లకల్లోలం కాకతప్పదని డైరెక్ట్‌గా హెచ్చరిస్తున్నారు. ఇక, ఇప్పటికే ఇమిగ్రేషన్‌ విషయంలో ట్రంప్‌ కొత్త విధానాలు హడలెత్తిస్తున్నాయి. గోరుచుట్టపై రోకలిపోటులా ట్రంప్‌ ఇప్పుడు వాల్డ్‌ ట్రేడ్‌లో అమెరికన్‌ డాలర్‌ ఆధిపత్యం ఉండాలని పట్టుబడుతున్నారు. ముందు ముందు భారత్‌తో మనోడి వ్యవహారం ఎలా వుంటుందనే ఆందోళన మొదలైంది..!

మళ్లీ వచ్చాడా.. ఇక సచ్చామే.. అని కొందరు భయపడినట్టుగానే కఠిన నిర్ణయాలతో తన మార్క్‌ చాటుకుంటున్నారు డొనాల్డ్‌ ట్రంప్‌. వస్తూ వస్తూనే సంచలన ఎగ్జిక్యూటివ్‌ ఆర్డర్‌లను పాస్‌ చేసేశారు. ఇప్పుడు ఏకంగా బ్రిక్స్‌ దేశాలకు వార్నింగ్‌ ఇచ్చారు. ఇక బ్రిక్స్‌ నుంచి ఎలాంటి రియాక్షన్‌ వుంటుందో చూడాలి..!

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..