AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

USA: వావ్ గ్రేట్.. ఐదుగురి కోసం 49 వేల కోట్లు చెల్లించిన అమెరికా..

కొన్ని సంవత్సరాల పాటుగా ఇరాన్‌ చేతిలో బందీలుగా ఉన్నటువంటి ఐదుగురు అమెరికన్లు ఎట్టకేలకు విడుదలైపోయారు. చివరికి తమ స్వదేశానికి ప్రయాణమయ్యారు. అయితే ఈ విషయంలో మాట్లాడుకోవడానికి అసలు ఏం ఉంది అని అనుకుంటే పొరపాటే. ఎందుకంటే వాస్తవానికి ఆ ఐదుగురుని విడుదల చేయించేందుకు అమెరికా ఏకంగా 6 బిలియన్‌ డాలర్లను వదులుకోవాల్సి వచ్చిన పరిస్థితి ఏర్పడింది.

USA: వావ్ గ్రేట్.. ఐదుగురి కోసం 49 వేల కోట్లు చెల్లించిన అమెరికా..
Americans
Aravind B
|

Updated on: Sep 19, 2023 | 7:00 PM

Share

కొన్ని సంవత్సరాల పాటుగా ఇరాన్‌ చేతిలో బందీలుగా ఉన్నటువంటి ఐదుగురు అమెరికన్లు ఎట్టకేలకు విడుదలైపోయారు. చివరికి తమ స్వదేశానికి ప్రయాణమయ్యారు. అయితే ఈ విషయంలో మాట్లాడుకోవడానికి అసలు ఏం ఉంది అని అనుకుంటే పొరపాటే. ఎందుకంటే వాస్తవానికి ఆ ఐదుగురుని విడుదల చేయించేందుకు అమెరికా ఏకంగా 6 బిలియన్‌ డాలర్లను వదులుకోవాల్సి వచ్చిన పరిస్థితి ఏర్పడింది. అంటే భారత కరెన్సీలో ఆ డాలర్ల విలువను చూసుకుంటే అక్షరాలా 49వేల కోట్ల రూపాయలు. ఇరాన్, అమెరికా దేశాల మధ్య సుదీర్ఘకాలంగా విరోధం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ రెండు దేశాల మధ్య ఈ అరుదైన మార్పిడి ఒప్పందం జరిగింది. అయితే ఆ అయిదుగురు అమెరికన్లలో నలుగురు పురుషులు ఉండగా.. ఒక మహిళ ఉన్నారు.

వాళ్లందరూ కూడా ఎనిమిదేళ్ల పాటుగా ఇరాన్‌ రాజధాని అయిన టెహ్రాన్‌కు చెందిన అత్యంత క్రూరమైన ఎవిన్‌ జైలులో బందీలుగా ఉండిపోయారు. రాజకీయంగా లబ్ధి పొందడం కోసం ఆధారాలు లేని అభియోగాలతో ఇరాన్‌ వారిని బందీలుగా మార్చినట్లు అమెరికా ఆరోపణలు చేస్తూ వస్తోంది. అయితే ఇప్పుడు జరిగినటువంటి తాజా ఒప్పందంలో ఖతార్‌ మధ్యవర్తిగా ఉంది. అయితే ఆ మార్పిడి ఒప్పందం చివరి దశకు చేరుకుందనే సూచనలు రావడంతో.. ఇరాన్‌ ప్రభుత్వం ఎట్టకేలకు కీలక నిర్ణయం తీసుకుంది. ఆ ఐదుగురిని ఎవిన్‌ జైలు నుంచి సురక్షిత ప్రాంతానికి తరలించింది. దక్షిణ కొరియాలో నిలిచిపోయిన ఇరాన్‌కు చెందిన నిధులు అనేవి దోహా బ్యాంకులకు రాగానే.. ఈ పౌరులు టెహ్రాన్‌ కూడా నుంచి దోహాకు వచ్చేశారు. అనంతరం ఆ తర్వాత అక్కడి నుంచి అమెరికాకు పయనమయ్యారు.

అంతేకాదు.. అమెరికా ఆంక్షలను ఉల్లంఘించారనే ఆరోపణలు రావడం వల్ల అమెరికాలోని జైల్లో ఉన్నటువంటి ఐదుగురు ఇరానియన్లకు కూడా ఈ ఒప్పందంలో భాగంగా క్షమాభిక్ష వచ్చింది. దీంతో ఈ ఖైదీల మార్పిడి కోసం ఖతార్‌ మధ్యవర్తిగా ఉంది. ఇందుకు సంబంధించి గత ఏడాది ఫిబ్రవరి నెలలోనే చర్చలు ప్రారంభమయ్యాయి. అయితే తొమ్మిది రౌండ్లలో ఈ చర్చలు జరిగాయి. దీనికోసం ఖతార్‌ అధికారులు టెహ్రాన్‌, వాషింగ్టన్ మధ్య తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే ఇప్పుడు ఎట్టకేలకు ఇరాన్‌ జైల్లో బంధిలైనటువంటి ఐదుగురు అమాయకులైన అమెరికన్లు తమ స్వదేశానికి వెళ్తున్నారు. వాళ్లు ఆ జైల్లో అంతులేని వేదనను అనుభవించినట్లు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పేర్కొన్నారు. తమను కాపాడేందుకు జో బైడెన్‌ అత్యంత క్లిష్టమైన నిర్ణయం తీసుకున్నారని.. ఇందుకోసం రాజకీయాలను కూడా పక్కనపెట్టి తమ ప్రాణాలకు ప్రాధాన్యం ఇచ్చిందుకు వారు బైడెన్‌కు కృతజ్ఞతలు చెప్పారు.

ఇవి కూడా చదవండి

మరో విషయం ఏంటంటే ఈ 6 బిలియన్ల డాలర్లు.. అమెరికా ఆంక్షల వల్ల స్తంభించిపోయినటువంటి ఇరాన్‌ ఆస్తుల్లోని భాగం కాదని సంబంధిత వర్గాలు పేర్కొ్న్నాయి అలాగే ప్రస్తుత ఒప్పందాన్ని కూడా రిపబ్లికన్లు ఖండిస్తున్నారు. అమెరికన్ల విడుదలకు ప్రతిగా చెల్లింపులు చేయండం, ఆంక్షల్లో సడలింపుగా వ్యాఖ్యానించారు. అలాగే ఉగ్రవాదాన్ని పెంచిపోషిస్తోన్న దేశాల వరుసలో ముందు వరుసలో ఉన్నటువంటి ఇరాన్‌కు అమెరికా నిధులు బదిలీ చేసిందని ఆరోపణలు చేశారు.

బ్యాట్స్ మెన్ల బాదుడు..బౌలర్ల ఏడుపు.. ఒకే టీ20 మ్యాచ్లో 449 రన్స్
బ్యాట్స్ మెన్ల బాదుడు..బౌలర్ల ఏడుపు.. ఒకే టీ20 మ్యాచ్లో 449 రన్స్
ఓర్నీ.! పెద్ద బాంబ్ పేల్చిన వాతావరణ శాఖ
ఓర్నీ.! పెద్ద బాంబ్ పేల్చిన వాతావరణ శాఖ
సూర్య స్థానంలో శివ కార్తికేయన్.. 'పురనానూరు' కథలో జరిగిన మార్పులు
సూర్య స్థానంలో శివ కార్తికేయన్.. 'పురనానూరు' కథలో జరిగిన మార్పులు
మూడు పొయ్యిలున్న గ్యాస్ పై వంట చేస్తున్నారా.. ఇక మీరు అప్పుల పాలే
మూడు పొయ్యిలున్న గ్యాస్ పై వంట చేస్తున్నారా.. ఇక మీరు అప్పుల పాలే
వాస్తు టిప్స్ : దరిద్రంపోయి కోటీశ్వరులు అవ్వాలా..
వాస్తు టిప్స్ : దరిద్రంపోయి కోటీశ్వరులు అవ్వాలా..
వయస్సు పెరిగినా యంగ్‌గా కనిపించాలా?.. హీరోయిన్ ఫిట్‌నెస్ సీక్రెట్
వయస్సు పెరిగినా యంగ్‌గా కనిపించాలా?.. హీరోయిన్ ఫిట్‌నెస్ సీక్రెట్
ఢిల్లీ టీమ్‎కి బై బై..కింగ్ కోహ్లీ సడన్ ఎగ్జిట్ వెనుక నిజం ఇదే
ఢిల్లీ టీమ్‎కి బై బై..కింగ్ కోహ్లీ సడన్ ఎగ్జిట్ వెనుక నిజం ఇదే
Rewind 2025: టాలీవుడ్‌పై బాలీవుడ్ స్టార్ల దండయాత్ర..!
Rewind 2025: టాలీవుడ్‌పై బాలీవుడ్ స్టార్ల దండయాత్ర..!
కేబినెట్‌విస్తరణపై సీఎం రేవంత్ కసరత్తు.. రేసులో ఉన్నది ఎవరు?
కేబినెట్‌విస్తరణపై సీఎం రేవంత్ కసరత్తు.. రేసులో ఉన్నది ఎవరు?
సూర్యపై వేటు, గిల్‌కు నోఛాన్స్.. భారత టీ20 కెప్టెన్‌గా ఎవరంటే?
సూర్యపై వేటు, గిల్‌కు నోఛాన్స్.. భారత టీ20 కెప్టెన్‌గా ఎవరంటే?