Covid-19: కొవిడ్‌ అక్కడి ల్యాబ్ నుంచే బయటకు వచ్చింది.. యూఎస్ ఎనర్జీ డిపార్ట్‌మెంట్ నివేదికలో సంచలన విషయాలు

ప్రపంచాన్ని వణికించిన కరోనా జన్మస్థానం చైనాలోని వూహాన్ ల్యాబ్. ఇక్కడి వైరస్ వ్యాప్తి నుంచే జరిగినట్టు నివేదిక సమర్పించింది యూఎస్ ఎనర్జీ డిపార్ట్ మెంట్. ఈ సంస్థ కొత్తగా సేకరించిన నిఘా సమాచారం మేరకు.. ల్యాబ్ లీక్ పై ఒక నిర్ణయానికి వచ్చింది. ఈ విషయాన్ని వాల్ స్ట్రీట్ జర్నల్ తన కథనంలో పేర్కొంది

Covid-19: కొవిడ్‌ అక్కడి ల్యాబ్ నుంచే బయటకు వచ్చింది.. యూఎస్ ఎనర్జీ డిపార్ట్‌మెంట్ నివేదికలో సంచలన విషయాలు
Corona Virus
Follow us
Basha Shek

|

Updated on: Feb 28, 2023 | 7:00 AM

ప్రపంచాన్ని వణికించిన కరోనా జన్మస్థానం చైనాలోని వూహాన్ ల్యాబ్. ఇక్కడి వైరస్ వ్యాప్తి నుంచే జరిగినట్టు నివేదిక సమర్పించింది యూఎస్ ఎనర్జీ డిపార్ట్ మెంట్. ఈ సంస్థ కొత్తగా సేకరించిన నిఘా సమాచారం మేరకు.. ల్యాబ్ లీక్ పై ఒక నిర్ణయానికి వచ్చింది. ఈ విషయాన్ని వాల్ స్ట్రీట్ జర్నల్ తన కథనంలో పేర్కొంది. ఈ ఎనర్జీ డిపార్ట్ మెంట్ లో అత్యున్నత స్థాయి.. నిపుణులుండటంతో.. వీరిచ్చిన నివేదిక అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. అమెరికాలో జాతీయ పరిశోధనశాలలను ఈ సంస్థ పర్యవేక్షిస్తుంది. వీటిలో కొన్ని అత్యున్నత స్థాయి జీవ పరిశోధనలున్నాయి. గతంలో అమెరికాకు చెందిన కొన్ని విభాగాలు కోవిడ్ పుట్టుకపై భిన్న అభిప్రాయాలను వ్యక్తం చేశాయి. యూఎస్ ఎనర్జీ డిపార్ట్ మెంట్ కూడా గతంలో కోవిడ్ పుట్టుక ల్యాబ్ లోనే అని కరెక్టుగా చెప్పలేక పోయింది. కానీ తాజాగా ఇచ్చిన ఐదు పేజీల నివేదికలో ఈ విభాగం కూడా చైనా వైపే వేలెత్తి చూపింది. తన నెట్ వర్క్ లోని ల్యాబ్ ల నుంచి వచ్చిన సమాచారం ఆధారంగా దీన్ని తయారు చేసింది. గతంలో అమెరికా అత్యున్నత స్థాయి దర్యాప్తు సంస్థ FBI సైతం చైనాలోని ల్యాబ్ నుంచి ప్రమాదవ శాత్తూ వైరస్ లీకై ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తం చేసింది. మరోవైపు అమెరికా కాంగ్రెస్ లోని రిపబ్లికన్లు కోవిడ్ పుట్టుకపై మరింత సమాచారం తెప్పించేందుకు బైడెన్ కార్యవర్గం.. మరిన్ని వనరులను ఇవ్వాలని కోరుతున్నారు. వాల్ స్ట్రీట్ జర్నల్ రాసిన కథనంపై స్పందించడానికి జాతీయ భద్రతా విభాగం నిరాకరించింది. అధ్యక్షుడు బైడెన్ ఇప్పటికే పలు ఇంటిలిజెన్స్ సంస్థలను కోవిడ్ పై వీలైనంత ఎక్కువ సమాచారం సేకరించాలని సూచించారు.

కాగా 2002లో సార్స్ వైరస్ విజృంభించాక.. చైనాలో వూహాన్ ల్యాబ్ ను ఏర్పాటు చేశారు. దీనిలో పలు ప్రయోగశాలలున్నాయి. వూహాన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ, చైనీస్ సెంటర్ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రవెన్షన్‌, వుహాన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ బయోలాజికల్‌ ప్రొడక్ట్స్‌ వంటి సంస్థలు ఉన్నాయి. ఇక్కడికి కొంత దూరంలోని సముద్రజీవుల మార్కెట్‌ను వైరస్‌కు కేంద్రంగా భావించారు. కానీ, చైనా శాస్త్రవేత్తలు మాత్రం దీని వ్యాప్తికి కారణమైన కేంద్రంగానే చూస్తున్నా.. తొలిసారి మనుషులకు సోకిన ప్రదేశం మాత్రం వేరే ఉంటుందని భావిస్తున్నారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..

ఇవి కూడా చదవండి
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే