మత్స్యకారుల వలకు అరుదైన చేప.. ఇది చేపా.. ముళ్ళ పందా !!

మత్స్యకారుల వలకు అరుదైన చేప.. ఇది చేపా.. ముళ్ళ పందా !!

Phani CH

|

Updated on: Sep 19, 2023 | 5:35 PM

బాపట్ల జిల్లా వేటపాలెం మండలం రామాపురంలో అరుదైన చేప మత్స్యకారుల వలకు చిక్కింది. ఈ అరుదైన చేపను చూసి మత్స్యకారులు అవాక్కయ్యారు. ఈ చేపను పఫ్ఫర్ ఫిష్ గా పిలుస్తారు. దీన్నే ముళ్లపంది చేపగా కూడా పిలుస్తారు. ఈ చేప ప్రమాదం ఉందని తెలిస్తే.. వెంటనే పరిమాణం పెరగడం, ముడుచుకుని బంతిలా మారి శత్రువులకు చిక్కకుండా తప్పించుకోవడం దీని ప్రత్యేకతని మత్స్యకారులు చెబుతున్నారు.

బాపట్ల జిల్లా వేటపాలెం మండలం రామాపురంలో అరుదైన చేప మత్స్యకారుల వలకు చిక్కింది. ఈ అరుదైన చేపను చూసి మత్స్యకారులు అవాక్కయ్యారు. ఈ చేపను పఫ్ఫర్ ఫిష్ గా పిలుస్తారు. దీన్నే ముళ్లపంది చేపగా కూడా పిలుస్తారు. ఈ చేప ప్రమాదం ఉందని తెలిస్తే.. వెంటనే పరిమాణం పెరగడం, ముడుచుకుని బంతిలా మారి శత్రువులకు చిక్కకుండా తప్పించుకోవడం దీని ప్రత్యేకతని మత్స్యకారులు చెబుతున్నారు. నీరు, గాలితో నిండి పోయి చేప.. ఆకారం కొన్ని సందర్భాల్లో గుండ్రటి బంతిలా మారుతుంది. చేపలు పట్టే వలను సైతం కోరికేస్తుందట. దీంతో వలకు చిక్కిన వెంటనే దీన్ని వల నుంచి తప్పించేస్తారు మత్స్యకారులు. పోర్కుపైన్ ఫిష్ గా పిలుచుకునే ఈ ముళ్ళపంది చేప బెలూన్ ఫిష్ లాగా కనిపిస్తుంది. కానీ దాని శరీరం బూడిద రంగులో ఉంటుంది. నల్ల మచ్చలతో తెల్లటి బొడ్డుతో ఉంటుంది. దాని శరీరం అంతటా ముళ్ళు ఉంటాయి. శరీరంపై ఉన్న ముళ్ళు నిటారుగా నిక్కబొడుచుకుని శత్రువుకు గుచ్చుకునేలా చేస్తుంది. ఎవరూ దీని జోలికి రాకుండా వెళ్ళిపోవాలనే ఉద్దేశ్యంతో ఇలా చేస్తుందట. ఇది దిబ్బలు, గుహలు, అంచుల దగ్గర ఒంటరిగా జీవించడం, రాత్రి పూట మాత్రమే వేటాడేందుకు ఇష్టపడుతుంది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఆకట్టుకున్న తండ్రి ప్రేమ.. జుగాద్ కా బాప్.. నెట్టింట తెగ వైరల్ అవుతున్న వీడియో

Ganesh Chaturthi: భక్తులను ఆకట్టుకుంటున్న చాక్లెట్ వినాయకుడు..

మనిషికి పంది కిడ్నీలో కీలక విజయం !! ఏకంగా రెండు నెలలు పని చేసింది

అద్భుత కళ !! ముని గోటిపై ఇమిడిపోయేలా బుజ్జి గణపతి

పొత్తి కడుపులో.. బొజ్జ గణపయ్యా !! యోగాతో కళాఖండాలు