AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

9 Kg Onion: ఉల్లిగడ్డ.. కాదు కాదు ఉల్లి కొండ.. దీని బరువు తెలిస్తే నోరెళ్లబెడతారు..

Giant Onion Viral Photo: బ్రిటన్‌లోని గ్వెర్న్సే ప్రాంతానికి చెందిన రైతు గారెత్ గ్రిఫిన్ ఈ భారీ ఉల్లిపాయ పండించాడు. దీంతో ఇది ప్రపంచ రికార్డు క్రియేట్ చేసింది. ఆరోగేట్ ఆటమ్ ఫ్లవర్ షోలో భారీ ఉల్లిని ప్రదర్శనకు తీసుకొచ్చాడు. తాను ఆ ప్రదర్శనకు తీసుకొస్తున్నప్పుడు అతనికి ఈ సంగతి తెలియదుజ. ఆ భారీ ఉల్లిని చూసిన అధికారులు ఇది ప్రపంచ రికార్డు అని చెప్పడంతో అతను షాక్ అయ్యాడు. హారోగేట్ ఫ్లవర్ షో ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేశారు.

9 Kg Onion: ఉల్లిగడ్డ.. కాదు కాదు ఉల్లి కొండ.. దీని బరువు తెలిస్తే నోరెళ్లబెడతారు..
Uk Man Grows Huge 8.97 Kg Onion
Sanjay Kasula
|

Updated on: Sep 19, 2023 | 9:06 PM

Share

మన దగ్గర ఉల్లి లొల్లి చేయడం.. కన్నీళ్లు పెట్టించడం.. పంచాయీతీలు పెట్డం మనం చాలా సార్లు చూశాం.. కానీ.. అదే ఉల్లి అక్కడ రికార్డులు క్రియేట్ చేసింది. ఆ రైతును హిస్టరీల్లో ఎక్కించింది. సరికొత్తగా చూపించింది. అతని శ్రమకు గుర్తింపును తెచ్చిపెట్టింది. కారణం తెలిస్తే మీరు కూడా వావ్ ..! అంటారు. కారణం ఏంటంటే.. బ్రిటన్‌కు చెందిన ఓ రైతు తన వ్యవసాయ క్షేత్రంలో ఏకంగా 8.97 కిలోల బరువున్న ఉల్లిగడ్డను పండించాడు. బ్రిటన్‌లోని గ్వెర్న్సే ప్రాంతానికి చెందిన రైతు గారెత్ గ్రిఫిన్ ఈ భారీ ఉల్లిపాయ పండించాడు. దీంతో ఇది ప్రపంచ రికార్డు క్రియేట్ చేసింది. ఆరోగేట్ ఆటమ్ ఫ్లవర్ షోలో భారీ ఉల్లిని ప్రదర్శనకు తీసుకొచ్చాడు. తాను ఆ ప్రదర్శనకు తీసుకొస్తున్నప్పుడు అతనికి ఈ సంగతి తెలియదుజ. ఆ భారీ ఉల్లిని చూసిన అధికారులు ఇది ప్రపంచ రికార్డు అని చెప్పడంతో అతను షాక్ అయ్యాడు. హారోగేట్ ఫ్లవర్ షో ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేశారు.

సోషల్ మీడియాలో ఇది చూసిన నెటిజన్లు ఇది అద్భుతమంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇదే ప్రపంచంలో బిగ్ ఆనియన్ అంటూ కామెంట్లు పోస్టు చేస్తున్నారు. ఈ ఉల్లిగడ్డ 8.9 కిలోల బరువు ఉండగా.. ఇది గుండ్రగా కాకుండా.. పొడవు 21 అంగుళాలు పెరిగింది. రికార్డును బ్రేక్ చేయడానికి 12 ఏళ్లుగా గ్రిఫిన్ చేస్తున్న అతని శ్రమ ఫలించింది. ఆ మొక్కకు కవాల్సిన దానికంటే అదనంగా లైటింగ్, ఆటోమేటిక్ ఇరిగేషన్ వంటి స్పెషల్ ట్రీట్మెంట్ అవ్వడంతో అది ఇంతలా ఊరిందని తెలిపాడు.

ఇవి కూడా చదవండి

అయితే, ఇదే అతి పెద్ద ఉల్లిగడ్డ అంటూ ప్రచారం మొదలైంది. కానీ, దీన్ని అధికారికంగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ఇంకా గుర్తించ లేదు. గ్రిఫిన్ తండ్రి కూడా గతంలో పెద్ద సైజు ఉల్లిగడ్డలను దిగుమతి చేశాడు. ఈ బిగ్ ఆనియన్ వంటకు పనికొస్తుంది కానీ సైజు ఉల్లిగడ్డలు సైతం వంట చేసుకోతగినవేనని, రుచి మాత్రం కొంచెం తక్కువగా ఉంటుందని గ్రిఫిన్ ప్రకటించారు.

ఇంగ్లాండ్‌లోని యార్క్‌షైర్‌లో హారోగేట్ ఆటం ఫ్లవర్ షో పేరుతో ఏప్రిల్, సెప్టెంబర్ నెలల్లో ఏడాదికి రెండుసార్లు ఒక షో నిర్వహిస్తారు. ఈ ఏడాది రెండవ సీజన్ నార్త్ యార్క్‌షైర్‌లోని రిపాన్ సమీపంలోని మౌబీ హాల్‌లోని ఒక   జరుగుతోంది.  ఇదిలా ఉంటే ఈ షోలో చాలా ప్రత్యేకతలు కనిపించాయి కానీ అందులో చాలా ప్రత్యేకం ఉల్లిపాయ గురించి షోలో పెద్దగా చర్చ జరగడమే కాకుండా ఇంటర్నెట్ మీడియాలో వైరల్ అవుతున్న దాని ఫోటో నిజమా కాదా అనే ఉత్సుకతను పెంచుతోంది.

ఇంత పెద్ద ఉల్లిపాయను చూసిన షో నిర్వాహకులు ఇది ప్రపంచ రికార్డు అవుతుందని ఆశాభావం వ్యక్తం చేయగా, రైతు గారెత్ గ్రిఫిన్ దానిని పట్టుకున్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. షో అధికారిక ఇన్‌స్టాగ్రామ్ పేజీ లో పోస్ట్ చేసిన ఈ ఫోటోకు ఇప్పటివరకు 86 లైక్‌లు వచ్చాయి. దీనిపై రకరకాల కామెంట్లు కూడా వస్తున్నాయి. ఒక వినియోగదారు ఇలా వ్రాశారు, ‘ఈ ఉల్లిపాయతో మీరు ఎన్ని స్పఘెట్టి బోలోగ్నీస్ తయారు చేయవచ్చు’. మరికొందరు దీనిని అద్భుతమైన విజయమని కూడా పేర్కొన్నారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం