Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Plane Crash: కుప్పకూలిన మరో విమానం.. ఆరుగురు మృతి.. గృహాలు దగ్ధం!

Plane Crash: ఈ ప్రమాదానికి గల కారణాలపై సమగ్ర విచారణ జరుపుతామని పెన్సిల్వేనియా గవర్నర్ జోష్ షాపిరో తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతోంది. ఓ ఇంట్లో అమర్చిన సీసీటీవీ కెమెరాలో ఈ ఘటన మొత్తం రికార్డయింది..

Plane Crash: కుప్పకూలిన మరో విమానం.. ఆరుగురు మృతి.. గృహాలు దగ్ధం!
Follow us
Subhash Goud

|

Updated on: Feb 01, 2025 | 7:16 AM

అమెరికాలో మరో విమానం కుప్పకూలింది. ఫిలడెల్ఫియా విమానాశ్రయం నుంచి టేకాఫ్ అయిన కాసేపటికే విమానం కుప్పకూలింది. ఈ ఘటనలో ఇప్పటి వరకు 6 మంది మృతి చెందినట్లు నిర్ధారించారు. వాషింగ్టన్‌లోని రీగన్ నేషనల్ ఎయిర్‌పోర్ట్ సమీపంలో ప్రయాణీకుల జెట్, మిలిటరీ హెలికాప్టర్ మధ్య ఢీకొన్న రెండు రోజుల తర్వాత ఈ ప్రమాదం జరిగింది. రెండు రోజుల క్రితం జరిగిన ఈ ప్రమాదంలో 67 మంది చనిపోయారు.

వార్తా ఏజెన్సీలు AFP, రాయిటర్స్ ప్రకారం.. విమానం ఒక షాపింగ్ మాల్ సమీపంలో కూలిపోయింది. ఈశాన్య ఫిలడెల్ఫియా విమానాశ్రయం నుంచి విమానం బయలుదేరింది. అయితే టేకాఫ్ అయిన 30 సెకన్లకే క్రాష్ అయింది. ఈ ప్రమాదంలో అనేక భవనాలు అగ్నికి ఆహుతయ్యాయి. అనేక మంది గాయపడ్డారు. ఫిలడెల్ఫియా ఆఫీస్ ఆఫ్ ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్ సోషల్ మీడియాలో ప్రమాదాన్ని ధృవీకరించింది.

ఈ ప్రమాదానికి గల కారణాలపై సమగ్ర విచారణ జరుపుతామని పెన్సిల్వేనియా గవర్నర్ జోష్ షాపిరో తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతోంది. ఓ ఇంట్లో అమర్చిన సీసీటీవీ కెమెరాలో ఈ ఘటన మొత్తం రికార్డయింది. విమానం భవనంపై పడి క్షణాల్లో ఎలా నిప్పు బంతిలా మారిందో సీసీటీవీ ఫుటేజీ ద్వారా స్పష్టంగా కనిపిస్తోంది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి